BRS MP Candidates 2024 : ఆదిలాబాద్, మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు-brs announced candidates for malkajgiri and adilabad loksabha seats 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Brs Mp Candidates 2024 : ఆదిలాబాద్, మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు

BRS MP Candidates 2024 : ఆదిలాబాద్, మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 14, 2024 10:21 PM IST

BRS Loksabha Candidates 2024: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్(BRS Party) పార్టీ. మల్కాజ్ గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు పేరు ఖరారైంది.

బీఆరఎస్ అభ్యర్థులు
బీఆరఎస్ అభ్యర్థులు

BRS Loksabha Candidates 2024: పార్లమెంట్ ఎన్నికలకు(Loksabha Elections 2024) సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది బీఆర్ఎస్ పార్టీ(BRS Party). ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా… తాజాగా మరో రెండు స్థానాలకు క్యాండెంట్లను ఖరారు చేసింది. ఇందులో కీలకమైన మల్కాజ్ గిరి స్థానం నుంచి రాగిడి లక్ష్మారెడ్డికి అవకాశం దక్కింది. ఇక ఆదిలాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) నిర్ణయం తీసుకున్నారు.

yearly horoscope entry point

రాగిడి లక్ష్మారెడ్డి చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఉప్పల్ నియోజకవర్గ టికెట్ ను ఆశించి భంగపడ్డారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో బండారి లక్ష్మారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దక్కగా రాగిడి లక్ష్మారెడ్డికి ఛాన్స్ దక్కలేదు. ప్రస్తుతం మల్కాజ్ గిరి అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఆదిలాబాద్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేరును ఖరారు చేసింది. నిజానికి గత ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. ఈ సీటును కోవా లక్ష్మీకి కేటాయించింది. ఆ సమయంలోనే ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామని హామీనిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అందుకు తగ్గట్టుగానే ఆదిలాబాద్ (ఎస్టీ రిజర్వ్) నియోజకవర్గం నుంచి ఆయనకు ఛాన్స్ ఇచ్చింది.

BRS Loksabha Candidates 2024 :బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా:

  1. చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాబాద్
  2. వరంగల్ (ఎస్సీ )-డాక్టర్ కడియం కావ్య
  3. మల్కాజ్ గిరి - రాగిడి లక్ష్మారెడ్డి
  4. ఆదిలాబాద్ - ఆత్రం సక్కు
  5. జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్
  6. నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్
  7. కరీంనగర్ - బోయినిపల్లి వినోద్ కుమార్
  8. పెద్దపల్లి(ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్
  9. మహబూబ్‌ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి
  10. ఖమ్మం -నామా నాగేశ్వరరావు
  11. మహబూబాబాద్(ఎస్టీ)- మాలోత్ కవిత

రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఇప్పటి వరకు బీఆర్ఎస్…. 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరోవైపు బీఎస్పీ పార్టీతో పొత్తు(BRS BSP Allaince) కుదిరిన నేపథ్యంలో…. ఒకటి నుంచి రెండు సీట్లు ఆ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. నాగర్ కర్నూల్ తో పాటు మరో సీటు ఇస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.

Whats_app_banner