BRS MP Candidates : మరో నాలుగు లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు, కవిత పోటీ ఎక్కడ?
BRS MP Candidates : మరో నాలుగు లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల, వరంగల్, నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు.
BRS MP Candidates : మరో నాలుగు లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR) అభ్యర్థులను ఖరారు చేశారు. బుధవారం సాయంత్రం చేవెళ్ల, వరంగల్, నిజామాబాద్, జహీరాబాద్(Zaheerabad) లోక్ సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. చేవెళ్ల, వరంగల్ పార్లమెంటు స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ నుంచి బీఆర్ఎస్ చేరారు కాసాని. అదే విధంగా వరంగల్ ముఖ్యనేతలతో జరిపిన చర్చల అనంతరం సమష్టి నిర్ణయంతో వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను అధినేత కేసీఆర్ ప్రకటించారు. అలాగే జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. గతంలో నిజామాబాద్(Nizamabad) స్థానం నుంచి కేసీఆర్ కుమార్తె కవిత(K Kavitha) ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కవితకు(Kalvakuntla Kavaitha) సీటు కేటాయించలేదు కేసీఆర్. అయితే ఆమెను లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దింపుతారని ప్రచారం జరిగింది. అయితే నిజామాబాద్ టికెట్ ను వేరొకరికి కేటాయించడంతో...కవిత పోటీపై ఆసక్తి నెలకొంది.

బీఆర్ఎస్ ఇప్పటి వరకూ 9 మంది లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. బుధవారం సాయంత్రం 4గురి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వరంగల్ నుంచి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌కు టికెట్ కేటాయించింది. మొత్తంగా 9 మంది అభ్యర్థులను ప్రకటించగా...ఇంకా 8 స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. దీంతో బీఆర్ఎస్, బీఎస్పీ(BRS BSP) ఉమ్మడి అభ్యర్థులపై ప్రకటన రావాల్సి ఉంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో? స్పష్టత వచ్చిన తర్వాత మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే లోక్ సభ నియోజకవర్గాల వారిగా కేసీఆర్(KCR) ముఖ్యనేతలతో భేటీ అవుతున్నారు.
బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులు
- ఖమ్మం -నామా నాగేశ్వరరావు
- మహబూబాబాద్(ఎస్టీ)- మాలోత్ కవిత
- కరీంనగర్ - బోయినిపల్లి వినోద్ కుమార్
- పెద్దపల్లి(ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్
- మహబూబ్‌నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి
- చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
- వరంగల్ (ఎస్సీ )-డాక్టర్ కడియం కావ్య
- జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్
- నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్
సంబంధిత కథనం