Election Results 2024: ఎన్డీయే, బీజేపీలను ఇండియా కూటమి నిలువరించడానికి దోహదపడిన ముఖ్యమైన అంశాలు ఇవే..-5 crucial things that helped india bloc hold nda under 300 seats ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Election Results 2024: ఎన్డీయే, బీజేపీలను ఇండియా కూటమి నిలువరించడానికి దోహదపడిన ముఖ్యమైన అంశాలు ఇవే..

Election Results 2024: ఎన్డీయే, బీజేపీలను ఇండియా కూటమి నిలువరించడానికి దోహదపడిన ముఖ్యమైన అంశాలు ఇవే..

HT Telugu Desk HT Telugu
Jun 04, 2024 08:15 PM IST

Election Results 2024: 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయేకు 353 సీట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కేవలం 91 సీట్లు మాత్రమే గెలుచుకుంది. విపక్షాలు తమ పనితీరును మెరుగుపరుచుకున్నాయని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తారుమారు చేశాయని స్పష్టమవుతోంది.

ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జన ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ
ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జన ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ నంబర్ అయిన 272 లోక్ సభ స్థానాలను బీజేపీ సొంతంగా గెల్చుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కోల్పోతుంది. అయితే జూన్ 4న సాయంత్రం 6 గంటల సమయానికి ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 233 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 98 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 292 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

2019 లో సొంతంగా 303 సీట్లు

2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయేకు 353 సీట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కేవలం 91 సీట్లు మాత్రమే గెలుచుకుంది. విపక్షాలు తమ పనితీరును మెరుగుపరుచుకున్నాయని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తారుమారు చేశాయని 2024 ఫలితాల ద్వారా స్పష్టమవుతోంది. ఎన్డీయేను 300 సీట్ల లోపు ఉంచడంలో భారత కూటమికి సహాయపడిన కీలక అంశాలు ఇదిగో..

మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత

జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో కొనసాగిన ఏకైక ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించబోతున్నారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి సునాయాసంగా విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా అది జరగలేదు. 2014 నుంచి అధికారంలో కొనసాగిన మోదీ పాలనపై కొంతవరకు ప్రభుత్వ వ్యతిరేకత నెలకొన్నది. ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించినందువల్లనే, మోడీ ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి తెరతీశారు. ‘‘వికసిత్ భారత్ ప్రచారం నుండి హిందూ-ముస్లిం విద్వేష ప్రసంగాల వరకు, ప్రధాని మోదీ ప్రచారం ఈ ఎన్నికలను బీజేపీ పోలరైజ్ చేయాలనుకుంటోందని స్పష్టంగా సూచించింది’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక విశ్లేషకుడు చెప్పారు.

యూపీ కే లడ్కే

2017 యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక్కటయ్యారు. కానీ అప్పుడు అది విజయవంతం కాలేదు. అయితే వీరిద్దరూ చేతులు కలిపి ఇప్పుడు 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేసి, మంచి ఫలితాలను రాబట్టారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ లు 40 కి పైగా స్థానాల్లో విజయం సాధించనున్నారు. దాంతో, వీరిద్దరిపై ‘యూపీ కే లడ్కే’ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 80 స్థానాలకు గాను బీజేపీ 62 సీట్లు గెలుచుకుంది.

సరైన అభ్యర్థులు

కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను బరిలోకి దింపింది. రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీ రెండు స్థానాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధిస్తున్నారు. పంజాబ్ విషయంలో కూడా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు 13 సీట్లలో 10 స్థానాలను గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా సింగ్ సహా కీలక నేతలను బరిలోకి దింపింది.

ప్రియాంక గాంధీ ఫ్యాక్టర్

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, వీలైనన్ని స్థానాల్లో ప్రచారం నిర్వహించి, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. తన సోదరుడు రాహుల్ గాంధీ మాదిరిగానే ఆమె కూడా మోదీ విమర్శలకు, వ్యాఖ్యలకు శక్తివంతమైన ప్రసంగాలతో ప్రతిస్పందించారు. 1991లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన బాధాకరమైన జ్ఞాపకాలను కూడా ఆమె తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. ప్రియాంక రాయ్ బరేలీలో మకాం వేసి తన సోదరుడు రాహుల్ గాంధీ కోసం, అలాగే కెఎల్ శర్మ కోసం ప్రచారం చేశారు.

ఇండియా కూటమి

అధికార బీజేపీని ఓడించడం లక్ష్యంగా సంవత్సరం క్రితం ఏర్పడిన విపక్ష పార్టీల కూటమి కూడా ఈ ఎన్నికల్లో బీజేపీని నిలువరించడంలో కీలక పాత్ర పోషించింది. ఇండియా కూటమి లోని ప్రతిపక్ష పార్టీల ఐక్యతే అధికార ఎన్డీయేకు వ్యతిరేకంగా బలమైన పోరాటం చేయడానికి దోహదపడింది. ఢిల్లీలో ఉమ్మడిగా పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్ లు పంజాబ్ లో విడివిడిగా పోటీ చేసి 13 స్థానాలకు గాను 10 స్థానాలను గెలుచుకున్నాయి. గత ఏడాది జూన్ లో తొలిసారి సమావేశమైన దాదాపు 28 పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవాలని నిర్ణయించాయి.

WhatsApp channel