Etcherla Election Fight: ఎచ్చెర్ల ఎన్నికల్లో గెలుపెవరిది? గొర్లె Vs నడికుదిటి, బీజేపీ బోణీ కొడుతుందా?-who won the election gorle vs nadikuditi will bjp win ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Etcherla Election Fight: ఎచ్చెర్ల ఎన్నికల్లో గెలుపెవరిది? గొర్లె Vs నడికుదిటి, బీజేపీ బోణీ కొడుతుందా?

Etcherla Election Fight: ఎచ్చెర్ల ఎన్నికల్లో గెలుపెవరిది? గొర్లె Vs నడికుదిటి, బీజేపీ బోణీ కొడుతుందా?

Sarath chandra.B HT Telugu
Apr 26, 2024 12:11 PM IST

Etcherla Election Fight: ఎచ్చెర్ల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎచ్చెర్ల టిక్కెట్ ఆశించిన కళా వెంకట్రావు స్థానంలో కూటమి తరపున నడికుదిటి ఈశ్వరరావు అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా రెండోసారి గెలుపు కోసం గొర్లె కిరణ్ కుమార్‌ ప్రయత్నిస్తున్నారు.

ఎచ్చెర్ల ఎన్నికల్లో గెలిచేది ఎవరు?
ఎచ్చెర్ల ఎన్నికల్లో గెలిచేది ఎవరు?

Etcherla Election Fight: శ్రీకాకుళం Srikakulam జిల్లా ఎచ్చెర్లలో ఎన్నికలు Election ఆసక్తికరంగా మారాయి. టీడీపీ సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు స్థానంలో తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర‌్థి Nadikuditi Eswar Rao నడికుదిటి ఈశ్వర్ రావు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి కళా వెంకట్రావు ఓటమి పాలయ్యారు. Kalavenkatrao కళా వెంకట్రావుపై gorle Kiran గొర్లె కిరణ్‌కుమార్‌ 18,711 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో గొర్లె కిరణ్ కుమార్ వైసీపీ తరపున పోటీ చేస్తుండగా ఈశ్వరరావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

గత ఎన్నికల్లో జగన్ హామీలు:

  • శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీలో అదనపు భవనాల పూర్తికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఇక్కడ అదనపు భవనాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. బిల్లులు చెల్లించక గుత్తేదారులు పనులు పూర్తి చేయలేదు.
  • మత్స్యకారుల కోసం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వద్ద వేటకు ఉపయుక్తంగా ఉండేలా హార్బరు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. బడ్జెట్లో హార్బరు ఏర్పాటు చేస్తామని ప్రకటించి, అధికారులు భూసేకరణ చేశారు. 2023 ఏప్రిల్ 19న బుడగట్లపాలెం తీరంలో శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ఎలాంటి ముందడుగు పడలేదు.

గొర్లె కిరణ్‌ కుమార్ హామీలు:

  • ఎచ్చెర్ల మండలం ఎన్ఎంపురం పెద్ద చెరువుకు మడ్డువలన మిగులు జలాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. దీంతో సాగు రైతులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు. అదనపు ఆయకట్టుకు నీరందక ఎచ్చెర్ల మండల వ్యాప్తంగా సమస్యలు ఎదురవుతున్నాయి.
  • తోటపల్లి ప్రాజెక్టు ద్వారా రణస్థలం, లావేరు మండలాలకు పూర్తి స్థాయిలో సాగు నీరందిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికీ పిల్ల కాలువల తవ్వకం పూర్తి కాలేదు.

ఎమ్మెల్యేపై ప్రధాన ఆరోపణలు:

  • ఎమ్మెల్యే నేరుగా వ్యాపారాలేవీ చేయడం లేదు. తొలి ఏడాదిలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేశారు. రియల్ఎస్టేట్ వెంచర్లు వేసే వారి నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా లొంగకపోతే రెవెన్యూ సిబ్బందిని పంపించి వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
  • అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. షిఫ్టు లైన్మెన్ అవుట్ సోర్సింగు పోస్టులకు రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు డబ్బులు వసూలు చేశానే ఆరోపణలు ఉన్నాయి.

ప్రధాన సమస్యలు:

  • ఎచ్చెర్ల మండలంలో ప్రధాన సాగునీటి వనరుగా నారాయణపురం కుడికాలువ ఉంది. ఈ కాలువకు ద శాబ్దాలుగా ఆధునికీకరణ పనులు చేపట్టలేదు. వైసీపీ ప్రభుత్వం కాలువ నిర్వహ ణకు నిధులు మంజూరు చేయలేదు. ఆయకట్టు చివరి రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతు న్నారు.
  • తమ్మినాయుడుపేట, పొన్నాడ గ్రామాలు నాగావళి నదికి ఆనుకొని ఉన్నాయి. ఈ గ్రామాల్లోని భూములు వరదల సమయంలో తరచూ కోతలకు గురవుతున్నాయి. కరకట్టలు నిర్మిస్తామని పలు ప్రభు త్వాలు ఇచ్చిన హామీలు ఇంత వరకు నెరవేరలేదు.
  • మండలం తోటపాలెం నుంచి కొత్తపేట మీదుగా సంతసీతారాంపురం వెళ్లే రహదారిలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి అధ్వానంగా మారింది. ప్రజలు రాకపోకలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  • లావేరు మండలం బుడుమూరు గ్రామంలో ఉన్న నారాయణసాగరం పెద్ద చెరు వును మినీ జలాశయంగా అభివృద్ధి చేస్తే మండల ప్రజలకు ఎంతో ఉపయోగం కరంగా ఉంటుంది.
  • లావేరు మండలం బుడుమూరు పెద్ద గెడ్డపై అదపాక, గుర్రాలపాలెం గ్రామాల మధ్య, నేతేరు, లక్ష్మీపురం గ్రామాల సమీపంలో ఉన్న కాజ్వేలు శిథిలమవడంతో వీటి మీదుగా రాకపోకలు సాగించేందుకు పలు వురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి స్థానాల్లో వంతెనలు నిర్మించాల్సి ఉన్నా ఇంత వరకు ఎటు వంటి అడుగులు పడలేదు.
  • లావేరు మండలం వేణుగోపాలపురం, నాగంపాలెం, తాళ్లవలస, గుమ్మడాం, రణస్థలం తదితర గ్రామా లకు వెళ్లే మట్టి రోడ్డులు అధ్వానంగా మారడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వీటిని బీటీ రహదా రులగా మారుస్తామని ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు.

రణస్థలం మండలం:

  • శ్రీకాకుళం జిల్లా తోటపల్లి ప్రాజెక్టు ద్వారా మండలంలోని ఆయకట్టుకంతా పూర్తి స్థాయిలో సాగునీ రందిస్తానని గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు కనీసం చర్యలు చేపట్టలేదు.
  • రణస్థలం మండలంలోని పరిశ్రమల్లో అర్హులైన స్థానిక యువకులకు ఉద్యోగాలిప్పిస్తామని పరిశ్రమల ఏర్పాటు సమయంలో కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. ఒక్కరికీ ఉద్యోగ మిచ్చిన దాఖలాలు లేవు.
  • రణస్థలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది.

జి.సిగడాం:

  • జి.సిగడాం మండలంలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం మండల ప్రజలకు ఎదురుచూపులే మిగుల్చుతున్నాయి. గతంలో పదేళ్లు కిందట కాంగ్రెస్ పార్టీ హయాంలో బొత్స సత్యనారాయణ జి.సిగడాం మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసి వదిలే శారు.
  • జి.సిగడాం మండలంలో మడ్డువలస, తోటపల్లి కాలువల ద్వారా సాగునీరు శివారు గ్రామాలకు అందటం లేదు. ఏటా పంటలు రైతులు సాగునీరు అందక నష్టపోవాల్సి వస్తుంది. మడ్డువలస, తోటపల్లి పిల్ల కాలువల ద్వారా మండలంలో బాతువ, గెడ్డకంచరాం, పెనసాం, ఎందువ, నడిమివలస, సేతుభీమ వరం, నిద్దాం, పాలకండ్యాం, వాడ్రంగి తదితర గ్రామాల్లో సుమారు 12వేల ఎకరాలకు వరకు ఆధార పడి పంటలు పండిస్తున్నారు. కాలువల నిర్మాణాలు పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
  • జి.సిగడాం మండలంలో రహదారుల మరమ్మతులు సమస్య వెంటాడుతుంది. మండలంలోని పెంట, నిద్దాం, ఎస్.పి.ఆర్.పురం, నక్కపేట, గొలుసుపూడిపేట తదితర గ్రామాల్లో రహదారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే రహదారుల మరమ్మతులకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పట్టించుకోలేదు.
  • ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ‌ కుమార్‌‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. బంధువులు , కుటుంబ సభ్యుల అవినీతికి అండగా నిలిచారనే ప్రచారం ఉంది. ఎమ్మెల్యే సోదరుడు గొర్లె రాధాకృష్ణ కాంట్రాక్టరుగా ఉన్నారు. బావమరిది పిన్నింటి సాయికుమార్‌, ఎమ్మెల్యే మేనల్లు కంది నానిల హవా నడుస్తోంది. కాంట్రాక్టులు, అభివృద్ధి పనులు, గ్రావెల్ తవ్వకాలు, సెటిల్మెంట్లు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అక్రమాలపై పలు ఆరోపణలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో గొర్లె కిరణ్ కుమార్‌, నడికుదిటి ఈశ్వరరావు మధ్య పోటీ నియోజక వర్గంలో ఉత్కంఠ రేపుతోంది. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Whats_app_banner

సంబంధిత కథనం