AP Congress : ఇందిరమ్మ అభయం పథకం, ప్రతి నెల మహిళలకు రూ.5 వేలు-krishna new in telugu ap congress chief ys sharmila announced indiramma abhayam scheme for women ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Congress : ఇందిరమ్మ అభయం పథకం, ప్రతి నెల మహిళలకు రూ.5 వేలు

AP Congress : ఇందిరమ్మ అభయం పథకం, ప్రతి నెల మహిళలకు రూ.5 వేలు

Bandaru Satyaprasad HT Telugu
Mar 10, 2024 02:08 PM IST

AP Congress : ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ అభయం పథకం(Indiramma Abhayam scheme) ద్వారా ప్రతి నెల మహిళలకు రూ.5 వేలు ఇస్తామని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన యాప్ ను లాంఛ్ చేశారు.

ఇందిరమ్మ అభయం పథకం
ఇందిరమ్మ అభయం పథకం

AP Congress : ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల(YS Sharmila)...క్షేత్ర స్థాయి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొండపల్లిలో పర్యటించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల... ఇందిరమ్మ అభయం పథకం(Indiramma Abhayam scheme) యాప్ లాంచ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేద ఆడబిడ్డలకు ప్రతి నెల 5 వేల రూపాయలు ఇస్తామని వైఎస్ షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా అర్హులైన కొంతమంది మహిళల వివరాలను ఇందిరమ్మ అభయం యాప్ లో పొందుపర్చారు షర్మిల. అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరిస్తున్నామన్నారు. ఈ పథకం అమలు కావాంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. పేద కుటుంబాలకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు.

ఇందిరమ్మ అభయం పథకం యాప్ లాంచ్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 'ఇందిరమ్మ అభయం పథకం' అమలు చేస్తామని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభాకు ఈ పథకం వరంగా మారుతుందని అన్నారు. శనివారం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి పుట్లమ్మ గట్టులో ఇందిరమ్మ అభయం పథకం యాప్‌ను షర్మిల ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ.. పేద మహిళలకు ప్రతినెలా రూ.5 వేలు (Financial Assistance For Women)ఖాతాల్లో జమ చేస్తామని, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్నీ తీసుకువస్తుందన్నారు. ఈ పథకం నుంచి ప్రయోజనం పొందాలంటే.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలన్నారు. పేద కుటుంబాల్లో నలుగురూ భోజనం చేయాలంటే మహిళలు ఎంత కష్టపడతారో తనకు తెలుసన్నారు.

విభజన హామీలపై

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని వైఎస్ షర్మిల అన్నారు. 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ (BJP)అధికారంలో ఉందని కానీ విభజన హామీలు నెరవేరలేదన్నారు. ఏపీ ప్రజలకు వైసీపీ, టీడీపీ-జనసేన ప్రభుత్వాలతో మేలు జరగదన్నారు. రాష్ట్రానికి స్పెషల్ కేటగిరి స్టేటస్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై స్పందించిన వైఎస్ షర్మిల... ఈ పొత్తులను ఏపీ ప్రజలు స్వాగతించడం లేదన్నారు. ప్రత్యేక హోదా(AP SCS) ఇవ్వకపోయినా టీడీపీ, జనసేన బీజేపీ(TDP Janasena BJP)తో ఎందుకు పొత్తు పెట్టుకున్నాయని ప్రశ్నించారు. ఏపీకి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని మండిపడ్డారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచారని, ఆ తర్వాత మోదీ తిట్టారన్నారు. జగన్ బీజేపీతో రహస్య పొత్తులో ఉన్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. పొత్తులతో ఏపీకి ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు.

Whats_app_banner

సంబంధిత కథనం