Ex Minister Dokka: వైసీపీని వీడనున్న డొక్కా మాణిక్యవరప్రసాద్, టీడీపీలో చేరేందుకు జోరుగా ప్రయత్నాలు…
Ex Minister Dokka: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. ఏపీలో టీడీపీ ఓటమి పాలవగానే ఆ పార్టీని వీడిన డొక్కా వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. తిరిగి టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.
Ex Minister Dokka: గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. YCP వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న డొక్కా Dokka తిరిగి సొంత గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
డొక్కా మాణిక్య వరప్రసాద్ 2004లో కాంగ్రెస్ ఐ తరపున గుంటూరు జిల్లాలో రిజర్వుడు నియోజక వర్గమైన తాడికొండలో గెలిచారు. వైఎస్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 2009లో రెండోసారి ఎన్నికైన తర్వాత కూాడా ఆయన మంత్రి పదవిలో కొనసాగారు.
రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా.. కొద్ది రోజులకే టీడీపీ TDP గూటికి చేరారు. డొక్కా Dokkamanikya Varaprasad రాజకీయ గురువైన రాయపాటి ఆశీస్సులు ఉండటంతో టీడీపీలో చేరడం సులువైంది. టీడీపీలో చేరిన తర్వాత డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు.
2014-19 మధ్య కాలంలో వైసీపీ మీద రాజకీయ దాడి చేయడంలో దళిత నేతలైన డొక్కా మాణిక్యవరప్రసాద్, జూపూడి Jupudi ప్రభాకర్‌లు దూకుడుగా వ్యవహరించేవారు. 2019 ఎన్నికలకు ముందుు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి టీడీపీ తరపున డొక్కా, జూపూడిలను తరచూ తెరపైకి తెచ్చేది. 2019 ఎన్నికల్లో జగన్ గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవని, టీడీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని జూపూడి, డొక్కా మాణిక్య వరప్రసాద్ తరచూ సవాళ్లు చేసేవారు.
2019లో ఏపీలో వైసీపీ YCP అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జూపూడి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ తర్వాత కాలంలో ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా రాజకీయ అస్తిత్వాన్ని వెదుక్కునే క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది.
వైసీపీ తరపు తాడికొండలో గెలిచిన ఉండవల్లి శ్రీదేవి స్థానంలో తనకు అవకాశం దక్కుతుందని డొక్కా భావించారు. తాడికొండ అభ్యర్ధిగా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు అవకాశం దక్కింది. ఈ క్రమంలో రాజకీయంగా తనకు భవిష్యత్తు ఉండదనే ఆందోళన డొక్కాలో నెలకొంది. టీడీపీ అభ్యర్ధిగా తెనాలి శ్రావణ్‌కుమార్‌ను ఖరారు చేశారు.
వైసీపీలో రాజకీయంగా ప్రాధాన్యత లేకపోవడం, కనీసం సంప్రదించే వారు కూడా లేకపోవడం డొక్కాను ప్రత్యామ్నయాలు వెదుక్కునేలా చేసింది. పార్టీని వీడొద్దని గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా తన పాత్రను స్పష్టంగా తేల్చకపోతే ప్రచారంలో పాల్గొనలేనని డొక్కా తెగేసి చెప్పినట్టు ఆయన వర్గం చెబుతోంది.
ఈ క్రమంలో టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ ముఖ్య నేతల్ని డొక్కా సంప్రదించినట్టు చెబుతున్నారు. డొక్కాను పార్టీలో చేర్చుకోవడంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై ముఖ్యనేతలతో చర్చించిన తర్వాతే పార్టీ నిర్ణయించే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
తాడికొండ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో కనీసం ఒక్కసారైన మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని బహిరంగ వేదికపై డొక్కా కామెంట్లు చేయడంతోనే ఆయన్ని పక్కన పెట్టినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే తాడికొండలో జరిగే చంద్రబాబు Chandrababu ఎన్నికల ప్రచారంలో డొక్కా టీడీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
సంబంధిత కథనం