TDP Seniors Trouble : వలస నేతలకు టికెట్లు, సీనియర్లకు మొండిచేయి-టీడీపీలో మొదలైన రచ్చ-amaravati tdp seniors seats issue allegations on chandrababu party jumping leaders get tickets ,elections న్యూస్
తెలుగు న్యూస్  /  Elections  /  Amaravati Tdp Seniors Seats Issue Allegations On Chandrababu Party Jumping Leaders Get Tickets

TDP Seniors Trouble : వలస నేతలకు టికెట్లు, సీనియర్లకు మొండిచేయి-టీడీపీలో మొదలైన రచ్చ

Bandaru Satyaprasad HT Telugu
Mar 30, 2024 09:37 PM IST

TDP Seniors Trouble : ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పార్టీల్లో అసంతృప్తుల రచ్చ పెరుగుతోంది. టీడీపీలో ఈసారి సీనియర్లకు గడ్డుపరిస్థితి ఎదురైంది. పొత్తుల్లో భాగంగా దాదాపు 52 స్థానాల్లో టీడీపీ సీట్లు కోల్పోయింది.

టీడీపీలో మొదలైన రచ్చ
టీడీపీలో మొదలైన రచ్చ

TDP Seniors Trouble : ఏపీలో ఎన్నికల రాజకీయాలు హాట్ హాట్ ఉన్నాయి. అటు వైసీపీ అధినేత సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan) మేమంతా సిద్ధం అంటూ బస్ యాత్ర, చంద్రబాబు(Chandrababu) ప్రజాగళం, పవన్ వారాహి యాత్ర(Pawan Varahi Yatra)లతో ప్రత్యర్థులపై విమర్శలతో చెలరేగిపోతున్నారు. టీజీపీ, బీజేపీ, జనసేన పొత్తులతో ఎన్నికలతో వెళ్తున్నాయి. అయితే ఇన్నాళ్లు ఈ మూడు పార్టీల కోసం కష్టపడిన కొందరికి పొత్తుల్లో సీట్ల పంపకం కారణంగా టికెట్లు దక్కలేదు. ముఖ్యంగా టీడీపీలో టికెట్ల వివాదం(TDP Tickets Issues) కొనసాగుతుంది. పార్టీ కోసం కష్టపడితే వలస నేతలకు చంద్రబాబు టికెట్లు ఇచ్చారని అసంతృప్తులు రచ్చ చేస్తున్నారు. మరోవైపు ‌సీనియర్లు అయితే మరింత గుర్రుగా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

సీనియర్లకు దక్కని ఛాన్స్

పొత్తుల్లో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ సీట్లు కేటాయించారు. జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లు, టీడీపీకి 144 అసెంబ్లీ, 17 లోక్ సభ సీట్లు వచ్చాయి. పొత్తు కారణంగా టీడీపీ కొన్ని సీట్లు కోల్పోయింది. దీంతో పాటు వైసీపీ నుంచి వచ్చిన నేతలకు సీట్లు హామీ ఇచ్చారు చంద్రబాబు. దీంతో దాదాపు 52 స్థానాలను టీడీపీ నేతలు కోల్పోయారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అనేక కేసులు ఎదుర్కొని, పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడిన తమకు సీట్లు కేటాయించలేదని సీనియర్లు (TDP Seniors)వాపోతున్నారు. దీంతో వారంతా చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు చోట్లు ఈ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్టీ కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తలు(TDP Activists) దాడులకు పాల్పడుతున్నారు. అనపర్తిలో టీడీపీ అభ్యర్థిగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని(Nallimilli Ramakrishna Reddy) ప్రకటించారు. అయితే పొత్తుల్లో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించడం అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. టీడీపీ ఆఫీసుపై నల్లిమిల్లి మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో(Srikakulam) సీనియర్ నేత ప్రతిభా భారతి, ఆమె కుమార్తె గ్రీష్మకు సైతం సీటు దక్కలేదు. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని‌ ఉమ, విజయవాడ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పామర్రు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు టికెట్లు దక్కలేదు. అలాగే గుంటూరు జిల్లా తెనాలి చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే కొడెల శివరాంకు ఈసారి నిరాశే ఎదురైంది. అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, అనంతపురం(Anantapur) పార్లమెంట్ ఇన్ ఛార్జ్ జేసీ పవన్ లకు టికెట్లు ఇవ్వలేదు చంద్రబాబు.

రాజీనామాల పర్వం

విజయనగరం జిల్లా చీపురుపల్లి టికెట్ టీడీపీ నేత కిమిడి నాగార్జున(Kimidi Nagarjuna)కు దక్కలేదు. దీంతో ఆయన టీడీపీ రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా నెలిమర్లలో కర్రోతు బంగార్రాజుకు టికెట్టు దక్కలేదు. విశాఖ జిల్లా పెందుర్తి టికెట్ పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇచ్చారు. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అసంతృప్తితో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం సీటు టీడీపీకి దక్కపోవడంతో బొడ్డు వెంకటరమణ చౌదరికి అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, పశ్చిమలో మాజీ మంత్రి పీతల సుజాత, గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి జవహర్, మాజీ ఎంపీ మాగంటి బాబు(Maganti Babu) వంటి సీనియర్లకు ఈసారి టికెట్లు దక్కలేదు. ఏలూరు పార్లమెంట్‌ ఇన్ ఛార్జ్‌ గోపాల్‌ యాదవ్‌ టికెట్ దక్కలేదని పార్టీపై బహిరంగంగా విమర్శలు చేస్తూ వైసీపీకి గూటికి చేరారు.

WhatsApp channel

సంబంధిత కథనం