Pawan Kalyan Campaign : ఎన్నికల ప్రచారంలోకి పవన్ - ఇవాళ పిఠాపురం నుంచి ప్రారంభం, తొలి విడత షెడ్యూల్ ఇదే-janasena chief pawan kalyan election campaign start from pithapuram today ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pawan Kalyan Campaign : ఎన్నికల ప్రచారంలోకి పవన్ - ఇవాళ పిఠాపురం నుంచి ప్రారంభం, తొలి విడత షెడ్యూల్ ఇదే

Pawan Kalyan Campaign : ఎన్నికల ప్రచారంలోకి పవన్ - ఇవాళ పిఠాపురం నుంచి ప్రారంభం, తొలి విడత షెడ్యూల్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 30, 2024 06:27 AM IST

Pawan Kalyan Election Campaign 2024: ఏపీ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇవాళ్టి నుంచే ఆయన తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది.

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం (Photo From Janasena Twitter)

Pawan Kalyan Election Campaign 2024: ఏపీ ఎన్నికల ప్రచారంలోకి (AP Elections 2024) దిగనున్నారు జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan). తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని ఆయన పోటీ చేయబోయే పిఠాపురం (Pithapuram)నుంచే షురూ చేయనున్నారు. ఇవాళ్టి(మార్చి 30) నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా ఇదే నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ కొనసాగించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు జనసేనతో పాటు కూటమి నేతలు… భారీగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇవాళ చేబ్రోలు రామాలయం వద్ద తలపెట్టిన సభలో పవన్ పాల్గొని ప్రసంగిస్తారు.

5 రోజులు పిఠాపురంలోనే….

తొలి విడతలో పిఠాపురంలో 5 రోజుల పాటు పవన్‌ కల్యాణ్ ఎన్నికల ప్రచారం. కొనసాగనుంది. వారాహి విజయ భేరి యాత్ర పేరుతో పవన్ ఈ క్యాంపెయినింగ్ చేయనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఇదే నియోజకవర్గంలో పర్యటించనున్న పవన్…. ఏప్రిల్ 9వ తేదీన పిఠాపురంలో(Pithapuram) జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు. కూటమిలో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేయనున్న నేపథ్యంలో…. టీడీపీ, బీజేపీ శ్రేణులు కూడా పవన్ పర్యటనను విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ కూడా…. పవన్ యాత్రలో కీలకంగా ఉండనున్నారు.

Pawan Election Campaign: తొలి విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్

  • మార్చ్ 30 నుండి ఏప్రిల్ 2 వరకు పిఠాపురంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
  • ఏప్రిల్ 3 - తెనాలి.
  • ఏప్రిల్ 4 - నెల్లిమర్ల.
  • ఏప్రిల్ 5 - అనకాపల్లి.
  • ఏప్రిల్ 6 - ఎలమంచిలి.
  • ఏప్రిల్ 7 - పెందుర్తి.
  • ఏప్రిల్ 8 - కాకినాడ రూరల్.
  • ఏప్రిల్ 9 - పిఠాపురంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు.
  • ఏప్రిల్ 10 - రాజోలు.
  • ఏప్రిల్ 11 - పి. గన్నవరం.
  • ఏప్రిల్ 12 - రాజానగరం.

Pithapuram Politics: ఏపీలో ఆసక్తికరమైన రాజకీయాలకు పిఠాపురం వేదికగా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన నియోజక వర్గాల్లో ఒకటైన పిఠాపురంలో ఈసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా భీమవరం నుంచి పోటీ చేయాలని భావించినా చివరకు పిఠాపురం వైపు మొగ్గు చూపారు. రాష్ట్రంలో కాపులకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాల్లో పిఠాపురం (Pithapuram) కూడా ఒకటి. 2024 ఎన్నికల జాబితా లెక్కల ప్రకారం పిఠాపురంలో ప్రస్తుతం 2,31,624 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,15,974మంది పురుషులు, 1,15,647 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పిఠాపురంలో ఉన్న మొత్తం ఓటర్లలో దాదాపు 32శాతం కాపులు ఉంటారని అంచనా. 90వేలకు పైగా ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పిఠాపురం నుంచి పోటీకి పవన్ మొగ్గు చూపారు. 1960 నుంచి జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు మాత్రమే ఇతర సామాజిక వర్గాల నాయకులు ఇక్కడ ఎన్నికయ్యారు. నియోజక వర్గంలో కాపుల తర్వాత బలమైన సామాజిక వర్గంగా ఉన్న శెట్టి బలిజలు 9.78శాతం ఉన్నారు. మరోవైపు కాపు సామాజికవర్గానికి చెందిన వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. దీంతో ఇక్కడి రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.

Whats_app_banner