CBN on Jagan: బాపట్లలో ఎంపీగా రౌడీ కావాలో, పోలీస్ అధికారి కావాలో ప్రజలే తేల్చుకోవాలన్న చంద్రబాబు…
CBN on Jagan: రాష్ట్రంలో పెన్షన్లు చెల్లించడానికి అవసరమైన డబ్బుల్లేక వైసీపీ విపక్షాలపై దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. పెన్షన్ రూ.2వేలకు పెంచింది తానేనని, రూ.4వేలు చెల్లించే బాధ్యత కూడా తనదేనని బాపట్లలో సభలో ప్రకటించారు.
CBN on Jagan: ఐదేళ్ళ జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు Chandrababu ఆరోపించారు. ఐదేళ్ళుగా రాష్ట్రానికి పట్టిన శని మే13 తేదికి వదలిపోతుందన్నారు.
ఖజానాలో Treasury ఉన్న డబ్బులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేశారని, పెన్షన్లు pensions ఇవ్వలేక జగన్ రెడ్డి Ys jagan తన మీద బురద జల్లుతున్నాడని మండిపడ్డారు. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2000 చేసింది తానేనని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛను రూ.4 వేలకు పెంచి ఇంటి వద్దే అందిస్తానని చెప్పారు.
బాపట్ల వైసీపీ MP అభ్యర్ధి దోపిడీదారుడని, ఎన్డీఏ అభ్యర్ధి కృష్ణప్రసాద్ Krishnaprasad సేవాభావం కలవాడన్నారు. బాపట్ల వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఒక రౌడీ అయితే, ఎన్డీఏ ఎంపీ అభ్యర్ధి నిజాయితీగల ఐపీఎస్ IPS అధికారిగా పనిచేసిన వ్యక్తి అని ప్రజలు గుర్తించాలని, బాపట్లలో ఎవరు కావాలో తేల్చుకోవాలన్నారు.
బాపట్ల Bapatla MPఉమ్మడి పార్లమెంటు అభ్యర్ధి కృష్ణప్రసాద్ ను వ్యక్తిగతంగా అతని పని తీరును దగ్గరగా చూశానని సీఎంగా ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలుగా ఐపిఎస్ అధికారిగా తన దగ్గర పని చేశాడు. మంచి వ్యక్తి. నీతి నిజాయితిగా బ్రతికి పది మందికి ఉపయోగపడ్డాడు. అందుకే వెతికి వెతికి ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కృష్ణప్రసాద్ ను నిలబెట్టాం. బాపట్ల ఎంపీగా కృష్ణ ప్రసాద్‌ను, ఎమ్మెల్యే నరేంద్ర వర్మను గెలిపించాల్సిన బాధ్యత బాపట్ల ప్రజలపై ఉంది.
ఆ జీవో రద్దు చేస్తామన్న బాబు…
రాష్ట్రానికి కోస్టల్‌లో ఆక్వా కల్చర్ అవసరమని రూ.1.50 పైసాకే అందరికి కరెంట్ ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు. మత్స్యకారులను దెబ్బతీసే విధంగా జీవో నెం.217 తీసుకువచ్చారని అధికారంలోకి రాగానే ఆ జీవోను రద్దు చేసి మీకు స్వేచ్ఛనిస్తానని చెప్పారు.
AP ముఖ్యమంత్రి ఒక విచిత్రమైన వ్యక్తి అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, నా బీసీలు అంటూ బీసీలకు అందించిన 30 పథకాలను రద్దు చేశాడని ఐదేళ్ళలో ఒక్క బీసీకి ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదన్నారు.
అక్కను వేధిస్తున్నాడని తిరగబడ్డ అమర్నాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి రోడ్డు మీద తగలబెట్టారని గుర్తు చేశారు. . జైలుకి వెళ్ళిన రెండు నెలలోనే నిందితులు బయట తిరుగుతున్నారని అలాంటి వారి మక్కెలు విరగ్గొడతానని హెచ్చరించారు.
నా ఎస్సీలు అంటాడని, వారికి ఇచ్చిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారని, దళిత డ్రైవర్‌ను చంపేసి డోర్ డెలివరీ చేస్తూ, నా ఎస్సీలు అంటాడని ఆరోపించారు. మాస్క్ అడిగిన డాక్టర్‌ను పిచ్చోడిని చేసి చంపారని, అంబేద్కర్ పేరుతో విదేశి విద్యను తీసుకొస్తే ఆ పేరు మార్చి జగన్ రెడ్డి తన పేరు పెట్టుకొని అది కూడా అమలు చేయలేదన్నారు. అంబేద్కర్ కంటే గొప్పోడివా..అని జగన్‌ను ప్రశ్నించారు.
బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన అంబేద్కర్ కు అన్యాయం జరుగుతుంటే ఉపేక్షించమని, సబ్ ప్లాన్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్నీ మూసేశాడని అందరితోపాటే రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్నాడు తప్ప.. జగన్ ఎస్సీలకు చేసిందేమి లేదన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు…
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారని, పొత్తు పెట్టుకుంటే జగన్ రెడ్డికి నిద్ర రాదని అందుకే కుట్రలు చేసైనా పొత్తు చెడగొట్టాలని ప్రయత్నాలు చేశాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవాలని పవన్, నేను నిర్ణయించుకున్నామని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింతగా దూసుకువెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని కేంద్రంలో మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లులన్నిటికీ జగన్ రెడ్డి సపోర్ట్ చేశాడని, తనను విమర్శించే హక్కు జగన్ రెడ్డికి లేదన్నారు.
మద్యపాన నిషేధమని చెప్పి మద్యం ధరలు మూడు రేట్లు పెంచేశాడని, జే బ్రాండ్, నాశిరకం మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఏ మద్యం షాపులో కూడా డిజిటల్ పేమెంట్ చెల్లింపులు లేవు. ఈ చిదంబర రహస్యమేంటో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. .
రూ.200 వచ్చే కరెంటు ఛార్జీలను రూ.2000 చేశాడు. రూ.1000 దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.5 వేలు అయ్యిందన్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఇళ్లు గడవక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక ఆర్మీని పెట్టుకొని ఇసుకను దోచేస్తున్నాడుని మండిపడ్డారు.
టీడీపీలో చేరనున్న జంగా కృష్ణమూర్తి…
వైసీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును బాపట్లలో ఆదివారం కలిశారు. త్వరలో గురజాలలో జరిగే శంఖారావం సభ వేదికగా అనుచరులతో కలిసి జంగా కృష్ణమూర్తి పార్టీలో చేరనున్నారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
సంబంధిత కథనం