DIG Ammireddy Transfer : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు, ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశాలు
DIG Ammireddy Transfer : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటువేసింది. ఆయన తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది.
DIG Ammireddy Transfer : ఏపీ ఎన్నికల నిర్వహణకు ఈసీ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదులపై వేగంగా చర్యలు చేపడుతుంది. నిన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)ని బదిలీ చేయగా... తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి(DIG Ammireddy)పై ఈసీ బదిలీ వేటు వేసింది. అమ్మిరెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఈసీ ఆదేశించింది. అమ్మిరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించొద్దని సీఎస్ జవహర్ రెడ్డిని(CS Jawahar Reddy) ఆదేశించింది.
ప్రతిపక్షాల ఫిర్యాదులతో చర్యలు
అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఈసీ(EC) బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల ఎస్పీ అన్బురాజన్(SP Anburajan)ను ట్రాన్స్ పర్ చేసిన ఈసీ.. తాజాగా డీఐజీ అమ్మిరెడ్డి(DIG Ammireddy)పై బదిలీ వేటు వేసింది. ఆయన తక్షణమే బాధ్యతులను దిగువ స్థాయి అధికారికి అప్పగించాలని ఆదేశించింది. ఆయనను వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని సీఎస్(CS) ను ఆదేశించింది. డీఐజీ అమ్మిరెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఈసీ ఈ మేరకు చర్యలకు తీసుకుంది. ఇటీవల అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌ను బదిలీ చేసిన ఈసీ... ఆయన స్థానంలో అమిత్ బర్దర్‌ను నియమించింది. అనంతపురం అర్బన్ డీఎస్పీగా ప్రతాప్ కుమార్, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు 10 మంది ఐపీఎస్ లపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది.
డీజీపీ బదిలీ
ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy)పై ఎన్నికల సంఘం(EC) ఆదివారం బదిలీ వేటు వేసింది. ఆయనను తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఈసీ ఆదేశించింది. డీజీపీని బదిలీ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy)ని ఈసీ ఆదేశించింది. డీజీపీ పదవికి ముగ్గురు పేర్లతో ప్యానల్ పంపాలని ఎన్నికల సంఘం సీఎస్ కు సూచించింది. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వానికి(Ysrcp Govt) గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో నిష్పక్షపాత ఎన్నికలు జరిగేందుకు సీఎస్ , డీజీపీని బదిలీ చేయాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై(DSPs Transfers) కూడా ఈసీ(EC) బదిలీ వేటు చేసింది. డీఎస్పీపై అందిన ఫిర్యాదుల మేరకు ఈసీ ఈ చర్యలు తీసుకుంది. అనంతపురం అర్బన్ డీఎస్పీ వీర రాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషాను ఈసీ బదిలీ చేసింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
సంబంధిత కథనం