IAS IPS Postings in AP : ఏపీలో బదిలీ అయిన స్థానాల్లో కొత్త అధికారుల నియామకం - ఈసీ ఉత్తర్వులు, లిస్ట్ ఇదే-the election commission has appointed new officials to replace the transferred officials in ap see those details here ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ias Ips Postings In Ap : ఏపీలో బదిలీ అయిన స్థానాల్లో కొత్త అధికారుల నియామకం - ఈసీ ఉత్తర్వులు, లిస్ట్ ఇదే

IAS IPS Postings in AP : ఏపీలో బదిలీ అయిన స్థానాల్లో కొత్త అధికారుల నియామకం - ఈసీ ఉత్తర్వులు, లిస్ట్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 04, 2024 05:08 PM IST

AP Elections 2024 Updates: ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో పలువురు అధికారులను బదిలీ చేసింది ఈసీ. ఆయా స్థానాల్లో కొత్త అధికారుల నియామకానికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.

ఏపీలో కొత్త అధికారులు
ఏపీలో కొత్త అధికారులు (Twitter)

New Postings in AP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు (AP Elections 2024) జరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే పలువురి అధికారులను బదిలీ చేసింది భారత ఎన్నికల సంఘం(Election Commission). దీంతో ఆయా స్థానాల్లో ఖాళీలు ఏర్పడగా… ఇందుకోసం పలువురి అధికారుల పేర్లను(New Postings in AP) ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో మూడు జిల్లాలకు కొత్త కలెక్టర్లు రాగా… పోలీసుశాఖకు సంబంధించి ఆరుగురిని కొత్తగా నియమించారు.

బదిలీ అయిన వారి స్థానంలో కొత్త అధికారులు వీరే…

బదిలీ అయిన వారి స్థానంలో కొత్త అధికారులు నియమితులయ్యారు. అనంతపురం కలెక్టర్‌గా వినోద్‌కుమార్‌ పేరు ఖరారైంది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా డి.కె.బాలాజీ, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్‌ కుమార్‌ పేరుకు ఆమోదముద్ర వేసింది. ఇక గుంటూరు ఐజీగా త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్‌, ప్రకాశం జిల్లా ఎస్పీగా సుమిత్‌ సునీల్‌, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్‌ బర్దార్‌ ఖరారు కాగా… నెల్లూరు జిల్లా ఎస్పీగా ఆరీఫ్‌ హఫీజ్‌ పేరుకు ఆమోదముద్ర వేసింది ఈసీ(Election Commission). కొత్తగా నియమితులైన వీరంతా… ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 8 గంటలోపు ఛార్జ్ తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

లిస్ట్ ఇదే…

  • కృష్ణా జిల్లా కలెక్టర్‌గా DK బాలాజీ
  • అనంతపురం కలెక్టర్‌గా వినోద్‌కుమార్‌
  • తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్‌ కుమార్‌
  • గుంటూరు IGగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
  • ప్రకాశం ఎస్పీగా సుమిత్‌ సునీల్‌
  • పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్‌
  • చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు
  • అనంతపురం ఎస్పీగా అమిత్‌ బర్దార్‌
  • నెల్లూరు ఎస్పీగా ఆరీఫ్‌ హఫీజ్‌.

ఇటీవలే బదిలీ ఉత్తర్వులు…

AP IAS IPS Transfers : ఏపీలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(EC) ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చింది. ముగ్గురు ఐఏఎస్ లు, ఐదుగురు ఐపీఎస్ అధికారులు, ఐజీపై(IAS IPS Transfers) వేటు వేసింది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్ , నెల్లూరు ఎస్పీ కె.తరములేశ్వర్ పై బదిలీ వేటు వేసింది. బదిలీ అయిన అధికారులు తమ కింది వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఆదేశించింది. బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని(AP Govt) ఆదేశించింది.

బదిలీ అయిన అధికారులు

పి.రాజాబాబు, ఐఏఎస్-డీఈవో, కృష్ణా జిల్లా

ఎం.గౌతమి, ఐఏఎస్-డీఈవో, అనంతపురం జిల్లా

లక్ష్మీశ, ఐఏఎస్-డీఈవో, తిరుపతి

పరమేశ్వర్, ఐపీఎస్-ఎస్పీ, ప్రకాశం జిల్లా

వై.రవి శంకర్ రెడ్డి,ఐపీఎస్- ఎస్పీ పల్నాడు జిల్లా

పి.జాఘువా, ఐపీఎస్-ఎస్పీ, చిత్తూరు జిల్లా

కేకేఎన్.అన్బురాజన్, ఐపీఎస్-ఎస్పీ,అనంతపురం జిల్లా

కె.తిరుమళేశ్వర్, ఐపీఎస్-ఎస్పీ, నెల్లూరు జిల్లా

జి.పాల రాజు, ఐపీఎస్-ఐజీపీ, గుంటూరు రేంజ్

Whats_app_banner