AP DGP Transfer : ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు-amaravati ec transfers ap dgp rajendranath reddy immediately orders cs jawahar reddy ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Dgp Transfer : ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు

AP DGP Transfer : ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు

Bandaru Satyaprasad HT Telugu
May 05, 2024 06:49 PM IST

AP DGP Transfer : ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఆయనను తక్షణమే బదిలీ చేయాలని సీఎస్ ను ఆదేశించింది.

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు

AP DGP Transfer : ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy)పై ఎన్నికల సంఘం(EC) బదిలీ వేటు వేసింది. తక్షణమే ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఈసీ ఆదేశించింది. డీజీపీని బదిలీ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy)ని ఈసీ ఆదేశించింది. డీజీపీ పదవికి ముగ్గురు పేర్లతో ప్యానల్ పంపాలని ఎన్నికల సంఘం సీఎస్ కు సూచించింది. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వానికి(Ysrcp Govt) గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో నిష్పక్షపాత ఎన్నికలు జరిగేందుకు సీఎస్ , డీజీపీని బదిలీ చేయాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

డీజీపీపై ప్రతిపక్షాల ఫిర్యాదులు

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy) తక్షణమే కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ(EC) ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. సోమవారం ఉదయం 11 గంటలలోపు ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని సీఎస్ ను ఈసీ ఆదేశించింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ముందు నుంచీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సీఎం జగన్(CM Jagan) చెప్పినట్లు ప్రతిపక్షాలను డీజీపీ వేధిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ (Election Code)అమల్లోకి వచ్చాక కూడా డీజీపీ తీరు మార్చుకోలేదని టీడీపీ, జనసేన విమర్శించాయి. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరూ సీఎం జగన్ సొంత జిల్లా వాళ్లని, ఎన్నికల సజావుగా జరగాలంటే సీఎస్, డీజీపీని బదిలీ చేయాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి. అలాగే ఇటీవల రాష్ట్రంలో జరగుతున్న సంఘటనలు, ప్రతిపక్షాల ఫిర్యాదులపై విచారణ చేసిన ఈసీ తాజాగా డీజీపీ(DGP)ని బదిలీ చేసింది.

టీడీపీ విమర్శలు

డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆ పదవికి అనర్హులని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య(Varla Ramaiah) ఆరోపించారు. డీజీపీ స్థాయి వ్యక్తి పక్షపాత వైఖరితో వ్యవహరించడం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి(Ysrcp Govt) మద్దతుగా ప్రతిపక్షాలను వేధించారని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక డీజీపీ ఒక్కసారి అయినా మీడియా ముందుకు రాలేదన్నారు. సీఎం జగన్ సేవలో తరించడమే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి డ్యూటీగా మారిపోయిందని వర్ల రామయ్య విమర్శలు చేశారు.

ఇద్దరు డీఎస్పీలు బదిలీ

ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై(DSPs Transfers) కూడా ఈసీ(EC) బదిలీ వేటు చేసింది. డీఎస్పీపై అందిన ఫిర్యాదుల మేరకు ఈసీ ఈ చర్యలు తీసుకుంది. అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషాను ఈసీ బదిలీ చేసింది.

సంబంధిత కథనం