Ysrcp Campaign : రాష్ట్ర వ్యాప్తంగా 'జగన్ కోసం సిద్ధం' కార్యక్రమం మొదలు, బూత్ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం
Ysrcp Campaign : వైసీపీ స్టార్ క్యాంపెయినర్లతో జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ప్రారంభించింది. బూత్ స్థాయిలో నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోతో ప్రచారం మొదలుపెట్టింది.
Ysrcp Campaign : రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 47,000 బూత్‌లలో వైఎస్సార్సీపీ స్టార్ క్యాంపెయినర్ల(Ysrcp Star Campaigners)తో చేపట్టిన "జగన్ కోసం సిద్ధం"(Jagan Kosam Siddham) కార్యక్రమం ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ తన 2.5 లక్షల బూత్ స్థాయి కార్యకర్తల ద్వారా స్టార్ క్యాంపెయినర్ల నమోదు కార్యక్రమం చేపడుతోంది. బూత్ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ప్రతి కుటుంబాన్ని సందర్శించి గత ఐదేళ్లలో సదరు కుటుంబానికి జరిగిన లబ్దిని వివరిస్తూ.. పేదల అభివృద్ధి కోసం సీఎం జగన్(CM Jagan) ని మళ్లీ గెలిపించుకుందాం అనే నినాదంతో జగన్ కోసం సిద్ధం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రతి కుటుంబం నుంచి లబ్దిదారులే నాకు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలన్న సీఎం జగన్ పిలుపునకు తొలి రోజు అనూహ్య స్పందన వచ్చింది. 9 లక్షలకు పైగా లబ్దిదారులు స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు చేసుకుని సీఎం జగన్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వైసీపీ తెలిపింది.
తొలి రోజు జగన్ కోసం సిద్ధం కార్యక్రమంలో కీలక అంశాలు
- 'జగన్ కోసం సిద్ధం' ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదటి రోజున 9 లక్షల మంది లబ్ధిదారులు తమను తాము వైయస్ఆర్సీపీ(Ysrcp) స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు చేసుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
- ఈ స్టార్ క్యాంపెయినర్లు(Star Campaigners) జగన్ కోసం సిద్ధం ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటి రోజు 47,000 బూత్‌లలో విస్తరించి ఉన్న 2.5 లక్షల మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి ప్రతి గ్రామంలో నిర్వహించిన గడప గడప ప్రచారంలో పాల్గొన్నారు.
- వైఎస్సార్సీపీ 2024 ఎన్నికల్లో భాగంగా ప్రకటించిన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోను(Navaratnalu Plus Manifesto) ప్రతి ఇంటికి ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో అమలును గుర్తు చేసి 2024 మేనిఫెస్టో అమలు కోసం సీఎం జగన్(CM Jagan) ను గెలిపించుకుందాం అంటూ ప్రచారం నిర్వహించారు.
సంబంధిత కథనం