వరల్డ్ కప్ షెడ్యూల్
క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఈ ఏడాది అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ షెడ్యూల్ ను ఐసీసీ ఈ మధ్యే అనౌన్స్ చేసింది. ఇక ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇదే క్రికెట్ స్టేడియంలో నవంబర్ 19న ఫైనల్ జరుగుతుంది. ముంబైలోని వాంఖెడే, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండు సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్స్ ఉంటాయి.
వరల్డ్ కప్ లో భాగంగా మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిని ఇండియాలోని మొత్తం 10 వేదికల్లో నిర్వహిస్తారు. వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యమివ్వడం ఇండియాకు ఇది నాలుగోసారి. ఇక 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఇండియా ఆడబోయే మ్యాచ్ లు చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, పుణె, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్‌కతా, బెంగళూరులలో జరుగుతాయి. వరల్డ్ కప్ వేదికల్లో ఒకటైన హైదరాబాద్ లో మాత్రమే ఒక్క ఇండియా మ్యాచ్ కూడా లేదు. హైదరాబాద్ లో మూడు లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో రెండు పాకిస్థాన్ ఆడే మ్యాచ్ లు కావడం విశేషం.
వరల్డ్ కప్ లో మొత్తం పది టీమ్స్ పాల్గొంటున్నాయి. అందులో 8 జట్లు నేరుగా క్వాలిఫై అవగా.. మరో రెండు టీమ్స్ క్వాలిఫయర్స్ ద్వారా వచ్చాయి. శ్రీలంక, నెదర్లాండ్స్ టీమ్స్ ఇలా అర్హత సాధించాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో జరగబోయే వరల్డ్ కప్ లో ప్రతి టీమ్ మిగిలిన 9 టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. వీటి నుంచి టాప్ 4 టీమ్స్ సెమీఫైనల్ కు వెళ్తాయి. ఇక వరల్డ్ కప్ కంటే ముందు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు హైదరాబాద్, గువాహటి, తిరువనంతపురంలలో వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ లు జరుగుతాయి.
ఇక ఇండియా విషయానికి వస్తే అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడుతుంది. 2019 వరల్డ్ కప్ లో ఇండియాను ఓడించిన న్యూజిలాండ్, ఇంగ్లండ్ లతో ఇండియాకు సవాలు ఎదురు కానుంది. ఇక ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ్యాచ్ లు కూడా ఇండియాకు కీలకమే. 2019 వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ లో ఇంగ్లండ్ చేతుల్లో, సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓడిపోయింది. వన్డే వరల్డ్ కప్ కు సరిగ్గా 100 రోజుల ముందు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగానే షెడ్యూల్ రిలీజ్ చేయాల్సి ఉన్నా.. వాయిదా వేశారు. బెంగళూరు, చెన్నైలలో తాము ఆడాల్సిన మ్యాచ్ లను మార్చాల్సిందిగా పాకిస్థాన్ కోరడంతో షెడ్యూల్ వాయిదా వేసినట్లు ఐసీసీ చెప్పింది. అయితే బీసీసీఐ మాత్రం ఆ వినతిని నిరాకరించి షెడ్యూల్ ను తాము అనుకున్నట్లే ప్రకటించింది. నిజానికి వరల్డ్ కప్ షెడ్యూల్ కనీసం ఆరు నెలల ముందే రిలీజ్ అవుతుంది. 2019లో అయితే ఏడాది ముందే షెడ్యూల్ అనౌన్స్ చేశారు. దీని వల్ల అభిమానులు తమ ప్రయాణ ఏర్పాట్లను చేసుకోవడం సులువు అవుతుంది. ఈసారి మాత్రమే చాలా ఆలస్యం అయింది. అందులోనూ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ను ఒక రోజు ముందుకు జరపడం వల్ల మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ ను మరోసారి మార్చాల్సి వచ్చింది.

మ్యాచ్‌లు | తేదీ | సమయం | వేదిక |
---|
వార్తలు
FAQ (తరచుగా అడిగే ప్రశ్నలు)
Q: హైదరాబాద్ లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతాయా?
A: హైదరాబాద్‌లో మూడు వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతాయి. అందులో పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లలో తలపడనుంది. పాకిస్థాన్, శ్రీలంక.. పాకిస్థాన్, నెదర్లాండ్స్.. న్యూజిలాండ్, నెదర్లాండ్స్ ల మధ్య మ్యాచ్ లు ఉంటాయి.
Q: హైదరాబాద్‌లో ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతుందా?
A: లేదు. హైదరాబాద్‌లో ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ ఆడదు. వరల్డ్ కప్ జరిగే మొత్తం పది వేదికల్లో 9 వేదికల్లో ఇండియా లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. హైదరాబాద్ లో మాత్రమే ఇండియా మ్యాచ్ లేదు.
Q: ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఎక్కడ జరుగుతుంది?
A: నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది
Q: 2023 ప్రపంచకప్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఉన్నాయి?
A: ప్రపంచకప్‌లో నాకౌట్ సహా మొత్తం 48 మ్యాచ్‌లు జరుగుతాయి
Q: వరల్డ్ కప్ 2023 ఎప్పుడు ప్రారంభమవుతుంది?
A: వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19న ముగుస్తుంది. అంతకుముందు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వామప్ మ్యాచ్ లు జరుగుతాయి.