వరల్డ్ కప్ 2023 అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు, World Cup 2023 Most Wickets in Telugu - HT Telugu

వరల్డ్ కప్ అత్యధిక వికెట్లు


వన్డే వరల్డ్ కప్ 1975లో ప్రారంభమైంది. అప్పటి నుంచీ 2019 వరకూ ఈ మెగా టోర్నీలో రాణించిన బౌలర్లు ఎంతో మంది ఉన్నారు. వీళ్లలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత మాత్రం ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కే దక్కుతుంది. అతడు 39 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడి 71 వికెట్లు పడగొట్టాడు. 1996-2007 వరకు మొత్తం నాలుగు వరల్డ్ కప్ ‌లు ఆడిన మెక్‌గ్రాత్ ఈ ఘనత సాధించడం విశేషం. వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఈ మాజీ పేస్ బౌలర్ మొత్తం 1955 బంతులు వేశాడు. తర్వాతి స్థానంలో శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. మురళీధరన్ ప్రపంచకప్‌ టోర్నీలలో 40 మ్యాచ్‌లు ఆడి 68 వికెట్లు తీశాడు. మురళీధరన్ 1996 వరల్డ్ కప్ లో తొలిసారి శ్రీలంక తరఫున ఆడాడు. 2011 వరల్డ్ కప్ వరకూ కొనసాగాడు. మొత్తం ఐదు వరల్డ్ కప్ లలో మురళీ 2061 బాల్స్ వేసి ఈ 68 వికెట్లు తీశాడు. ఈ అత్యధిక వికెట్ల లిస్టులో శ్రీలంకకే చెందిన లసిత్ మలింగ మూడోస్థానంలో ఉన్నాడు. మలింగ 2007 వరల్డ్ కప్ లో తొలిసారి ఆడాడు. 2019 వరల్డ్ కప్ వరకు నాలుగు టోర్నీల్లో కలిపి 56 వికెట్లు తీశాడు. ఈ మెగా టోర్నీలో మలింగ వేసిన మొత్తం బాల్స్ సంఖ్య 1394. అతని తర్వాతి స్థానంలో పాకిస్థాన్‌కు చెందిన వసీం అక్రమ్ ఉన్నాడు. అతను 1987, 2003 మధ్య ఐదు ప్రపంచ కప్‌లలో 38 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 1947 బంతులు వేసి 55 వికెట్లు తీశాడు. ఇక మరో ఆష్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కేవలం రెండే వరల్డ్ కప్ లలో 18 మ్యాచ్ లలో ఏకంగా 49 వికెట్లు తీయడం విశేషం. 2015, 2019 టోర్నీల్లో స్టార్క్ ఆడాడు. 2015లో స్టార్క్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కాగా.. ఆస్ట్రేలియా ఐదోసారి వరల్డ్ కప్ గెలిచింది

వరల్డ్ కప్ లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో నలుగురు పేస్ బౌలర్లే కావడం విశేషం. మురళీధరన్ రూపంలో ఒక్క స్పిన్నర్ మాత్రమే ఉన్నాడు. అయితే 2023 వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతోంది. మన దేశంలోని పిచ్ లు స్పిన్ కు అనుకూలిస్తాయి. ఈ నేపథ్యంలో ఈసారి వరల్డ్ కప్ లో స్పిన్నర్లు రాణించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత ఉపఖండానికి చెందిన ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ లలోని స్టార్ స్పిన్నర్లకు ఈ వరల్డ్ కప్ ఎలా కలిసొస్తుందో చూడాలి.

ఇక ఇప్పటి వరకూ జరిగిన వరల్డ్ కప్ టోర్నీలలో ఒక ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత కూడా ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిటే ఉంది. అతడు 2019 ప్రపంచకప్‌లో ఏకంగా 27 వికెట్లు తీశాడు. అతని తర్వాత 2వ స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు ఫెర్గూసన్ ఉన్నాడు. అతడు 21 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 20 వికెట్లు, బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ 20 వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్ 554 బంతులు వేసి 502 పరుగులు ఇచ్చాడు. అతని అత్యుత్తమం 5/26. ఫెర్గూసన్ 502 బంతులు వేసి 409 పరుగులు ఇచ్చాడు.

ఇక ఇండియన్ బౌలర్ల విషయానికి వస్తే వరల్డ్ కప్ లలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఘనత జహీర్ ఖాన్ కు దక్కుతుంది. అతడు 2003-2011 మధ్య మూడు వరల్డ్ కప్ లలో 23 మ్యాచ్ లు ఆడి 44 వికెట్లు తీసుకున్నాడు. 2003లో ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ చేరగా.. 2011లో విజేతగా నిలిచింది. 2007లో మాత్రమే తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఇక 2019లో ఇండియా తరఫున బుమ్రా 18 వికెట్లతో మెరిశాడు
ప్లేయర్జట్లువిరన్స్ఎ.బం.ఎకాస్ట్రై.రే.3వి5విమె
1
Mohammed ShamiMohammed Shami
IND2410482577/57512134
2
Adam ZampaAdam Zampa
AUS2322965154/8525501
3
Dilshan MadushankaDilshan Madushanka
SL2125785255/80622314
4
Jasprit BumrahJasprit Bumrah
IND2018913734/39427209
5
Gerald CoetzeeGerald Coetzee
SA2019633964/44619401
6
Shaheen AfridiShaheen Afridi
PAK1826814815/54527213
7
Marco JansenMarco Jansen
SA1726694503/31624203
8
Ravindra JadejaRavindra Jadeja
IND1624933985/33435114
9
Josh HazlewoodJosh Hazlewood
AUS1628934493/38434108
10
Mitchell SantnerMitchell Santner
NZ1628924495/59434114
11
Mitchell StarcMitchell Starc
AUS1633875283/34632202
12
Haris RaufHaris Rauf
PAK1633795333/43629301
13
Bas de LeedeBas de Leede
NED1630674874/62725200
14
Keshav MaharajKeshav Maharaj
SA1524893704/46435101
15
Kuldeep YadavKuldeep Yadav
IND1528954242/7438002

వార్తలు

FAQ (తరచుగా అడిగే ప్రశ్నలు)

ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు?

ఆస్ట్రేలియాకు చెందిన మెక్‌గ్రాత్. అతడు ప్రపంచకప్ టోర్నీల్లో మొత్తం 71 వికెట్లు తీశాడు.

2019 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు?

ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్. అతడు 2019లో మొత్తం 27 వికెట్లు తీశాడు.

ప్రపంచ కప్ 2019లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ ఎవరు?

2019 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బుమ్రా. 18 వికెట్లు తీశాడు.

ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ ఎవరు?

భారత ఆటగాడు జహీర్ ఖాన్. 2003-2011 మధ్య 23 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీశాడు.