వరల్డ్ కప్ అత్యధిక పరుగులు
క్రికెట్ లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు వంటి రికార్డులన్నీ ఇండియన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిటే ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్‌లోనూ అంతే. అత్యధిక పరుగుల రికార్డు ఈ క్రికెట్ గాడ్ సొంతం. రికార్డు స్థాయిలో 1992 నుంచి 2011 వరకు ఏకంగా ఆరు వరల్డ్ కప్ లు ఆడిన సచిన్.. వాటిలో 45 మ్యాచ్ లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఏకంగా 56.95 సగటుతో 2278 రన్స్ చేశాడు. అందులో 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. సచిన్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. అతడు మొత్తం 5 వరల్డ్ కప్ లలో 46 మ్యాచ్ లు ఆడి 1743 రన్స్ చేశాడు. అందులో 5 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక మూడోస్థానంలో కుమార సంగక్కర (1532 రన్స్), నాలుగోస్థానంలో బ్రియాన్ లారా (1225 రన్స్), ఐదో స్థానంలో ఏబీ డివిలియర్స్ (1207 రన్స్), ఆరోస్థానంలో క్రిస్ గేల్ (1186 రన్స్), ఏడోస్థానంలో జయసూర్య (1165 రన్స్), ఎనిమిదో స్థానంలో జాక్ కలిస్ (1148 రన్స్), 9వ స్థానంలో షకీబుల్ హసన్ (1146 రన్స్), 10వ స్థానంలో దిల్షాన్ (1112 రన్స్) ఉన్నారు.
ఒకే వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల రికార్డు కూడా సచిన్ టెండూల్కర్ పేరిటే ఉంది. అతడు 2003 వరల్డ్ కప్ లో ఏకంగా 673 రన్స్ చేశాడు. అందులో పాకిస్థాన్ పై ఆడిన చిరస్మరణీయ 98 పరుగులు ఇన్నింగ్స్ కూడా ఉంది. ఇక సచిన్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఉన్నాడు. హేడెన్ 2007 వరల్డ్ కప్ లో 659 రన్స్ చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. 73 సగటుతో అతడు రన్స్ చేయడం విశేషం. మూడోస్థానంలో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. 2019 వరల్డ్ కప్ లో రోహిత్ 9 మ్యాచ్ లలోనే ఏకంగా 81 సగటుతో 648 రన్స్ చేశాడు. అందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇదే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 71 సగటుతో 647 రన్స్ చేయడం విశేషం. ఐదోస్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ కూడా 2019 వరల్డ్ కప్ లోనే 606 రన్స్ చేశాడు. వరల్డ్ కప్ 2023 ఇండియాలో జరగనుండటంతో బ్యాటర్లకు పరుగుల పండగే. మోకాలి ఎత్తులో వచ్చే బాల్స్ ను సులువుగా ఆడుతూ బ్యాటర్లు భారీ స్కోర్లు చేయగలరు.

ప్లేయర్ | జట్లు | రన్స్ | స్ట్రై.రే. | మ్యా | ఇ | నా.ఔ. | అ.స్కో. | స | 30లు | 50లు | 100లు | 6లు | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ![]() | IND | 765 | 90 | 11 | 11 | 3 | 117 | 95 | 0 | 6 | 3 | 9 |
2 | ![]() | IND | 597 | 125 | 11 | 11 | 0 | 131 | 54 | 5 | 3 | 1 | 31 |
3 | ![]() | SA | 594 | 107 | 10 | 10 | 0 | 174 | 59 | 1 | 0 | 4 | 21 |
4 | ![]() | NZ | 578 | 106 | 10 | 10 | 1 | 123* | 64 | 2 | 2 | 3 | 17 |
5 | ![]() | NZ | 552 | 111 | 10 | 9 | 1 | 134 | 69 | 2 | 2 | 2 | 22 |
6 | ![]() | AUS | 535 | 108 | 11 | 11 | 0 | 163 | 48 | 1 | 2 | 2 | 24 |
7 | ![]() | IND | 530 | 113 | 11 | 11 | 3 | 128* | 66 | 1 | 3 | 2 | 24 |
8 | ![]() | IND | 452 | 90 | 11 | 10 | 4 | 102 | 75 | 3 | 2 | 1 | 9 |
9 | ![]() | SA | 448 | 84 | 10 | 10 | 1 | 133 | 49 | 0 | 2 | 2 | 8 |
10 | ![]() | AUS | 441 | 107 | 10 | 10 | 1 | 177* | 49 | 1 | 1 | 2 | 21 |
11 | ![]() | SA | 406 | 110 | 10 | 10 | 1 | 106 | 45 | 1 | 3 | 1 | 9 |
12 | ![]() | ENG | 404 | 101 | 9 | 9 | 0 | 140 | 44 | 2 | 2 | 1 | 9 |
13 | ![]() | AUS | 400 | 150 | 9 | 9 | 3 | 201* | 66 | 2 | 0 | 2 | 22 |
14 | ![]() | PAK | 395 | 95 | 9 | 8 | 2 | 131* | 65 | 4 | 1 | 1 | 5 |
15 | ![]() | AFG | 376 | 76 | 9 | 9 | 1 | 129* | 47 | 1 | 1 | 1 | 5 |
వార్తలు
FAQ (తరచుగా అడిగే ప్రశ్నలు)
ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు?
భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్. ఆరు ప్రపంచకప్ లలో మాస్టర్ 2278 పరుగులు చేశాడు.
ప్రపంచ కప్ 2019లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు?
భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ. మొత్తం 648 పరుగులు చేశాడు.
ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు చేసిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరు?
సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, లారా, ఏబీ డివిలియర్స్