Women's T20 World Cup 2024 Schedule: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే
Women's T20 World Cup 2024 Schedule: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 గురువారం (అక్టోబర్ 3) నుంచి ప్రారంభమైంది. ఇండియా శుక్రవారం (అక్టోబర్ 4) తన తొలి మ్యాచ్ ఆడనుంది. మరి ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలను ఒకసారి చూద్దాం.
Women's T20 World Cup 2024 Schedule: మహిళల టీ20 వరల్డ్ కప్ వచ్చేసింది. తొమ్మిదో ఎడిషన్ టోర్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం (అక్టోబర్ 3) మధ్యాహ్నం 3.30 గంటలకు షార్జాలో స్కాట్లాండ్ తో బంగ్లాదేశ్, రాత్రి 7.30 గంటలకు శ్రీలంకతో పాకిస్థాన్ తలపడతాయి. శుక్రవారం (అక్టోబర్ 4) రాత్రి 7.30 గంటలకు దుబాయ్ లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది.
మహిళల టీ20 వరల్డ్ కప్ ఇప్పటి వరకూ ఇలా..
గత మూడు టోర్నమెంట్లు గెలిచిన ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. వాస్తవానికి, టోర్నమెంట్ చరిత్రలో ఆస్ట్రేలియా రెండుసార్లు మినహా అన్నింటిలోనూ ఛాంపియన్ కావడం విశేషం. 2009 లో ఇంగ్లాండ్ ప్రారంభ ఎడిషన్ లో విజేతగా నిలిచింది. ఇక వెస్టిండీస్ 2016 లో గెలిచింది. ఏడో టైటిల్ పై కన్నేసిన ఆస్ట్రేలియా.. శనివారం(అక్టోబర్ 5) మధ్యాహ్నం 3.30 గంటలకు షార్జా వేదికగా శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడనుంది.
2020లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు చేరుకుంది. ఈ ఏడాది జూన్ లో ఇండియా పురుషుల జట్టు 17 ఏళ్ల తర్వాత మరోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో వాళ్ల స్ఫూర్తిగా ఇప్పుడు మహిళల టీమ్ కూడా ఛాంపియన్ గా నిలవాలని భావిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2024 ఫార్మాట్ ఇలా..
మహిళల టీ20 వరల్డ్ కప్ 2024లో 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్ కు ఒక్కో గ్రూపు నుంచి టాప్ లో నిలిచిన రెండేసి టీమ్స్ వెళ్తాయి. అక్టోబర్ 20న దుబాయ్ లో ఫైనల్ జరగనుంది.
గ్రూప్ ఎ: ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక
గ్రూప్ బి: దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 - పూర్తి షెడ్యూల్
అక్టోబర్ 3, 2024:
మ్యాచ్ 1- బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్, షార్జా (మధ్యాహ్నం 3.30 గంటలకు)
మ్యాచ్ 2- పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, షార్జా (రాత్రి 7.30 గంటలకు)
అక్టోబర్ 4, 2024:
దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్, దుబాయ్ (మధ్యాహ్నం 3.30 గంటలకు)
మ్యాచ్ 4: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30)
అక్టోబర్ 5, 2024: ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30)
మ్యాచ్ 6- బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లాండ్ (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30)
అక్టోబర్ 6, 2024:
మ్యాచ్ 7- భారత్ వర్సెస్ పాకిస్తాన్ (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30)
మ్యాచ్ 8- స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ (భారత కాలమానం ప్రకారం 7.30 గంటలకు)
అక్టోబర్ 7, 2024:
మ్యాచ్ 9: ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా, షార్జా (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 8, 2024:
మ్యాచ్ 10: ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్, షార్జా (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 9, 2024:
మ్యాచ్ 11- స్కాట్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా, దుబాయ్ (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు)
మ్యాచ్ 12- భారత్ వర్సెస్ శ్రీలంక, దుబాయ్ (భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు)
అక్టోబర్ 10, 2024:
మ్యాచ్ 13: బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ (భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు)
అక్టోబర్ 11, 2024:
మ్యాచ్ 14: ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్, దుబాయ్ (భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు)
అక్టోబర్ 12, 2024:
మ్యాచ్ 15: న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక, షార్జా (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు)
మ్యాచ్ 16- బంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా, దుబాయ్ (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు)
అక్టోబర్ 13, 2024
మ్యాచ్ 17- ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్, షార్జా (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు)
మ్యాచ్ 18: ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా, షార్జా (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు)
అక్టోబర్ 14, 2024:
మ్యాచ్ 19: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్, దుబాయ్ (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలు)
అక్టోబర్ 15, 2024:
మ్యాచ్ 20: ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్, దుబాయ్ (భారత కాలమానం ప్రకారం రాత్రి
7:30 గంటలకు)
అక్టోబర్ 17, 2024: తొలి సెమీఫైనల్, దుబాయ్ (భారత కాలమానం ప్రకారం రాత్రి
7.30 గంటలకు)
అక్టోబర్ 18, 2024: రెండో సెమీఫైనల్, షార్జా (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30
గంటలకు)
టీ20 వరల్డ్ కప్ 2024కు ఇండియా టీమ్ ఇదే
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా (ఫిట్నెస్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాలన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ (ఫిట్నెస్కు లోబడి), సజనా సజీవన్
ట్రావెలింగ్ రిజర్వ్స్: ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్
మహిళల టీ20 వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్
మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ఇండియాలో చూడొచ్చు. ఇక ఆన్లైన్ లో అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది. ఈ మెగాటోర్నీ యూఏఈలోని దుబాయ్, షార్జా నగరాల్లో జరుగుతుంది. మ్యాచ్ రోజుల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ లు ప్రారంభమవుతాయి.