Virat Kohli: ప్రపంచకప్ పరుగుల్లో మరో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ.. సచిన్‍ను అధిగమించి..-virat kohli scored most runs in a single world cup edition and surpases sachin tendulkar ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: ప్రపంచకప్ పరుగుల్లో మరో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ.. సచిన్‍ను అధిగమించి..

Virat Kohli: ప్రపంచకప్ పరుగుల్లో మరో రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ.. సచిన్‍ను అధిగమించి..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 15, 2023 06:44 PM IST

Virat Kohli - ICC World Cup 2023: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో చరిత్ర సృష్టించాడు. ఒక ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (Hindustan Times)

Virat Kohli - ICC World Cup 2023: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు సృష్టించాడు. నేడు (నవంబర్ 15) న్యూజిలాండ్‍తో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‍లో ఈ చరిత్ర లిఖించాడు. ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‍గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఆ వివరాలివే.

2003 వన్డే ప్రపంచకప్‍లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ 673 పరుగులు చేయగా.. అతడిని కోహ్లీ ఇప్పుడు అధిగమించాడు. ఈ సెమీస్‍ మ్యాచ్‍లో 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ.. ఈ ప్రపంచకప్‍లో 674 పరుగులకు చేరుకున్నాడు. ఓ ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ఈ ప్రపంచకప్‍లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 711 రన్స్ చేశాడు.   

అలాగే, అత్యధిక వన్డే సెంచరీలు చేసిన అద్భుత రికార్డును కూడా విరాట్ కోహ్లీ సృష్టించాడు. 50 వన్డే శతకాలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అత్యధిక వన్డే సెంచరీల్లోనూ సచిన్ టెండూల్కర్‌ (49 వన్డే సెంచరీలు) రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. 

అత్యధిక 50+ రికార్డ్

ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా విరాట్ కోహ్లీ కైవసం అయింది. ఈ ప్రపంచకప్‍లో మూడు శతకాలు, ఐదు సెంచరీలు చేశాడు విరాట్. దీంతో ఎనిమిదిసార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 2003 వన్డే ప్రపంచకప్‍లో సచిన్ టెండూల్కర్, 2019 వన్డే ప్రపంచకప్‍లో షకీబల్ హసన్ ఏడుసార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ ఇద్దరినీ విరాట్ కోహ్లీ ఇప్పుడు దాటేశాడు. ఓ ప్రపంచకప్‍లో ఎక్కువ మ్యాచ్‍ల్లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డును కోహ్లీ దక్కించుకున్నాడు. 

న్యూజిలాండ్‍తో ఈ ప్రపంచకప్ సెమీస్‍ మ్యాచ్‍లో విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేశాడు. 

Whats_app_banner