Virat Kohli Injuries: విరాట్ కోహ్లి ముఖం నిండా గాయాలు.. అసలేమైంది?-virat kohli injuries photo gone viral instantly this is what happened ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli Injuries: విరాట్ కోహ్లి ముఖం నిండా గాయాలు.. అసలేమైంది?

Virat Kohli Injuries: విరాట్ కోహ్లి ముఖం నిండా గాయాలు.. అసలేమైంది?

Hari Prasad S HT Telugu
Nov 28, 2023 08:15 AM IST

Virat Kohli Injuries: విరాట్ కోహ్లి ముఖం నిండా గాయాలతో కనిపించిన ఫొటో వైరల్ అయింది. సోమవారం (నవంబర్ 27) అతడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసిన ఈ ఫొటో అభిమానులను ఆందోళనకు గురి చేసింది.

ముఖానికి గాయాలతో విరాట్ కోహ్లి
ముఖానికి గాయాలతో విరాట్ కోహ్లి

Virat Kohli Injuries: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ముఖానికి గాయాలతో ఇలా కనిపించాడు. ఈ ఫొటోను అతడే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశాడు. ఇండియాలోనే అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీగా కోహ్లి ఏ పోస్ట్ చేసినా అది కాస్తా వెంటనే వైరల్ అవుతుంది. అందులోనూ ఇలా ముఖం నిండా గాయాలతో కనిపించేసరికి అభిమానులు ఆందోళన చెందారు.

అసలు విరాట్ కోహ్లికి ఏమైంది అంటూ ప్రశ్నించారు. ఈ ఫొటోను కోహ్లి సోమవారం (నవంబర్ 27) తన ఇన్‌స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. "మీరు మరో వ్యక్తిని చూడాలి" అనే క్యాప్షన్ తో అతడీ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. అందులో ముఖానికి అక్కడక్కడా గాయాలు, ముక్కుపై బ్యాండ్ ఎయిడ్ తో అతడు కనిపించాడు.

కోహ్లికి అసలేమైంది?

ఈ పోస్ట్ చూసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆందోళన చెందుతూ పోస్టులు చేశారు. అసలు కోహ్లికి ఏమైంది? ఇది అతని లేటెస్ట్ ఇన్‌స్టా స్టోరీ అంటూ ఓ అభిమాని అతని ఫొటోను షేర్ చేస్తూ ప్రశ్నించాడు. అంతా బాగానే ఉందా కింగ్ కోహ్లి అంటూ మరో అభిమాని అడిగాడు. నిజానికి ఈ గాయాలున్నా కూడా ఈ ఫొటోలో కోహ్లి నవ్వుతూ కనిపించాడు.

ఈ ఫొటో ప్యూమా బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా తీసినది కావడం విశేషం. ప్యూమా బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా భారీ డిస్కౌంట్లు ఇస్తోందని, వాటి కోసం ఫైట్ చేసి తన పరిస్థితి ఇలా అయిందన్నట్లుగా కోహ్లి ఈ ఫొటో పోస్ట్ చేశాడు. దీని తర్వాత మరో రెండు వీడియోలు కూడా ఇన్‌స్టా స్టోరీస్ లో ఉన్నాయి. వాటిలో తన భార్య అనుష్క శర్మతో కలిసి కోహ్లి ప్యూమా బ్రాండ్ ప్రమోషన్లు చేయడం చూడొచ్చు.

మరోవైపు ఐపీఎల్లో వచ్చే సీజన్లోనూ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడనున్నాడు. ఆదివారంతో రిటెయిన్, రిలీజ్ చేసిన ప్లేయర్స్ తుది జాబితాను విడుదల చేయాల్సి ఉండగా.. ఆర్సీబీ కోహ్లిని రిటెయిన్ చేసుకుంది. కోహ్లిని తీసుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలు అతనితో బేరసారాలు జరిపినా.. కోహ్లి మాత్రం ఆర్సీబీతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.

Whats_app_banner