Virat Kohli: వ‌ర‌ల్డ్ రిచెస్ట్ క్రికెట‌ర్‌గా విరాట్ కోహ్లి - ఈ టీమిండియా క్రికెట‌ర్ ఏడాది సంపాద‌న ఎంతంటే?-virat kohli becomes richest cricketer in the world team india player net worth ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: వ‌ర‌ల్డ్ రిచెస్ట్ క్రికెట‌ర్‌గా విరాట్ కోహ్లి - ఈ టీమిండియా క్రికెట‌ర్ ఏడాది సంపాద‌న ఎంతంటే?

Virat Kohli: వ‌ర‌ల్డ్ రిచెస్ట్ క్రికెట‌ర్‌గా విరాట్ కోహ్లి - ఈ టీమిండియా క్రికెట‌ర్ ఏడాది సంపాద‌న ఎంతంటే?

Nelki Naresh Kumar HT Telugu
Sep 07, 2024 12:08 PM IST

Virat Kohli: వ‌ర‌ల్డ్ రిచెస్ట్ క్రికెట‌ర్‌గా కోహ్లి నిలిచాడు. గ‌త ఏడాది కాలంలో కోహ్లి 847 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన‌ట్లు స్టాటిస్టా అనే స్పోర్ట్స్ మ్యాగ‌జైన్ ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్ రిచెస్ట్ అథ్లెట్ల లిస్ట్‌లో ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో టాప్ ప్లేస్‌ను ద‌క్కించుకున్నాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

Virat Kohli: వ‌ర‌ల్డ్ రిచెస్ట్ క్రికెట‌ర్‌గా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి నిలిచాడు. సంపాద‌న విష‌యంలో మిగిలిన క్రికెట‌ర్లు ఎవ‌రూ కూడా కోహ్లి ద‌రిదాపుల్లోకి కూడా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా అత్య‌ధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న టాప్ టెన్ అథ్లెట్ల లిస్ట్‌ను స్టాటిస్టా అనే మ్యాగ‌జైన్ ప్ర‌క‌టించింది. 2023 సెప్టెంబ‌ర్ నుంచి 2024 సెప్టెంబ‌ర్ వ‌ర‌కు అథ్లెట్లు గ‌డించిన ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని స్టాటిస్టా ఈ జాబితాను ప్ర‌క‌టించింది.

తొమ్మిదో స్థానంలో కోహ్లి...

ఈ రిచెస్ట్ అథ్లెట్ల లిస్ట్‌లో కోహ్లి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ రెమ్యున‌రేష‌న్‌తో పాటు వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కోహ్లి గ‌త ఏడాది కాలంలో 847 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన‌ట్లు స్టాటిస్టా ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్‌లోనే రిచెస్ట్ క్రికెట‌ర్‌గా అవ‌త‌రించాడు.

ఒకే ఒక్క‌డు...

వ‌ర‌ల్డ్ టాప్ టెన్ రిచెస్ట్ అథ్లెట్ల‌లో కోహ్లి ఒక్క‌డే క్రికెట‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. మిగిలిన అథ్లెట్లు చాలా వ‌ర‌కు ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు ఉన్నారు. మిగిలిన టీమిండియా క్రికెట‌ర్ల సంపాద‌న కోహ్లిలోనే స‌గం మాత్ర‌మే ఉండ‌టం గ‌మ‌నార్హం.

రొనాల్డో టాప్‌...

వ‌ర‌ల్డ్ రిచెస్ట్ అథ్లెట్ల లిస్ట్‌లో 2081 కోట్ల‌తో ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ప్రొఫెష‌న‌ల్ గోల్ఫ్ ప్లేయ‌ర్ జాన్ రాహ్మ్ 1712 కోట్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతోన్నాడు. ఫుట్‌బాల్ స్టార్లు మెస్సీ (1074 కోట్లు), మెంబాప్పే (881 కోట్లు), నేయ్‌మ‌ర్ (864 కోట్లు) టాప్ టెన్‌లో ఉన్నారు. బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ 990 కోట్ల‌తో నాలుగో ప్లేస్‌ను ద‌క్కించుకున్నాడు.

ఏ ప్ల‌స్ గ్రేడ్‌...

ప్ర‌స్తుతం బీసీసీఐ కాంట్రాక్టుల్లో కోహ్లి ఏ ప్ల‌స్ గ్రేడ్‌లో ఉన్నాడు. ఈ వార్షిక కాంట్రాక్టు ద్వారా బీసీసీఐ నుంచి ఏడాదికి ఏడు కోట్ల వ‌ర‌కు కోహ్లి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ టీమ్ మెయిన్ ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతోన్నాడు కోహ్లి. ఐపీఎల్ కోసం ప్ర‌తి ఏటా ఆర్‌సీబీ కోహ్లికి ప‌దిహేడున్న‌ర కోట్ల వ‌ర‌కు చెల్లిస్తోంది.

ఒక్కో యాడ్‌కు ప‌ది కోట్లు...

ప్ర‌స్తుతం కోహ్లి ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్‌కు అండాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. ఒక్కో యాడ్‌లో న‌టించినందుకు కోహ్లి ఎనిమిది నుంచి ప‌ది కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల కోసం కోహ్లి కోటి నుంచి రెండు కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత టీ20 ఫార్మెట్‌కు గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లి వ‌న్డేలు, టెస్టుల్లో కొన‌సాగుతోన్నాడు. కోహ్లితో పాటు రోహిత్ కూడా టీ20ల‌కు గుడ్‌బై చెప్పాడు..

Whats_app_banner