Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీలో టీమిండియా క్రికెట‌ర్ - తెలుగులో ది గోట్ రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్‌-thalapathy vijay the goat telugu pre release business cricketer badrinath to play guest role in vijay movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీలో టీమిండియా క్రికెట‌ర్ - తెలుగులో ది గోట్ రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్‌

Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీలో టీమిండియా క్రికెట‌ర్ - తెలుగులో ది గోట్ రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 04, 2024 06:16 AM IST

Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్ ది గోట్ మూవీలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఎస్ బ‌ద్రినాథ్ ఓ గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. కాగా తెలుగులో ద‌ళ‌ప‌తి విజ‌య్ డ‌బ్బింగ్ సినిమాల్లో హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూడో మూవీగా ది గోట్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ద‌ళ‌ప‌తి విజ‌య్
ద‌ళ‌ప‌తి విజ‌య్

Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్ ది గోట్ మూవీ సెప్టెంబ‌ర్ 5న త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. విజ‌య్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టిస్తోన్న ఈ సినిమాకు వెంక‌ట్‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. త‌మిళ‌నాట బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉండ‌గా తెలుగులో మాత్రం అంతంత‌మాత్రంగానే ఉన్నాయి. విజ‌య్ గ‌త సినిమాల‌కంటే త‌క్కువ స్థాయిలోనే తెలుగులో బుకింగ్స్ జ‌రుగుతోన్నాయి.

టీమిండియా క్రికెట‌ర్ గెస్ట్‌...

కాగా ది గోట్ మూవీలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఎస్ బ‌ద్రినాథ్ గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని బ‌ద్రినాథ్ ట్విట్ట‌ర్ ద్వారా స్వ‌యంగా ప్ర‌క‌టించారు. డ‌బ్బింగ్ స్టూడియోలో త‌న క్యారెక్ట‌ర్‌కు డ‌బ్బింగ్ చెబుతోన్న ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నాడు బ‌ద్రినాథ్‌.

కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ఓ సినిమాలో భాగం కావ‌డం ఎగ్జైటింగ్‌గా ఉంద‌ని, రివ్యూస్ కోసం వెయిటింగ్ చేస్తున్నానంటూ బ‌ద్రినాథ్ ట్వీట్ చేశాడు. అత‌డి ట్వీట్ వైర‌ల్ అవుతోంది. బ‌ద్రినాథ్ టీమిండియా త‌ర‌ఫున ఏడు వ‌న్డేలు, రెండు టెస్ట్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వ‌హించాడు.

ఏఐ టెక్నాల‌జీతో విజ‌య్ కాంత్‌...

ది గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) మూవీలో విజ‌య్‌కి జోడీగా మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌భుదేవా, ప్ర‌శాంత్‌, మోహ‌న్‌, స్నేహా, లైలా వంటి సీనియ‌ర్ హీరోహీరోయిన్లు ఈ మూవీలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ మూవీ కోసం దివంగ‌త కోలీవుడ్ న‌టుడు విజ‌య్ కాంత్‌ను ఏఐ టెక్నాల‌జీతో రీక్రియేట్ చేశారు. క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో కొన్ని సెకండ్ల పాటు విజ‌య్ కాంత్ క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఇందులో విజ‌య్ తండ్రీకొడుకులుగా రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు.

చెన్నైలో అలా....

కోలీవుడ్‌లో ది గోట్‌ సినిమాపై భారీ హైప్ ఉండ‌టంతో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జ‌రిగాయి. త‌మిళ‌నాడులో ఇప్ప‌టివ‌ర‌కు అడ్వాన్స్ బుకింగ్స్ 25 కోట్ల‌ను దాటిన‌ట్లు మేక‌ర్స్ చెబుతోన్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మ‌రో ఐదు కోట్ల వ‌ర‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఓవ‌ర్‌సీస్‌లో మ‌రో ఇర‌వై ఐదు కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగిన‌ట్లు తెలిసింది. మొత్తంగా ది గోట్‌ అడ్వాన్స్ బుకింగ్స్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 55 కోట్ల‌ను దాటిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. విజ‌య్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగిన సినిమాల్లో ఒక‌టిగా ది గోట్ నిలిచింది. తెలుగులో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ రెండు కోట్ల లోపే ఉండ‌టం గ‌మ‌నార్హం.

12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌...

తెలుగులో ది గోట్‌ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 12 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. విజ‌య్ తెలుగు డ‌బ్బింగ్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూడో మూవీగా ది గోట్ నిలిచింది. విజ‌య్ గ‌త సినిమాలు, లియో, వార‌సుడు 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో టాప్ 2లో ఉన్నాయి. వాటి త‌ర్వాత ది గోట్ నిలిచింది. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

టాపిక్