Mrunal Thakur: కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ హార‌ర్ మూవీ చేయ‌బోతున్న‌ మృణాల్ ఠాకూర్‌ - కాంచ‌న 4తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ!-mrunal thakur to make her kollywood debut with horror comedy movie kanchana 4 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mrunal Thakur: కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ హార‌ర్ మూవీ చేయ‌బోతున్న‌ మృణాల్ ఠాకూర్‌ - కాంచ‌న 4తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ!

Mrunal Thakur: కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ హార‌ర్ మూవీ చేయ‌బోతున్న‌ మృణాల్ ఠాకూర్‌ - కాంచ‌న 4తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ!

Nelki Naresh Kumar HT Telugu
Jun 09, 2024 07:17 AM IST

Mrunal Thakur: సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హార‌ర్ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న కాంచ‌న 4లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: కాంచ‌న సిరీస్ సినిమాలు తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాల్ని సాధించాయి. ముని మూవీతో ఈ హార‌ర్ ఫ్రాంచైజ్ మొద‌లైంది. ఈ ఫ్రాంచైజ్‌లో కాంచ‌న -2, కాంచ‌న 3 సినిమాలొచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. హిందీ, క‌న్న‌డంతో పాటు ప‌లు భాష‌ల్లో రీమేక‌య్యాయి.

కాంచ‌న 4

కాంచ‌న సిరీస్‌లో నాలుగో పార్ట్‌ను తెర‌కెక్కించేందుకు రాఘ‌వ లారెన్స్ స‌న్నాహాలు చేస్తోన్నాడు. కాంచ‌న 4లో హీరోగా న‌టిస్తూనే ఈ హార‌ర్ కామెడీ మూవీకి లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం కాంచ‌న 4కు సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోన్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే కాంచ‌న 4 మూవీ సెట్స్‌పైకి రానుంది.

హీరోయిన్‌గా మృణాల్‌...

కాగా కాంచ‌న 4లో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ హార‌ర్ మూవీతోనే ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. క‌థ, సినిమాలో త‌న క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేసిన తీరు న‌చ్చ‌డంతో ఈ హార‌ర్ కామెడీ మూవీలో న‌టించ‌డానికి మృణాల్ ఒప్పుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కాంచ‌న 4లో హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు ఇంపార్టెన్స్ ఎక్కువ‌గా ఉండ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

ఫ‌స్ట్ హార‌ర్ మూవీ...

సినీ కెరీర్‌లో మృణాల్ ఠాకూర్ ల‌వ్‌స్టోరీస్‌, యాక్ష‌న్ సినిమాలే ఎక్కువ‌గా చేసింది. కాంచ‌న 4 తో ఫ‌స్ట్ టైమ్ హార‌ర్ జాన‌ర్‌ను ట‌చ్ చేయ‌బోతున్న‌ది. గ‌తంలో హిందీలో వ‌చ్చిన ఆంథాల‌జీ మూవీ ది ఘోస్ట్ స్టోరీస్‌లో క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సెగ్మెంట్‌లో మృణాల్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించింది. హీరోయిన్‌గా ఫుల్ లెంగ్త్ హార‌ర్ మూవీ చేయ‌డం మాత్రం ఇదే మొద‌టి సారి. కాంచ‌న 4ను త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏక‌కాలంలో షూట్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఫ్యామిలీ స్టార్‌తో హ్యాట్రిక్ మిస్‌...

ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్‌తో టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకున్న‌ది మృణాల్ ఠాకూర్‌. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఔట్‌డేటెడ్ స్టోరీలైన్‌, ఆర్టిఫీషియ‌ల్ స్క్రీన్‌ప్లే కార‌ణంగా ఫ్యామిలీ స్టార్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

ఫ్యామిలీ స్టార్ కంటే ముందు సీతారామం, హాయ్ నాన్న సినిమాలు మృణాల్ ఠాకూర్‌కు స‌క్సెస్‌ల‌ను తెచ్చిపెట్టాయి. ఫ్యామిలీ స్టార్‌తో హ్యాట్రిక్ అందుకోవాల‌నే ఆమె క‌ల తీర‌లేదు. దాదాపు యాభై కోట్ల బ‌డ్జెట్‌తో దిల్‌రాజు ఫ్యామిలీ స్టార్ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.థియేట‌ర్ల‌లో ఈ మూవీ ఇర‌వై కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. ఫ్యామిలీ స్టార్ సినిమాకు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

నాలుగేళ్ల‌లో ఒక్క హిట్టు లేదు...

మ‌రోవైపు హిందీలో మృణాల్ ఠాకూర్ బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. గ‌త నాలుగేళ్ల‌లో ఒక్క హిట్టు లేదు. మృణాల్ హీరోయిన్‌గా న‌టించిన అంఖ్ మిచోలి, గుమ్రా ఫెయిల్యూర్‌గా నిలిచాయి. పిప్పాతో పాటు ధ‌మాకా, తుఫాన్ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ‌య్యాయి. ప్ర‌స్తుతం హిందీలో పూజా మేరీ జాన్ సినిమా చేస్తోంది మృణాల్ ఠాకూర్‌. ఈ మూవీతో స‌క్సెస్ కొట్టి హిందీలో త‌న‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్