Naga Chaitanya: బీసీసీఐ మాజీ అధ్యక్షుడితో నాగచైతన్య పోటీ - సినిమాల్లో కాదు...
నాగచైతన్య రేసింగ్ ట్రాక్‌లో బాలీవుడ్ హీరోలతో పోటీపడనున్నాడు. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ అనే టీమ్‌ను కొనుగోలు చేశాడు. ఆగస్ట్ 24 నుంచి జరుగనున్న ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌లో నాగచైతన్య టీమ్ బరిలో దిగుతోంది. ఇందులో కోల్‌కతా రాయల్ టైగర్స్ టీమ్‌కు సౌరభ్ గంగూలీ ఓనర్‌గా కొనసాగుతోన్నాడు.
Naga Chaitanya: టాలీవుడ్ హీరో నాగచైతన్య బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతో పోటీపడనున్నాడు. అయితే బాక్సాఫీస్ వద్ద కాదు...రేసింగ్‌లో. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ అనే రేసింగ్ టీమ్‌ను నాగచైతన్య కొనుగోలు చేశాడు. నాగచైతన్య రేసింగ్ టీమ్ ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్)లో పోటీపడనుంది. ఐఆర్ఎఫ్ ఫార్ములా 4 రేసింగ్‌లు ఆగస్ట్ 24 నుంచి మొదలుకానున్నాయి.
ఫస్ట్ హీరో...
రేసింగ్ టీమ్ ఓనర్‌గా నిలిచిన ఫస్ట్ టాలీవుడ్ హీరోగా నాగచైతన్య నిలిచాడు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ‘‘నాకు చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఫార్మాలా వన్‌ను ఎంతగానో ఇష్టపడుతుంటాను. ఫార్ములా వన్‌లోని హైస్పీడ్ డ్రామా...వేగంగా కార్లు, బైక్స్ నడపటంలోని థ్రిల్ నన్నెంతగానో ఆకట్టుకుంటుంది. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ నాకు కాంపిటేషన్ కంటే ఎక్కువ అని నేను భావిస్తాను అని నాగచైతన్య అన్నాడు.
మరచిపోలేని అనుభూతి...
నా ఫ్యాషన్‌ను చూపించుకునే చక్కటి వేదిక ఇదని భావిస్తున్నానని నాగచైతన్య తెలిపాడు. . హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌ను సొంతం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఫ్యాన్స్‌కు ఐఆర్ఎఫ్ అనేది మరచిపోలేని అనుభూతినిస్తుందనటంలో సందేహం లేదు. అలాగే దీంతో ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుంది. న్యూ టాలెంట్ బయటకు వస్తుంది’’ అని అన్నాడు.
పలుమార్లు వైరల్...
సినిమాల తర్వాత నాగచైతన్య ఎక్కువగా రేసింగ్‌లనే ఇష్టపడుతుంటాడు. ఈ విషయాన్ని పలుమార్లు నాగచైతన్య స్వయంగా వెల్లడించాడు. నాగచైతన్య రేసింగ్ బైక్‌లు, కార్లు నడుపుతోన్న ఫొటోలు, వీడియో లు పలుమార్లు వైరల్ అయ్యాయి.
ఆరు టీమ్స్...
ఇండియన్ రేసింగ్ లీగ్‌లో మొత్తం ఆరు టీమ్స్ పోటీపడనున్నాయి. నాగచైతన్య హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌తో పాటు కోల్‌కతా రాయల్ టైగర్స్, స్పీడ్ డెమోస్ ఢిల్లీ, చెన్నై టర్బో రైడర్స్, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, గోవా ఏసెస్ జేఏ రేసింగ్ బరిలో దిగనున్నాయి. ఇందులో కోల్‌కతా రాయల్ టైగర్స్ టీమ్‌కు టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఓనర్‌గా వ్యవహరించనున్నాడు. స్పీడ్ డెమోస్ ఢిల్లీ టీమ్‌ను అర్జున్ కపూర్, గోవా ఏసెస్ టీమ్‌ను జాన్ అబ్రహమ్ కొనుగోలు చేశారు.
శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో...
ప్రస్తుతం నాగచైతన్య తండేల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఓ జాలరి ప్రేమకథతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్‌లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాత బన్నీవాస్ సన్నాహాలు చేస్తోన్నారు. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న సెకండ్ మూవీ ఇది. తండేల్ కంటే ముందు నాగచైతన్య, చందూ మొండేటి కాంబోలో సవ్యసాచి మూవీ వచ్చింది.
ఈ ఏడాది చివరలో పెళ్లి...
కాగా ఇటీవలే శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ జరిగింది.ఇరు కుటుంబసభ్యుల సమక్షంగా సింపుల్‌గా ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఏడాది చివరలో ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు రెండేళ్లుగా శోభిత ధూళిపాళ్లతో రహస్య ప్రేమాయణాన్ని సాగించాడు నాగచైతన్య. శోభిత తెలుగులో మేజర్, గూఢచారి సినిమాలు చేసింది.