Sri Lanka vs India: శ్రీలంక బయలుదేరిన టీమిండియా.. టీ20, వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే
Sri Lanka vs India: శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం ఆ దేశానికి బయలుదేరి వెళ్లింది టీమిండియా. జులై 27 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్ పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి.
Sri Lanka vs India: టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా మరో టూర్ కు వెళ్లింది. ఈసారి శ్రీలంకలో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఇండియన్ టీమ్ ఆ దేశానికి వెళ్లింది. మొదట మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ టూర్ మొత్తం షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
శ్రీలంక వర్సెస్ ఇండియా సిరీస్
శ్రీలంకలో రెండు వారాల పర్యటన కోసం టీమిండియా బయలుదేరి వెళ్లింది. సోమవారం (జులై 22) ఆ దేశానికి వెళ్లే ముందు టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడారు. తర్వాత టీమ్ నేరుగా ముంబై నుంచి కొలంబోకి వెళ్లింది. మొదట జులై 27 నుంచి మూడు టీ20ల సిరీస్, తర్వాత ఆగస్ట్ 2 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
మూడు టీ20ల సిరీస్ పల్లెకెలెలో జరగనుండగా.. మూడు వన్డేల సిరీస్ మొత్తం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జింబాబ్వే టూర్ కు వెళ్లి అక్కడ కూడా ఐదు టీ20ల సిరీస్ ను 4-1తో గెలిచి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీలంక సిరీస్ లో టీమిండియానే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
శ్రీలంకలో టీమిండియా షెడ్యూల్ ఇదే
టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20 - జులై 27 రాత్రి 7 గంటలకు (పల్లెకెలె స్టేడియం)
రెండో టీ20 - జులై 28 రాత్రి 7 గంటలకు (పల్లెకెలె స్టేడియం)
మూడో టీ20 - జులై 30 రాత్రి 7 గంటలకు (పల్లెకెలె స్టేడియం)
వన్డే సిరీస్ షెడ్యూల్
తొలి వన్డే - ఆగస్ట్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి (ప్రేమదాస స్టేడియం)
రెండో వన్డే - ఆగస్ట్ 4 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి (ప్రేమదాస స్టేడియం)
మూడో వన్డే - ఆగస్ట్ 7 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి (ప్రేమదాస స్టేడియం)
శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడే టీమ్ ఇదే
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్
శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడే టీమ్ ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా