IND vs PAK Match Records: లోయెస్ట్ స్కోర్‌తో పాకిస్థాన్‌పై గెలిచి రికార్డ్ సృష్టించిన టీమిండియా - ఓటముల్లో పాక్ నంబర్
IND vs PAK Match Records: బుమ్రా బౌలింగ్ మెరుపులతో పాకిస్థాన్‌పై స్వల్ప టార్గెట్‌ను కాపాడుకొని టీ20 వరల్డ్ కప్‌లో రెండు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలుకొట్టింది రోహిత్ సేన. ఆ రికార్డులు ఏవంటే?
IND vs PAK Match Records: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు లాస్ట్ బాల్ వరకు థ్రిల్లింగ్‌ను పంచింది. ఈ మ్యాచ్‌లో అసమాన పోరాటంతో టీమిండియా అదరగొట్టింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ పాకిస్థాన్‌ను చిత్తు చేసి అద్భుత విజయాన్ని అందుకున్నది.
119 పరుగులకు ఆలౌట్...
ఈ టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లితో పాటు సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మ, శివమ్ దూబే బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యారు. బుమ్రా చెలరేగడంతో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడలంలో చేతులెత్తేసిన పాక్ ఇరవై ఓవర్లలో 113 పరుగులు మాత్రమే చేసింది. ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
లోయెస్ట్ టార్గెట్...
ఈ మ్యాచ్‌లో టీ20లతో పాటు వరల్డ్ కప్‌లో టీమిండియా పలు రికార్డులను నెలకొల్పింది. టీ20ల్లో 120 పరుగుల లోయెస్ట్ టార్గెట్‌ను కాపాడుకుంటూ టీమిండియా విజయాన్ని సాధించడం ఇదే మొదటిసారి. గతంలో జింబాబ్వేపై 139 పరుగుల టార్గెట్‌ను కాపాడుకొని టీమిండియా గెలిచింది. పాకిస్థాన్ మ్యాచ్‌తో ఆ రికార్డ్ బద్దలైంది. గతంలో ఇంగ్లండ్‌పై 145 రన్స్ (2017లో), బంగ్లాదేశ్‌పై 147 రన్స్(2016లో) టార్గెట్ విధించి కూడా టీమ్ ఇండియా గెలిచింది. మొత్తంగా లోయెస్ట్ టార్గెట్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లో గెలిచిన రెండు జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. ఈ లిస్ట్‌లో శ్రీలంక మొదటిస్థానంలో ఉంది. 2014 వరల్డ్ కప్‌లో శ్రీలంక విధించిన 120 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమైన న్యూజిలాండ్ 60 పరుగులకే ఆలౌటైంది. వరల్డ్ కప్
పాకిస్థాన్‌పై ఇదే లోయెస్ట్
టీ20ల్లో పాకిస్థాన్‌పై టీమిండియాకు ఇదే లోయెస్ట్ స్కోర్ కావడం గమనార్హం. అయినా ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్రను తిరగారాసింది భారత్. గతంలో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 133 పరుగులు చేసింది భారత్. అదే ఇప్పటివరకు పాకిస్థాన్‌పై టీమిండియా సాధించిన అత్యల్ప స్కోరు. ఆదివారం జరిగిన మ్యాచ్‌తో ఆ రికార్డు బద్ధలైంది.
పాక్ రికార్డ్ ను చెరిపివేసిన టీమిండియా...
వరల్డ్ కప్ చరిత్రలో ఫస్ట్ బ్యాటింగ్ దిగి టీమిండియా చేసిన అతి తక్కువ స్కోరు కూడా ఇదే. ఈ విజయంతో టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయాల సంఖ్య 7-1 కు చేరింది. వరల్డ్ కప్‌లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు అందుకున్న టీమ్‌గా ఇండియా రికార్డ్ నెలకొల్పింది. గతంలో బంగ్లాదేశ్‌పై ఆరు విజయాలతో పాకిస్థాన్ పేరిట ఈ రికార్డు ఉండేది. పాక్ రికార్డును అదే జట్టుపై టీమిండియా చెరిపివేసింది.
ఫలితం రివర్స్
2014 నుంచి ఇండియా పాకిస్థాన్ మధ్య ఇప్పటివరకు జరిగిన ఎనిమిది టీ20 మ్యాచుల్లో ఎడింటిలో టాస్ గెలిచిన జట్టే విజయాన్ని అందుకున్నది. ఆదివారం మ్యాచ్‌లో ఫలితం రివర్స్ అయ్యింది.
భారత్‌కు విజయాన్ని అందించిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్య రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు
టాపిక్