SRH vs RR: ఫైన‌ల్‌లో కోల్‌క‌తాను ఢీకొట్టేది ఎవ‌రు? - స‌న్‌రైజ‌ర్స్‌… రాజ‌స్థాన్‌ల‌లో పైచేయి ఎవ‌రిదంటే?-rr vs srh ipl 2024 qualifier 2 match prediction playing xi toss and weather updates ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Rr: ఫైన‌ల్‌లో కోల్‌క‌తాను ఢీకొట్టేది ఎవ‌రు? - స‌న్‌రైజ‌ర్స్‌… రాజ‌స్థాన్‌ల‌లో పైచేయి ఎవ‌రిదంటే?

SRH vs RR: ఫైన‌ల్‌లో కోల్‌క‌తాను ఢీకొట్టేది ఎవ‌రు? - స‌న్‌రైజ‌ర్స్‌… రాజ‌స్థాన్‌ల‌లో పైచేయి ఎవ‌రిదంటే?

Nelki Naresh Kumar HT Telugu
May 24, 2024 10:23 AM IST

SRH vs RR Qualifier 2::ఐపీఎల్‌లో శుక్ర‌వారం (నేడు) జ‌రుగ‌నున్న క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజేత‌గా నిలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌లో కోల్‌క‌తాతో త‌ల‌ప‌డ‌నుంది.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌

SRH vs RR Qualifier 2: ఐపీఎల్ 2024లో నేడు (శుక్ర‌వారం) మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రం సాగ‌నుంది. క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డ‌నుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌రుగ‌నుంది. క్వాలిఫ‌య‌ర్ 2లో గెలిచిన జ‌ట్టు ఐపీఎల్ ఫైన‌ల్‌లో టైటిల్ కోసం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డుతుంది.

న‌లుగురిపైనే ఆశ‌లు...

లీగ్ ద‌శ‌లో చెల‌రేగిన స‌న్‌రైజ‌ర్స్ క్వాలిఫ‌య‌ర్ వ‌న్ మ్యాచ్‌లో కోల్‌క‌తా చేతిలో అనూహ్యంగా ఓట‌మిపాలైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో నిరాశ‌ప‌రిచింది. ఈ సీజ‌న్‌లో మెరుపు బ్యాటింగ్‌తో స‌న్‌రైజ‌ర్స్‌కు అద్భుత విజ‌యాలు అందించిన ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శ‌ర్మ‌తో పాటు నితీష్ రెడ్డి, క్లాసెన్ క్వాలిఫ‌య‌ర్ 1 మ్యాచ్‌లో విఫ‌ల‌మ‌య్యారు. ఈ న‌లుగురులో చెల‌రేగితేనే స‌న్‌రైజ‌ర్స్ భారీ స్కోరు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అభిషేక్ శ‌ర్మ‌...

ఈ ఐపీఎల్‌లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శ‌ర్మ అద‌ర‌గొడుతోన్నాడు. 14 మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచ‌రీల‌తో 470 ర‌న్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ 533, క్లాసెన్ 413 ర‌న్స్‌తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి 285 ర‌న్స్‌తో పాటు మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో మెప్పిస్తున్నాడు.

ఈ న‌లుగురిపైనే స‌న్‌రైజ‌ర్స్ ఎక్కువ‌గా అంచ‌నాలు పెట్టుకున్న‌ది. క్వాలిఫ‌య‌ర్ వ‌న్ మ్యాచ్‌లో కోల్‌క‌తాను క‌ట్ట‌డి చేయ‌డంలో స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్లు తేలిపోయారు. ఆ మ్యాచ్‌లో చేసిన పొర‌పాట్లు క్వాలిఫ‌య‌ర్ 2లో చేస్తే స‌న్‌రైజ‌ర్స్ ఇంటికి వెళ్ల‌డం ఖాయ‌మే అవుతుంది.

రియాన్ ప‌రాగ్ ఫామ్‌...

మ‌రోవైపు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాజ‌స్థాన్ స్ట్రాంగ్‌గా ఉంది. లీగ్ ద‌శ‌లో వ‌రుస విజ‌యాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను బెంబేలెత్తించిన ఈ టీమ్ ప్లేఆఫ్స్ ముందు త‌డ‌బ‌డింది. ఈ ఓట‌ముల నుంచి తేరుకోని ప్లేఆఫ్స్ చేరుకున్న‌ది. ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జోరుకు బ్రేకులు వేసింది. స‌న్‌రైజ‌ర్స్‌పై గెలిచి ఫైన‌ల్‌లో అడుగుపెట్టాల‌నే ల‌క్ష్యంతో క్వాలిఫ‌య‌ర్ 2లో రాజ‌స్థాన్ బ‌రిలో దిగుతోంది.

రియాన్ ప‌రాగ్ (567 ర‌న్స్‌) సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజ‌న్‌లో నిల‌క‌డ‌గా ఆడుతోన్నాడు. కెప్టెన్ సంజూ శాంస‌న్‌తో (521 ర‌న్స్‌)తో పాట య‌శ‌స్వి జైస్వాల్ కూడా భారీ స్కోర్ల‌తో రాణిస్తున్నారు. క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లో రాజ‌స్థాన్‌కు బ్యాటింగ్ ప‌రంగా ఈ ముగ్గురే కీల‌కం కానున్నారు.

పేస్ బౌల‌ర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, ఆవేశ్‌ఖాన్‌తో పాటు స్పిన్ ద్వ‌యం అశ్విన్‌, చాహ‌ల్‌ల‌పైనే రాజ‌స్థాన్ భారీగా ఆశ‌లు పెట్టుకుంది. ఈ న‌లుగురిని ఎదుర్కొంటూ స‌న్‌రైజ‌ర్స్ భారీ స్కోర్లు చేయ‌డం కొంత క‌ష్ట‌మే.

స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం...

ఈ సీజ‌న్‌లో లీగ్ ద‌శ‌లో ఓ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ్డాయి. ఆ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీని సాధించింది. చెపాక్ స్టేడియం ఈ రెండు జ‌ట్ల‌కు అంత‌గా క‌లిసిరాలేదు. ఈ సీజ‌న్‌లో చెపాక్‌పై ఆడిన మ్యాచుల్లో ఈ రెండు టీమ్‌లో త‌క్కువ స్కోర్లు చేయ‌డ‌మే కాకుండా ఆయా మ్యాచుల్లో ఓడిపోయాయి. చెన్నైతో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ 213 ప‌రుగుట టార్గెట్‌ను ఛేదించ‌డంలో త‌డ‌బ‌డిన స‌న్‌రైజ‌ర్స్ 134 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఇదే చెన్నై టీమ్‌పై రాజ‌స్థాన్ 141 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

ఇరు జ‌ట్ల అంచ‌నా...

స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌...ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శ‌ర్మ‌, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మ‌ద్‌, క్లాసెన్‌, అబ్దుల్ స‌మ‌ద్‌, పాట్ క‌మిన్స్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, న‌ట‌రాజ‌న్‌, విజ‌య్ కాంత్‌

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌:

య‌శ‌స్వి జైస్వాల్‌, కాడ్‌మోర్‌, సంజూ శాంస‌న్ రియాన్ ప‌రాగ్‌, ధ్రువ్ జురేల్‌, రోమ‌న్ పావెల్‌, అశ్విన్‌, చాహ‌ల్‌, ఆవేశ్ ఖాన్‌, బౌల్ట్‌, సందీప్ శ‌ర్మ‌.