T20 Worlcup : టీమిండియా టీ20 వరల్డ్ కప్​​ జట్టులో హార్దిక్ వద్దని చెప్పిన రోహిత్​.. కానీ!​-rohit sharma chief selector ajit agarkar were against hardik pandyas t20 wolrd cup selection ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 Worlcup : టీమిండియా టీ20 వరల్డ్ కప్​​ జట్టులో హార్దిక్ వద్దని చెప్పిన రోహిత్​.. కానీ!​

T20 Worlcup : టీమిండియా టీ20 వరల్డ్ కప్​​ జట్టులో హార్దిక్ వద్దని చెప్పిన రోహిత్​.. కానీ!​

Sharath Chitturi HT Telugu
May 14, 2024 08:07 AM IST

Hardik Pandya T20 World Cup : టీ20 వరల్డ్​ కప్​కి హార్దిక్​ పాండ్యాని ఎంపిక చేయవద్దని రోహిత్​ శర్మ చెప్పాడట. హార్దిక్​ని ఎంపిక చేయడం.. బీసీసీఐ చీఫ్​ సెలక్టర్​ అజిత్​ అగర్కర్​కి కూడా ఇష్టం లేదట!

మీడియా సమావేశంలో రోహిత్​ శర్మ..
మీడియా సమావేశంలో రోహిత్​ శర్మ.. (AFP)

T20 Worlcup Team India : టీ20 ప్రపంచ కప్ 2024​.. ఇంకొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. టీమిండియా జట్టు వివరాలు కూడా బయటకు వచ్చాయి. అయితే.. ఐపీఎల్​ 2024లో ముంబై ఇండియన్స్​కు కెప్టెన్సీ చేస్తూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్​ పాండ్యాకు.. టీమిండియా టీ20 వరల్డ్​ కప్​ జట్టులో చోటు ఉంటుందా? అని చాలా కాలం పాటు ఊహాగానాలు జోరుగా సాగాయి. వాటిని పక్కనపెడుతూ.. పాండ్యాను కూడా టీమ్​లోకి తీసుకున్నారు. అయితే.. హార్దిక్​ పాండ్యాని జట్టులో తీసుకోవడం అటు కెప్టెన్​ రోహిత్​ శర్మకు, ఇటు బీసీసీఐ చీఫ్​ సెలక్టర్​ అజిత్​ అగర్కర్​కి ఇష్టం లేదట! తీవ్ర ఒత్తిడి మధ్య.. 15 సభ్యుల బృందంలో హార్దిక్​ పాండ్యాని తీసుకోవాల్సి వచ్చిందట.

హార్దిక్​ వద్దని చెప్పిన రోహిత్​ శర్మ..!

ప్రముఖ వార్తా సంస్థ దైనిక్​ జాగ్రన్​ కథనం ప్రకారం.. బీసీసీఐ చీఫ్​ అజిత్​ అగర్కర్​, కెప్టెన్​ రోహిత్​ శర్మలు.. హార్దిక్​ పాండ్యాని జట్టులోకి తీసుకోవడంపై అయిష్టంగా ఉన్నారు. కానీ.. ఒత్తిడి కారణంగా పాండ్యాను తీసుకోవాల్సి వచ్చింది. మరి అది ఎలాంటి ఒత్తిడి, ఏ సందర్భంలో హార్దిక్​ని టీమిండియా టీ20 వరల్డ్​ కప్​ జట్టులోకి తీసుకోవాల్సి వచ్చిందో.. సదరు మీడియా సంస్థ చెప్పలేదు.

ఇక.. ఈ టీ20 వరల్డ్​ కప్​ తర్వాత.. రోహిత్​ శర్మ, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని నివేదిక పేర్కొంది.

ఇదీ చూడండి:- GT vs KKR IPL 2024: మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్ రేసును నుంచి గుజరాత్ ఔట్.. కోల్‍కతాకు టాప్-2 పక్కా

Hardik Pandya Rohit Sharma : టీమిండియా టీ20 వరల్డ్​ కప్​ సెలక్షన్​ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో.. 'ఫామ్​లో లేని హార్దిక్​ పాండ్యాను ఎందుకు తీసుకున్నారు?' అని రిపోర్టలు అడగ్గా.. 'మాకు వేరే ఆప్షన్​ లేదు. పాండ్యాను రిప్లేస్​ చేసే ప్లేయర్​ లేడు,' అన్నట్టు జవాబిచ్చాడు అజిత్​ అగర్కర్​.

కొనసాగుతున్న హార్దిక్​ కష్టాలు..

హార్దిక్​ పాండ్యాకు ఐపీఎల్​ 2024 కలిసి రాలేదు. రోహిత్​ శర్మ నుంచి ముంబై ఇండియన్స్​ కెప్టన్సీ బాధ్యతలు తీసుకున్న అతను మెరుగైన ప్రదర్శన చేయలేదు. టైటిల్​ ఫేవరెట్లుగా బరిలోకి దిగి..చివరికి, ప్లేఆఫ్స్​ రేసు నుంచి బయటకు వెళ్లిన తొలి జట్టుగా నిలిచింది ముంబై ఇండియన్స్​. ఇక రోహిత్​ శర్మ ఫ్యాన్స్​.. పాండ్యాను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. చాలాసార్లు హార్దిక్​ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి.

T20 World Cup 2024 : హార్దిక్​ పాండ్యా ఫామ్​ నిజంగానే దారుణంగా ఉంది. మరి టీ20 వరల్డ్​ కప్​లో టీమిండియా తరఫున ఈ ఆల్​ రౌండర్​ ఏ మేరకు ప్రదర్శన చేస్తాడో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం