Babar Azam: బాబర్ అజంకు 8 కోట్ల స్పోర్ట్స్ కారు.. మధ్యలోకి విరాట్ కోహ్లీ.. గిఫ్ట్ ఎవరిచ్చారంటే?
Babar Azam Receives Costly Car Gift: ప్రస్తుతం ఆసియా కప్ 2023 టోర్నమెంట్ ఫీవర్ వచ్చేసింది. తొలి మ్యాచ్‍లో సెంచరీతో అదరగొట్టిన పాక్ క్రికెటర్ బాబర్ అజంకు ప్రస్తుతం ట్రెండింగ్‍లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బాబర్ అంజకు కోట్ల ఖరీదు చేసే స్పోర్ట్స్ కారు గిఫ్టుగా ఇవ్వడం వైరల్ అవుతోంది.
Babar Azam Receives Audi Sports Car As Gift: ఆసియా కప్ 2023 (Asia Cup 2023) ఎట్టకేలకు ఆగస్ట్ 30న ప్రారంభమైంది. గ్రూప్ ఏ లోని పాకిస్తాన్-నేపాల్ జట్లు ముల్తాన్ వేదికగా తలపడ్డాయి. పసి కూన నేపాల్‍ను పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ తొలి మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజం చేసిన 151 పరుగులు (14 ఫోర్లు, 4 సిక్సర్స్) చేసి అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా పాకిస్థాన్ గెలుపుకు దోహదపడింది. దీంతో ఆసియా కప్‍లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్‍గా బాబర్ అజం రికార్డుకెక్కాడు.
ఆసియా కప్ 2023 తొలి మ్యాచ్‍లో సెంచరీ, రికార్డులతో బాబర్ అజం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. బాబర్ సెంచరీతో సెప్టెంబర్ 2న జరిగే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‍పై అనేక అంచనాలు, ఎక్కడాలేని ఇంట్రెస్ట్ మొదలు అయింది. ఇదిలా ఉంటే తాజాగా బాబర్ అజంకు కోట్లల్లో విలువ చేసే అత్యంత ఖరీదైనా స్పోర్ట్స్ కారు బహుమతిగా అందింది. రూ. 8.1 కోట్ల ఖరీదు గల ఆడి ఇ ట్రాన్స్ జీటీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ (Audi e-tron GT 2023) కారును బాబర్ అజంకు గిఫ్టుగా అందించి సర్‍ప్రైజ్ చేశారు అతని కుటుంబ సభ్యులు.
బాబర్ అజంకు అతని సోదరుడు ఫైసల్ అజంతోపాటు కుటుంబ సభ్యులు ఆడీ కార్ గిఫ్టుగా ఇచ్చి సంతోషపెట్టారు. నేపాల్‍తో జరిగిన మ్యాచ్‍లో బాబర్ బాగా రాణించిన కారణంగా ఈ బహుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కారు చాలా బాగుంది. నచ్చిందంటూ బాబర్ నవ్వుతూ మాట్లాడటం వీడియో చూడొచ్చు. అయితే ఈ వీడియోపై ఇండియన్ నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
భారతదేశంలో ఇదే ఆడి స్పోర్ట్స్ కారు రూ. 2 కోట్లు అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది ఆడి బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అని పాయింట్ చేసి మాట్లాడుతున్నారు. ఇలా ఇండియా-పాక్ మ్యాచ్ సమీపిస్తుండటంతో నెటిజన్ల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాబర్ అజంకు కుటుంబసభ్యులు కారు బహుమతిగా ఇస్తే.. మధ్యలోకి విరాట్ కోహ్లిని లాగి నెటిజన్స్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.