Nortje ruled out: సౌతాఫ్రికాకు షాక్.. వరల్డ్ కప్ నుంచి స్టార్ పేస్ బౌలర్ ఔట్
Nortje ruled out: సౌతాఫ్రికాకు షాక్ తగిలింది. వరల్డ్ కప్ నుంచి ఆ టీమ్ స్టార్ పేస్ బౌలర్ ఎన్రిచ్ నోక్యా ఔటయ్యాడు. గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ మెగా టోర్నీ నుంచి అతడు తప్పుకోవాల్సి వచ్చింది.
Nortje ruled out: ఇప్పటి వరకూ వరల్డ్ కప్ గెలవని సౌతాఫ్రికా టీమ్ కు ఈసారి కూడా పెద్ద షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే ఆ టీమ్ స్టార్ పేస్ బౌలర్ ఎన్రిచ్ నోక్యా గాయం కారణంగా దూరమయ్యాడు. అతనితోపాటు ఆల్ రౌండర్ సిసాండా మగాలా కూడా గాయంతో వరల్డ్ కప్ ఆడటం లేదు. ఈ విషయాన్ని గురువారం (సెప్టెంబర్ 21) సౌతాఫ్రికా టీమ్ మేనేజ్‌మెంట్ ధృవీకరించింది.
ఈ ఇద్దరూ దూరం కావడంతో వాళ్ల స్థానాల్లో సౌతాఫ్రికా టీమ్ మరో పేస్ బౌలర్ లిజాడ్ విలియమ్స్, ఆండిలె ఫెలుక్వాయోలకు జట్టులో చోటు కల్పించింది. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 7న శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ లో తలపడనుంది సౌతాఫ్రికా. కొన్నాళ్లుగా సౌతాఫ్రికా టీమ్ లో నోక్యా కీలకమైన పేస్ బౌలర్ గా ఉన్నాడు.
తన పేస్, కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ తో అతడు ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. అలాంటి బౌలర్ దూరం కావడం సఫారీలను షాక్ కు గురి చేసేదే. "ఎన్రిచ్, సిసాండా ఇద్దరూ 50 ఓవర్ల వరల్డ్ కప్ కు దూరం కావడం చాలా నిరాశ కలిగిస్తోంది" అని సౌతాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ అన్నాడు. రబాడాతో కలిసి నోక్యా పేస్ బౌలింగ్ అటాక్ సౌతాఫ్రికాకు చాలా కాలంగా మంచి బలంగా మారింది.
ఇప్పుడు నోక్యా దూరం కావడంతో వాళ్ల బలం సగానికి తగ్గినట్లయింది. పైగా ఐపీఎల్లో ఆడుతూ ఇండియా కండిషన్స్ కు అతడు బాగా అలవాటు కూడా పడ్డాడు. అలాంటి బౌలర్ లేని లోటును సౌతాఫ్రికా ఎలా పూడుస్తుందన్నది చూడాలి.
వరల్డ్ కప్ కోసం సౌతాఫ్రికా టీమ్ ఇదే
టెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఏడెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అండిలె ఫెలుక్వాయో, కగిసో రబాడా, తబ్రైజ్ షంసి, రాసీ వాండెన్ డుసెన్, లిజాడ్ విలియమ్స్