Team India 3 ka dream: తీన్ కా డ్రీమ్ హై అప్నా.. టీమిండియా వరల్డ్ కప్ జెర్సీ చూశారా.. ర్యాప్ సాంగ్ అదిరిపోయింది
Team India 3 ka dream: తీన్ కా డ్రీమ్ హై అప్నా అంటూ టీమిండియా వరల్డ్ కప్ జెర్సీ రిలీజ్ చేసింది అడిడాస్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ర్యాప్ సాంగ్ అదిరిపోయింది.
Team India 3 ka dream: తీన్ కా డ్రీమ్ (3 Ka Dream) హై అప్నా.. జో సోనె నా దే జో సప్నా అంటూ టీమిండియా ప్లేయర్స్ ఓ అద్భుతమైన ర్యాప్ సాంగ్ పాడారు. ముచ్చటగా మూడోసారి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా ఈసారి స్వదేశంలో మెగా టోర్నీ బరిలోకి దిగుతున్న ఇండియన్ టీమ్, కోట్లాది మంది అభిమానుల ఆకాంక్షలనే ఈ ర్యాప్ సాంగ్ కు ప్రేరణ.
ట్రెండింగ్ వార్తలు
ఈ సాంగ్ తోపాటు టీమిండియా వరల్డ్ కప్ 2023 జెర్సీని కూడా అడిడాస్ ఆవిష్కరించింది. ఇప్పటికే 1983, 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇండియా.. ఇప్పుడు మూడోసారి ఆ ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తోంది. 12 ఏళ్లుగా దీనికోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో తీన్ కా డ్రీమ్ (3 Ka Dream) పేరుతో మెన్ ఇన్ బ్లూతో ఓ సాంగ్ క్రియేట్ చేశారు.
3 కా డ్రీమ్ హై అప్నా..
ప్రముఖ ఇండియన్ సింగర్ రఫ్తార్ ఈ సాంగ్ పాడాడు. దీనికి టీమిండియా ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, సిరాజ్ లాంటి వాళ్లు లిప్ సింక్ చేశారు. వచ్చే నెలలో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ కోసం బుధవారమే (సెప్టెంబర్ 20) ఆంథెమ్ రిలీజ్ కాగా.. అదే రోజు ఇండియన్ టీమ్ ఆకాంక్షలను చాటుతూ ఈ ర్యాప్ సాంగ్ రిలీజ్ చేయడం విశేషం.
ఈ కొత్త వరల్డ్ కప్ జెర్సీలో భుజాలపై ఉండే మూడు తెల్లటి స్ట్రైప్స్ ను త్రివర్ణ పతాకాన్ని సూచించేలా మూడు రంగుల్లో రూపొందించడం విశేషం. ఈ కొత్త జెర్సీల్లో టీమిండియా ప్లేయర్స్ ర్యాప్ సాంగ్ పాడుతూ అభిమానుల్లో వరల్డ్ కప్ పై ఆశలను మరింత పెంచేశారు. ఈ మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఇండియా ఆడనుంది.
ఇక అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్థాన్ తో రెండో మ్యాచ్, అక్టోబర్ 14న పాకిస్థాన్ తో మూడో మ్యాచ్ ఆడుతుంది. అక్టోబర్ 19న బంగ్లాదేశ్ తో, అక్టోబర్ 22న న్యూజిలాండ్ తో ఆడనుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ తో అక్టోబర్ 29న, మాజీ ఛాంపియన్ శ్రీలంకతో నవంబర్ 2న, సౌతాఫ్రికాతో నవంబర్ 5న తలపడుతుంది. ఇక చివరి లీగ్ మ్యాచ్ ను నెదర్లాండ్స్ తో నవంబర్ 12న ఆడుతుంది.
టాపిక్