Suryakumar Yadav : ‘ఏంటీ బ్రో ఇంత పని చేశావ్’.. డకౌట్‌తో ఫ్యాన్స్‌ని నిరాశ పరిచిన సూర్యకుమార్..
MI vs DC 2024 IPL : ఐపీఎల్ 2024లో ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. ఫ్యాన్స్‌ని పూర్తిగా నిరాశపరిచాడు. కానీ దిల్లీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ధనాధన్ క్రికెట్ ఆడింది!
MI vs DC live : సూర్యకుమార్ యాదవ్ వస్తాడని, పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టు గట్టెక్కిస్తాడని భావించిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కి గట్టి షాక్ తగిలింది! గాయం నుంచి కోలుకుని, ఫిట్నెస్ సాధించి.. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బరిలో దిగిన ఈ డ్యాషింగ్ ప్లేయర్.. డకౌట్ అయ్యి అభిమానులను నిరాశపరిచాడు.
ఐపీఎల్ 2024- ముంబై వర్సెడ్ డీసీ..
ఐపీఎల్ 2024లో ఆదివారం డీసీతో తలపడింది ముంబై ఇండియన్స్. ఆ జట్టుకు ఇది నాలుగో మ్యాచ్. కాగా.. ఆడిన మొదటి మూడు మ్యాచ్‌లలో ఓడిపోయి, పాయింట్స్ టేబుల్లో చిట్టచివరి స్థానంలో నిలిచింది ముంబై. రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తొలగించడం, హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు ఇవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. రోహిత్ శర్మ.. జట్టుతో అసంతృప్తిగా ఉన్నట్టు.. వచ్చే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ని వదిలేస్తాడని టాక్ నడుస్తోంది. వీటన్నింటి మధ్య.. సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌గా ఉన్నాడన్న వార్త.. ముంబై ఫ్యాన్స్‌కి కాస్త ఊరటనిచ్చింది.
Suryakumar Yadav Mumbai Indians : చీలమండి గాయం, హెర్నియాతో బాధపడి.. మూడు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్ 2024 మొదటి మూడు మ్యాచ్‌లూ ఆడలేదు. దిల్లీతో మ్యాచ్‌కి ముందు.. అతను ఫిట్నెస్ సాధించాడు. ఫలితంగా..అభిమానులు అతనిపై కోటి ఆశలు పెట్టుకున్నారు.
కానీ సూర్యకుమార్ యాదవ్ తేలిపోయాడు! క్రీజులోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయాడు. రెండు బాల్స్ ఆడి.. ఒక్క రన్ కూడా కొట్టకుండా పెవీలియన్ చేరాడు. నార్త్జే బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
ఫలితంగా.. ట్విట్టర్లో సూర్యకుమార్ యాదవ్, డకౌట్ వంటివి ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ముంబై ప్లేయర్‌ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 'సూర్య.. ఏ జట్టుకు ఆడుతున్నావు?' అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ ధనాధన్..
Mumbai Indians IPL 2024 : సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అయినా.. ఈసారి ముంబై ఇండియన్స్ మాత్రం ధనాధన్ క్రికెట్ ఆడింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా సేన.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు చెలరేగి ఆడారు. రోహిత్ శర్మ.. 27 బంతుల్లో 49 రన్స్ చేసి.. హాఫ్ సెంచరీని జస్ట్‌లో మిస్ చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా.. 33 పరుగుల్లో 39 రన్స్ చేశాడు.
దిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్‌లో అక్షర్ పటేల్ 2 వికెట్లు, నార్త్జే 2 వికెట్లు తీశారు.
సంబంధిత కథనం