MS Dhoni At No 8: ఇప్పటివరకు బ్యాటింగ్ చేయని ఎంఎస్ ధోనీ.. అసలు కారణం చెప్పిన సీఎస్‌కే కోచ్ హస్సీ-ipl 2024 csk vs gt ms dhoni at number 8 position and batting coach mike hussey reveals reason in press meet ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni At No 8: ఇప్పటివరకు బ్యాటింగ్ చేయని ఎంఎస్ ధోనీ.. అసలు కారణం చెప్పిన సీఎస్‌కే కోచ్ హస్సీ

MS Dhoni At No 8: ఇప్పటివరకు బ్యాటింగ్ చేయని ఎంఎస్ ధోనీ.. అసలు కారణం చెప్పిన సీఎస్‌కే కోచ్ హస్సీ

Sanjiv Kumar HT Telugu
Mar 27, 2024 11:39 AM IST

MS Dhoni At No 8 In IPL 2024: టీమిడిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయలేదు. ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ 8వ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు గల కారణాలు ఏంటో కోచ్ మైక్ హస్సీ తెలిపారు.

ఇప్పటివరకు బ్యాటింగ్ చేయని ఎంఎస్ ధోనీ.. అసలు కారణం చెప్పిన సీఎస్‌కే కోచ్ హస్సీ
ఇప్పటివరకు బ్యాటింగ్ చేయని ఎంఎస్ ధోనీ.. అసలు కారణం చెప్పిన సీఎస్‌కే కోచ్ హస్సీ (PTI)

MS Dhoni At No 8 In IPL 2024: ప్రస్తుతం ఐపీఎల్ 2024 హవా నడుస్తోంది. ఈ ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచిన తర్వాత ఎంఎస్ ధోని ఒక్క బంతిని కూడా ఎదుర్కోకపోవడానికి గల కారణాన్ని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తాజాగా తెలిపారు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసిన CSK మరోసారి తన బ్యాటింగ్‌తో అదరగొట్టింది.

శివమ్ దూబే అర్ధసెంచరీ, రచిన్ రవీంద్ర 46 పరుగులతో సీఎస్‌కే విజయంలో తోడ్పడ్డారు. అయితే, డిఫెండింగ్ ఛాంపియన్‌ల కోసం మొదటి రెండు మ్యాచ్‌లలో ఒక ఆసక్తికరమైన విషయం చక్కర్లు కొడుతోంది. అదే ఎంతో మంది అభిమానుల ఆరాధ్యదైవం ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు ఒక్క బాల్ కూడా ఆడకపోవడం. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా మాజీ కెప్టెన్ ధోనీ కంటే ముందు వచ్చిన విషయం తెలిసిందే.

ఇక మంగళవారం యంగ్ క్రికెటర్ సమీర్ రిజ్వీ తన తొలి రెండు బంతులకు సిక్సర్స్ బాది చివరి ఓవర్ మూడో బాల్‌కు ఔట్ అయ్యాడు. అతని తర్వాత అంతా మహేంద్ర సింగ్ ధోనీ వస్తాడని భావించారు. మూడు బంతులు ధోని బ్యాటింగ్ చూడాలనుకునేవారికి సరిపోకపోయినా.. ఈ మాజీ కెప్టెన్ వాటిలో ఏదోనా మ్యాజిక్ చేస్తాడని ఆశపడ్డారు. కానీ, అలాంటిదేం జరగలేదు. సమీర్ తర్వాత ఏడో స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు.

అయితే, ఎంఎస్ ధోనీ 8వ స్థానంలో ఉండటానికి గల కారణాలను తాజాగా సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ వివరించారు. ఇంపాక్ట్ రూల్ జట్ల కోసం బ్యాటింగ్ ఆర్డర్‌ను పొడిగించిందని, అందుకే ధోనీ ఆఖరులో వస్తున్నాడను తెలిపారు. ఇప్పటికీ ఒక్క బంతిని కూడా ఎదుర్కోని ధోనీ మంచి బ్యాటింగ్ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడని పేర్కొన్నారు మైక్ హస్సీ.

"గేమ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఫ్లెమింగ్ నుంచి వచ్చిన ఆదేశం. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రావడంతో మాకు ఒక అదనపు బ్యాటర్‌తోపాటు బౌలర్‌ని పొందగలిగాం. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ పొడిగిస్తూనే ఉన్నాం. నెం. 8లో ఎంఎస్ ధోనీని ఉంచాం. ఇది చాలా క్రేజీ విషయమే. ఎందుకంటే ఎప్పటిలానే ధోనీ బ్యాటింగ్ మూమెంట్ ఎంతో బాగుంది" అని సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ వివరించారు. అలాగే, బ్యాటర్లు వేగంగా ఆడాలని, గేమ్‌ను ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్లు హస్సీ పేర్కొన్నారు.

ఒకవేళ విఫలమైతే విమర్శించమని కూడా ఆటగాళ్లకు చెప్పినట్లు సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ హస్సీ తెలిపారు. "మేము చాలా లోతైన రిసోర్స్ కలిగి ఉన్నాం. కాబట్టి, ఆటగాళ్లు రెండు ఆలోచనలతో ఉన్నట్లయితే, వారు సానుకూల మార్గాన్ని అనుసరిస్తారని అర్థం. అలాగే ఆటను వీలైనంత ముందుకు తీసుకెళ్లడానికి కోచ్‌లు, కెప్టెన్ నుంచి వారికి కచ్చితంగా మద్దతు లభిస్తుంది. ఒకవేళ ఆట నుంచి ఔట్ అయిన పర్వాలేదు. దాని గురించి మేము వారిపై ఎలాంటి విమర్శలు చేయం. ఆటను వేగంగా ఆడటం గురించే ఫ్లేమింగ్ చెబుతుంటాడు" అని హస్సీ అన్నారు.

ఇదిలా ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మార్చి 31న (ఆదివారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ వైజాగ్‌లో జరగనుండగా.. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అదే రోజున సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరబాద్ మ్యాచ్ జరగనుంది.

IPL_Entry_Point