India vs England 2nd Test Toss: టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్.. మూడు మార్పులతో బరిలోకి.. జడేజా స్థానంలో ఎవరంటే?-india vs england 2nd test toss rohit sharma elected to bat first three changes rajat patidar makes debut ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs England 2nd Test Toss: టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్.. మూడు మార్పులతో బరిలోకి.. జడేజా స్థానంలో ఎవరంటే?

India vs England 2nd Test Toss: టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్.. మూడు మార్పులతో బరిలోకి.. జడేజా స్థానంలో ఎవరంటే?

Hari Prasad S HT Telugu
Feb 02, 2024 09:16 AM IST

India vs England 2nd Test Toss: ఇంగ్లండ్ తో విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది.

టాస్ గెలుచుకున్న రోహిత్ శర్మ
టాస్ గెలుచుకున్న రోహిత్ శర్మ

India vs England 2nd Test Toss: ఇంగ్లండ్ చేతుల్లో తొలి టెస్టులో ఓడిన టీమిండియాకు రెండో టెస్టు టాస్ కలిసి వచ్చింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విశాఖపట్నంలో ఈ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ కీలకమైన టెస్టుకు మూడు మార్పులతో ఇండియా బరిలోకి దిగుతోంది. జడేజా, రాహుల్ గాయాలతో దూరం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రెండు మార్పులు చేయాల్సి వచ్చింది.

రెండో టెస్టుకు టీమిండియా ఇదే

రెండో టెస్టుకు ఇండియన్ టీమ్ మూడు మార్పులు చేసింది. తొలి టెస్ట్ ఆడిన జడేజా, రాహుల్, సిరాజ్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. జడేజా, రాహుల్ గాయాలతో దూరం కాగా.. సిరాజ్ ను పక్కన పెట్టారు. జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్, రాహుల్ స్థానంలో రజత్ పటీదార్, సిరాజ్ స్థానంలో ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చారు. రెండో టెస్టుకు కూడా ఇద్దరు పేస్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని ఇండియా నిర్ణయించింది.

రజత్ పటీదార్ టెస్ట్ అరంగేట్రం చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత నేషనల్ టీమ్ పిలుపు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్ కు తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు. తొలి టెస్టులో పేస్ బౌలర్ సిరాజ్ ను పెద్దగా ఉపయోగించుకోలేదు. అయినా ఈ మ్యాచ్ కు అతన్ని పక్కన పెట్టి మరో పేస్ బౌలర్ ను తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. సిరాజ్ స్థానంలో మరో బ్యాటర్ లేదా వాషింగ్టన్ సుందర్ రూపంలో మరో ఆల్ రౌండర్ ను తీసుకుంటే బాగుండేది.

టీమిండియా తుది జట్టు ఇదే

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రజత్ పటీదార్, కేఎస్ భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్, బుమ్రా, ముకేశ్ కుమార్

ఇంగ్లండ్ టీమ్ ఇదే

ఇక ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ఒక రోజు ముందే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. సీనియర్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. ఇక సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో షోయబ్ బషీర్ తొలి టెస్ట్ ఆడబోతున్నాడు.

ఇంగ్లండ్ టీమ్ ఇదే

జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, ఓలీ పోప్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, రేహాన్ అహ్మద్, టామ్ హార్ట్‌లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్

Whats_app_banner