Jasprit Bumrah: విరాట్ కోహ్లీ అభిమానులకి కోపం తెప్పించిన జస్‌ప్రీత్ బుమ్రా.. తొలి టెస్టు ముంగిట రగడ-india fast bowler jasprit bumrah reveals fittest cricketer in team india dressing room ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Jasprit Bumrah: విరాట్ కోహ్లీ అభిమానులకి కోపం తెప్పించిన జస్‌ప్రీత్ బుమ్రా.. తొలి టెస్టు ముంగిట రగడ

Jasprit Bumrah: విరాట్ కోహ్లీ అభిమానులకి కోపం తెప్పించిన జస్‌ప్రీత్ బుమ్రా.. తొలి టెస్టు ముంగిట రగడ

Galeti Rajendra HT Telugu
Sep 14, 2024 06:27 PM IST

Virat Kohli Fans: మైదానంలో బ్యాటర్లు ఊహించని విధంగా యార్కర్లు సంధించే జస్‌ప్రీత్ బుమ్రా.. మైదానం వెలుపల కూడా అభిమానుల ఊహకి అందని విధంగా ప్రశ్నలకి సమాధానం చెప్తుంటాడు. అయితే ఈసారి అతని సమాధానం కోహ్లీ అభిమానులకి కోపం తెప్పించింది.

జస్‌ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ
జస్‌ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ

Fittest Cricketer in Indian Dressing Room: అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం మెరుగైన ఫిట్‌నెస్ ఉన్న క్రికెటర్ ఎవరు? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మొదట వచ్చే సమాధానం విరాట్ కోహ్లీ. మైదానంలో బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ ఆధిపత్యం చెలాయించే విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా ఫిట్‌నెస్‌లో బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేశాడు.

కానీ టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం విరాట్ కోహ్లీ కంటే నేను ఫిట్టెస్ట్ క్రికెటర్ అని కామెంట్ పాస్ చేశాడు. దాంతో కోహ్లీ అభిమానులు ఓ రేంజ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాని టార్గెట్ చేసి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా ప్రస్తుతం చెన్నైలోనే ఉన్నారు.

కోహ్లీ పేరు చెప్తాడనుకుంటే.. ట్విస్ట్

భారత్, బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబరు 19 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. తొలి టెస్టుకి చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా.. భారత టెస్టు జట్టులోని ఆటగాళ్లు ఇప్పటికే అక్కడికి శుక్రవారం నుంచి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన జస్‌ప్రీత్ బుమ్రాని.. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఫిట్టెస్ట్ క్రికెటర్ ఎవరు? అని అభిమాని అడిగారు. దాంతో విరాట్ కోహ్లీ పేరుని జస్‌ప్రీత్ బుమ్రా చెప్తాడని అంతా ఊహించారు. కానీ.. ఎవరూ ఊహించనిరీతిలో జస్‌ప్రీత్ బుమ్రా తన పేరుని చెప్పుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘‘ఫిట్టెస్ట్ క్రికెటర్‌ గురించి మీరు ఆశిస్తున్న సమాధానం నాకు తెలుసు. కానీ నేను నా పేరే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఫాస్ట్ బౌలర్‌ని. సుదీర్ఘకాలంగా భారత్ జట్టుకి ఆడుతున్నాను. దేశం తరఫున ఫాస్ట్ బౌలర్ సుదీర్ఘకాలం ఆడాలంటే ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. కాబట్టి ఒక ఫాస్ట్ బౌలర్‌ నా పేరు చెప్తున్నా’’ అని జస్‌ప్రీత్ బుమ్రా సమాధానమిచ్చాడు.

జస్‌ప్రీత్ బుమ్రా ఇచ్చిన సమాధానంపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం జస్‌ప్రీత్ బుమ్రాని విరాట్ కోహ్లీ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. జస్‌ప్రీత్ బుమ్రాకి అహంకారం పెరిగిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

చాలా రోజుల తర్వాత బుమ్రా రీఎంట్రీ

జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని భారత్ గెలవడంలో విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ మెగా టోర్నీ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రాకి భారత సెలెక్టర్లు రెస్ట్ ఇవ్వగా.. విరాట్ కోహ్లీ కూడా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఇటీవల శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కి ఎంపికైన భారత క్రికెటర్లతో కలిసి ఈ ఇద్దరూ కూడా చెన్నైకి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో విరాట్ కోహ్లీ దాదాపు 45 నిమిషాల పాటు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ నెట్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. విరాట్ కోహ్లీకి బంతులు విసిరాడు.

కోహ్లీ, బుమ్రా మ్యాచ్ రికార్డులిలా

2008 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్న విరాట్ కోహ్లీ 35 ఏళ్ల వయసులోనూ మైదానంలో కుర్రాళ్లకి ఫీల్డింగ్‌లో గట్టి పోటీనిస్తుంటాడు. 113 టెస్టులు, 295 వన్డేలు, 125 టీ20 మ్యాచ్‌లతో పాటు ఈ సుదీర్ఘ కెరీర్‌లో 252 ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా విరాట్ కోహ్లీ ఆడాడు.

2016 నుంచి టీమిండియాకి ఆడుతున్న 30 ఏళ్ల జస్‌ప్రీత్ బుమ్రా.. ఫిట్‌గా కనిపిస్తున్నప్పటికీ అతడ్ని వెన్నుగాయం చాలా రోజులు వెంటాడింది. ఇప్పటికీ పాత గాయాల కారణంగా ఫీల్డింగ్‌లో డైవ్ చేయడానికి బుమ్రా సాహసించడు. 36 టెస్టులు, 89 వన్డేలు, 70 టీ20లను భారత్ తరఫున బుమ్రా ఆడాడు.