Women’s T20 World Cup India Matches: మహిళల టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్ ఇదే.. పాక్‍తో పోరు ఎప్పుడంటే..-india matches dates and time schedule in womens t20 world cup 2024 ind vs pak fixture ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Women’s T20 World Cup India Matches: మహిళల టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్ ఇదే.. పాక్‍తో పోరు ఎప్పుడంటే..

Women’s T20 World Cup India Matches: మహిళల టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్ ఇదే.. పాక్‍తో పోరు ఎప్పుడంటే..

Aug 26, 2024, 10:45 PM IST Chatakonda Krishna Prakash
Aug 26, 2024, 10:35 PM , IST

  • Women’s T20 World Cup India Matches: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ పూర్తి షెడ్యూల్‍ను ఐసీసీ వెల్లడించింది. అక్టోబర్ 3న ఈ టోర్నీ మొదలుకానుంది. ఈ మెగాటోర్నీలో టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్ ఇక్కడ చూడండి.

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ వేదిక బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారింది. ఈ టోర్నీ పూర్తి షెడ్యుల్‍ను ఐసీసీ నేడు (ఆగస్టు 26) వెల్లడించింది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ టోర్నీ సాగనుంది. 10 దేశాల మహిళల జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో టీమిండియా ఆడనున్న వామప్ మ్యాచ్‍లు, నాలుగు గ్రూప్ మ్యాచ్‍ షెడ్యూల్ ఇదే. 

(1 / 7)

టీ20 ప్రపంచకప్‍‍కు సన్నాహకంగా తొలి వామప్ మ్యాచ్‍లో సెప్టెంబర్ 29న వెస్టిండీస్‍తో భారత మహిళల జట్టు తలపడనుంది. దుబాయ్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ షురూ కానుంది. రెండో వామప్ మ్యాచ్‍లో అక్టోబర్ 1న దక్షిణాఫ్రికాతో టీమిండియా పోటీ పడనుంది. 

(2 / 7)

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో అక్టోబర్ 4న అసలు పోరును భారత్ మొదలుపెట్టనుంది. అక్టోబర్ 4న గ్రూప్-ఏ మ్యాచ్‍లో న్యూజిలాండ్‍తో టీమిండియా తలపడనుంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.

(3 / 7)

మహిళల టీ20 ప్రపంచకప్‍లో భారత్, పాకిస్థాన్ మధ్య సమరం అక్టోబర్ 6వ తేదీన జరగనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలుకానుంది. 

(4 / 7)

భారత్, శ్రీలంక మధ్య గ్రూప్ దశ మ్యాచ్ అక్టోబర్ 9వ తేదీన దుబాయి వేదికగా జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. 

(5 / 7)

టీ20 ప్రపంచకప్‍లో అక్టోబర్ 13వ తేదీన ఆస్ట్రేలియాతో గ్రూప్ దశ మ్యాచ్‍లో భారత్ తలపడనుంది. షార్జా వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 

(6 / 7)

భారత్ తన మూడు గ్రూప్ దశ మ్యాచ్‍లను దుబాయ్‍లో, ఓ మ్యాచ్‍ను షార్జాలో ఆడనుంది. మహిళ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‍లు అక్టోబర్ 17, అక్టోబర్ 18 తేదీల్లో జరగనున్నాయి. అక్టోబర్ 20న దుబాయ్‍లో ఫైనల్ జరగనుంది. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు