IND vs SL 2nd ODI Predicted XI: పంత్ మళ్లీ పక్కనే.. సిరాజ్ ఉంటాడా! శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా ఇలా..
IND vs SL 2nd ODI Predicted Final XI: శ్రీలంకతో రెండో వన్డేకు టీమిండియా రెడీ అయింది. తొలి మ్యాచ్ టై అవడంతో ఈ రెండో పోరు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‍లో భారత తుది జట్టు ఎలా ఉండొచ్చంటే..
భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే అనూహ్యంగా టై అయింది. మలుపుల మధ్య సాగిన ఈ పోరులో చివరికి సమమైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ 0-0గానే ఉంది. దీంతో రెండో మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో రేపు (ఆగస్టు 4) రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‍లో భారత తుదిజట్టు ఎలా ఉండొచ్చు.. లైవ్ ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
పంత్‍కు నో ఛాన్స్
రెండో వన్డేలోనూ భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్‍కే పరిమితం కానున్నాడు. వన్డేల్లో కేఎల్ రాహుల్‍నే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా టీమిండియా మేనేజ్‍మెంట్ డిసైడ్ అయింది. తొలి వన్డేలో 31 పరుగులతో రాహుల్ పర్వాలేదనిపించాడు. రెండో వన్డేలోనూ తుది జట్టులో రాహులే ఉండనున్నాడు. దీంతో పంత్ పక్కనే ఉంటాడు.
సిరాజ్ ఉంటాడా!
లంక పర్యటనలో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ మూడు టీ20ల సిరీస్ మొత్తం ఆడాడు. తొలి వన్డేలోనూ బరిలోకి దిగాడు. దీంతో అతడికి టీమిండియా మేనేజ్‍మెంట్ బ్రేక్ ఇస్తుందా అనేది చూడాలి. ఒకవేళ సిరాజ్‍కు రెస్ట్ ఇవ్వాలనుకుంటే హర్షిత్ రాణాకు అవకాశం దక్కొచ్చు. ఒకవేళ అర్షదీప్ సింగ్‍ను పక్కనపెట్టాలనుకుంటే ఖలీల్ అహ్మద్‍కు ఛాన్స్ రావొచ్చు. టీమిండియా మేనేజ్‍మెంట్ ఎలా ఆలోచిస్తుందో చూడాలి.
శ్రీలంక తుదిజట్టులో మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. టీ20 సిరీస్‍లో మూడు మ్యాచ్‍ల్లో ఆఖర్లో కుప్పకూలిన ఆ జట్టు.. తొలి వన్డేలో చివర్లోనే కుదురుగా ఆడింది. అయితే, షిరాజ్ ప్లేస్‍లో మహీశ్ తీక్షణను రెండో వన్డేకు పరిశీలించే ఛాన్స్ లేకపోలేదు.
లంకతో రెండో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్/హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్
శ్రీలంక తుదిజట్టు (అంచనా): పాతుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక (కెప్టెన్), జనిత్ లియనాగే, దునిత్ వెల్లలాగే, వనిందు హసరంగ, అఖిల దనుంజయ, మహమ్మద్ షిరాజ్/ మహీశ్ తీక్షణ, అషిత ఫెర్నాండో
టైమ్, లైవ్ స్ట్రీమింగ్
భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే రేపు (ఆగస్టు 4) మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇందుకు అర గంట ముందు టాస్ పడుతుంది. ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో ప్రసారం అవుతుంది. డిజిటల్ విషయానికి వస్తే.. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు.
వర్షం ప్రభావం
ఇండియా, లంక మధ్య రెండో వన్డే జరిగే కొలంబో ప్రేమదాస మైదానం వద్ద రేపు స్పల్వంగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఆటకు కాస్త ఆటంకాలు ఏర్పడే ఛాన్సులు ఉన్నాయి. అయితే, రద్దయ్యేంత తీవ్రంగా వాన ఉండదు.
ఈ రెండో వన్డేలోనూ ప్రేమదాస స్టేడియం పిచ్ ఎక్కువగా స్పిన్ బౌలింగ్‍కే అనుకూలించనుంది. తొలి వన్డే పరిస్థితే ఉండనుంది. దీంతో లో స్కోరింగ్ గేమ్‍గానే ఉండే అవకాశం ఉంది.