Hardik Pandya : భార్యతో విడాకుల రూమర్స్ మధ్య.. విదేశాల్లో హార్దిక్ వెకేషన్!
భార్య నటాషాతో విడాకుల రూమర్స్ మధ్య పాండ్య గత కొన్ని రోజులగా మీడియా ముందు కనిపించడం లేదు. హార్దిక్ పాండ్య ఎక్కడున్నాడు? అన్న ప్రశ్నపై తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.
Hardik Pandya and Natasa news : భార్య నటాషాతో విడాకుల రూమర్స్ మధ్య టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ వార్తల్లో నిలిచాడు. మరోవైపు.. 2024 టీ20 వరల్డ్ కప్ కోసం వెళ్లిన టీమిండియా జట్టులో అతను చేరలేదు. మరి హార్దిక్ పాండ్య ఎక్కడ ఉన్నడు? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై క్రిక్‌బజ్ ఒక రిపోర్టు విడుదల చేసింది. హార్దిక్ పాండ్య.. వెకేషన్లో ఉన్నట్టు తెలిపింది.
వెకేషన్లో హార్దిక్ పాండ్య..
హార్దిక్ పాండ్యకు 2024 కలిసి రావడం లేదు! ముంబై ఇండియన్ కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఐపీఎల్ 2024లో ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్ శర్మ నుంచి పగ్గాలు తీసుకున్న పాండ్యపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఎగతాళి చేశారు. వీటన్నింటి మధ్య.. ముంబై ఇండియన్స్ లీగ్ స్టేజ్‌లోనే బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాతే.. హార్దిక్ పాండ్య వ్యక్తిగత జీవితంపై ఫోకస్ పెరిగింది. భార్య నటాషా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్ పాండ్య ఫొటోలను తొలగించింది. ఇద్దరు విడాకులు తీసుకోవడం దాదాపు ఖాయం అని, భరణం కింద.. నటాషాకు పాండ్య ఆస్తిలో 70శాతం లభిస్తుందని వార్తలు గుప్పుమన్నాయి.
ఇదిలా ఉండగా.. టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టు సభ్యుల్లో చాలా మంది న్యూయార్క్ చేరుకున్నారు. సంజూ సమ్సన్, యశస్వీ జైస్వల్, చాహల్, ఆవేశ్ ఖాన్త విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యలు మాత్రం ఇంకా వెళ్లలేదు. వ్యక్తిగత కారణాల వల్ల బీసీసీఐ అనుమతి తీసుకుని, టీమ్‌లో ఆలస్యంగా చేరుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇక భార్యతో విడాకుల రూమర్స్ మధ్య.. హార్దిక్ పాండ్య ఇంకా బయట కనిపించలేదు. ప్రస్తుతం.. విదేశాల్లో, ఎవరికి తెలియని ప్రదేశంలో వెకేషన్లో ఉన్నట్టు క్రిక్‌బజ్ నివేదిక చెప్పింది.
Hardik Pandya and Natasa divorce : మరి హార్దిక్ పాండ్య న్యూయార్క్‌కు వెళ్లి టీమిండియా జట్టుతో ఎప్పుడు కలుస్తాడు? అన్న దానిపై స్పష్టత రాలేదు. అయితే.. టీమిండియా మొదటి ప్రాక్టీస్ సెషన్ కల్లా అతను జట్టులో చేరతాడని టాక్ నడుస్తోంది.
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా..
2007లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా.. ఆ తర్వాత ట్రోఫీని దక్కించుకోలేదు. ఈసారి.. యూఎస్ఏ, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా జూన్ 9న పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఎలాగైనా గెలవాలని ఆశిస్తున్నారు. ఇక టీ20 వరల్డ్ కప్‌కి ముందు.. బంగ్లాదేశ్‌తో జూన్ 1న న్యూయార్క్‌లో వార్మప్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా.
Hardik Pandya and Natasa : ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏలో భాగంగా లీగ్ స్టేజ్‌లో టీమిండియా ఆడబోయే మ్యాచ్ ల వివరాలు, భారత కాలమానం ప్రకారం మ్యాచ్ జరిగే సమయాలు ఇక్కడ చూడొచ్చు.
ఇండియా వెర్సెస్ ఐర్లాండ్ - జూన్ 5 రాత్రి 8 గంటలకు.. ( న్యూయార్క్)
ఇండియా వెర్సెస్ పాకిస్థాన్ - జూన్ 9 రాత్రి 8 గంటలకు (న్యూయార్క్)
ఇండియా వెర్సెస్ యూఎస్ఏ - జూన్ 12 రాత్రి 8 గంటలకు (న్యూయార్క్)
ఇండియా వెర్సెస్ కెనడా - జూన్ 15 రాత్రి 8 గంటలకు (లాండర్‌హిల్)
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం