Gautam Gambhir Salary: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ జీతం ఎంతో తెలుసా? రాహుల్ ద్రవిడ్ కంటే ఎక్కువ? తక్కువ?
Gautam Gambhir Salary As Head Coach: టీమిండియా హోడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్‌కు ఏడాదికి వచ్చే జీతం ప్రస్తుతం ఆశ్చర్యకరంగా మారింది.
Gautam Gambhir Salary As Head Coach: టీమిండియా కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ కార్యదర్శి జై షా మంగళవారం (జూలై 9) ప్రకటించారు. శ్రీలంకతో వైట్ బాల్ సిరీస్‌కు ముందు రాహుల్ ద్రావిడ్ స్థానంలో రెండు సార్లు ఐసీసీ వరల్డ్ కప్ విజేత అయిన గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. మాజీ హెడ్ కోచ్ ద్రావిడ్ తన పదవి కాలం పొడిగింపును తిరస్కరించిన విషయం తెలిసిందే.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 రోహిత్ శర్మ నేతృత్వంలోని టీం ఇండియాకు రాహుల్ ద్రవిడ్ చివరిగా గైడెన్స్ ఇచ్చారు. హైప్రొఫైల్ ఉద్యోగాన్ని వదిలేసి ద్రవిడ్ టీమిండియాను పొట్టి ఫార్మాట్‌లో రెండోసారి ప్రపంచకప్ విజేతగా నిలిపాడు. ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ ఈవెంట్‌లో సుదీర్ఘకాలంగా ఉన్న ట్రోఫీ కరువుకు తెరదించింది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో విజయవంతమైన సీజన్‌ను కొనసాగించిన తర్వాత కోచింగ్ బాధ్యతలు చేపట్టడానికి గంభీర్ అందరికి ఫేవరెట్‌గా మారాడు.
ప్రస్తుతం టీమిండియా జింబాబ్వోతే టీ20 సిరీస్ ఆడుతోంది. అనంతరం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. శ్రీలంకతో జూలై 27 నుంచి మొదలు కానున్న టీ20 సిరీస్‌తోనే భారత హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్‌కు ఏడాదికి, నెలసరి జీతం వివరాలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, గంభీర్ శాలరీ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
మాజీ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రవిడ్ సంవత్సరానికి సుమారు రూ. 12 కోట్ల జీతం తీసుకునేవారట. అంటే నెలకు కోటి రూపాయల చొప్పున జీతం వచ్చేది. ఇప్పుడు గౌతమ్ గంభీర్ దానికంటే ఎక్కువ ప్యాకేజ్‌ను డిమాండ్ చేశారని టాక్. దానికి బీసీసీఐ సైతం ఒప్పుకుందని ప్రచారం సాగుతోంది. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్‌గా గంభీర్ సుమారు రూ. 25 కోట్లు తీసుకున్నారనే టాక్ నడిచింది.
మెంటర్‌గానే కాకుండా గౌతీ పలు బిజినెస్‌ల్లో బాగా సంపాదిస్తారు. అయితే, టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడితే 11 నెలలపాటు భారత్ టీమ్‌తోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి, తనకు ఉన్న వ్యాపారాలకు సంబంధించి అన్నింటిని పక్కన పెట్టి కోచ్‌గా రావాలంటే తన కమిట్‌మెంట్స్‌కు తగ్గకుండా జీతం ఇవ్వాల్సిందిగా గంభీర్ చెప్పారట. అందుకే ఆ శాలరీని ఒప్పుకునేందుకే బీసీసీఐ ఇన్నాళ్లు ఆలోచించిందని ప్రచారం సాగుతోంది.
కానీ, మరోవైపు గంభీర్ జీతం రాహుల్ ద్రావిడ్‌తో సమానంగా ఉంటుందని, గంభీర్ బీసీసీఐతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే, కోచింగ్ పదవి చేపట్టిన తర్వాత గంభీర్ కాంట్రాక్ట్‌ను అపెక్స్ క్రికెట్ బోర్డు ఇంకా ఖరారు చేయలేదు. గంభీర్‌కు జాతీయ జట్టుకు కోచింగ్ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదని బీసీసీఐ తెలిపినట్లు సమాచారం. రవిశాస్త్రి మాదిరిగానే గౌతమ్ బాధ్యతలు చేపట్టనున్నాడని సమాచారం.
"గౌతమ్ బాధ్యతలు చేపట్టడం చాలా ముఖ్యం. కాబట్టి జీతం, ఇతర విషయాలు తర్వాత చూసుకోవచ్చు. 2014లో హెడ్ కోచ్ డంకన్ ఫ్లెచర్ స్థానంలో రవిశాస్త్రిని తొలిసారి క్రికెట్ డైరెక్టర్‌గా నియమించారు. రవి జాయిన్ అయిన రోజు ఆయనకు కాంట్రాక్ట్ కూడా లేదు. గౌతమ్ విషయంలోనూ ఇలాగే కొన్ని కీలక విషయాలు సేకరిస్తున్నారు. రాహుల్ ద్రావిడ్‌తో సమానంగా జీతం ఉంటుంది" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.