సనా జావేద్‍ను చూసి సానియా మీర్జా అంటూ అరిచిన ప్రేక్షకులు: వీడియో వైరల్-crowd chants sania mirza at sana javed during psl 2024 match shoaib malik ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  సనా జావేద్‍ను చూసి సానియా మీర్జా అంటూ అరిచిన ప్రేక్షకులు: వీడియో వైరల్

సనా జావేద్‍ను చూసి సానియా మీర్జా అంటూ అరిచిన ప్రేక్షకులు: వీడియో వైరల్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 20, 2024 08:34 PM IST

Sania Mirza - Shoaib Malik: షోయబ్ మాలిక్ ప్రస్తుత భార్య సనా జావేద్‍ను చూసి ప్రేక్షకులు సానియా మీర్జా అని అరిచారు. పీఎస్ఎల్ మ్యాచ్ సందర్భంగా ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

సనా జావెద్ (Photo: X)
సనా జావెద్ (Photo: X)

Shoaib Malik: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నారు. చాలాకాలం వేర్వేరుగా ఉన్న వారు ఎట్టకేలకు డైవర్స్ తీసుకున్నారు. పాకిస్థాన్ నటి సనా జావేద్‍ను షోయబ్ మాలిక్ వివాహం కూడా చేసుకున్నాడు. గత నెలే వీరి పెళ్లి జరిగింది. కాగా, షోయబ్ మాలిక్ ప్రస్తుతం పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (PSL)లో అడుతున్నాడు. ఈ సందర్భంగా ఓ మ్యాచ్‍కు వచ్చారు మాలిక్ ప్రస్తుత భార్య సనా జావేద్.

పీఎస్ఎల్‍లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న తన భర్త షోయబ్ మాలిక్‍కు మద్దతుగా ముల్తాన్ స్టేడియానికి వచ్చారు సనా జావేద్. ఈ సందర్భంగా స్టాండ్స్‌లో ఉన్న కొందరు ప్రేక్షకులు.. సనాకు వినిపించేలా సానియా మీర్జా.. సానియా మీర్జా అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆమె తిరిగి చూశారు. అయినా కూడా వారు అలాగే అరిచారు. పక్కనే ఉన్న ఓ వ్యక్తితో సనా మాట్లాడిన తర్వాత కూడా అలాగే కేకలు వేశారు.

సనా జావేద్ వద్ద సానియా మీర్జా అంటూ ప్రేక్షకులు అరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

నెటిజన్ల రియాక్షన్ ఇదే..

సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతుండటంతో కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ సనా జావేద్‍ను సమర్థిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంత విమర్శలు వస్తున్నా.. సనా జావేద్ బయటికి రావడం బాగా అనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత విషయాల గురించి ప్రేక్షకులు ఇలా చేయడం సరికాదని మరికొందరు అంటున్నారు. ఆమెకు ఇబ్బంది కలిగించేలా కేకలు వేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.

“ఇలా చేయడం సిగ్గుచేటు. ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. తమకు ఏం చేస్తే మంచి జరుగుతుందో ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది” అని ఓ యూజర్ ట్వీట్ చేశారు. సనా జావేద్‍కు మద్దతుగా నిలిచారు.

షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి

తాను సనా జావేద్‍ను వివాహం చేసుకున్నానని ఈ ఏడాది జనవరి 20వ తేదీన షోయబ్ మాలిక్ ప్రకటించాడు. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మాలిక్ - సానియా విడిపోయారని రూమర్స్ వస్తున్న తరుణంలోనే అతడు ఈ వివాహం చేసుకున్నాడు. మాలిక్‍కు ఇది మూడో పెళ్లిగా ఉంది.

మాలిక్, సనా జావేద్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. మాలిక్‍కు సోషల్ మీడియాలో ఆమె పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో పుకార్లకు బలం చేకూరింది. ఓ యాడ్ షూట్‍లో కలిసి వీరిద్దరూ.. ఆ తర్వాత లవ్‍లో పడ్డారని టాక్ వచ్చింది. ఈ సంబంధం వల్లే మాలిక్, సానియా మధ్య విబేధాలు వచ్చాయని కూడా తెలుస్తోంది. ఇంతలోనే గత నెల సనా జావెద్‍ను మాలిక్ పెళ్లి చేసుకున్నాడు.

విడాకులు ఇచ్చేసిన సానియా

షోయబ్ మాలిక్‍కు సానియా మీర్జా కొన్ని నెలల క్రితమే విడాకులు ఇచ్చారని గత నెల మీరా కుటుంబ సభ్యులు వెల్లడించారు. సానియా ప్రైవసీని గౌరవించాలని కోరారు. సానియానే మాలిక్‍కు ఖులా ఇచ్చేశారని ఆమె తండ్రి కూడా చెప్పారు.

WhatsApp channel