Indian Cricketer: ఒకే మ్యాచ్‌లో వరుసగా 21 మెయిడిన్ ఓవర్లు - యాభై ఏళ్లయిన బ్రేక్ కానీ ఇండియన్ స్పిన్నర్ రికార్డ్!
Indian Cricketer: టెస్టుల్లో వరుసగా 21 మెయిడిన్ ఓవర్లు వేసిన రికార్డ్ టీమిండియా క్రికెటర్ బాపు నందకర్ణి పేరిట ఉంది. 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ఒక్క పరుగు ఇవ్వకుండా 131 బాల్స్ వేశాడు బాపు నందకర్ణి. యాభై ఏళ్లయిన అతడి రికార్డ్‌ను ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
Indian Cricketer: ఓ మ్యాచ్‌లో వరుసగా ఒకటి , రెండు మెయిడిన్ ఓవర్లు వేయడమే కష్టం. కానీ ఇండియన్ స్నిన్నర్ బాపు నందకర్ణి ఏకంగా 21 మెయిడిన్ ఓవర్లు వేశాడు. అది ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో... యాభై ఏళ్లయిన ఈ ఇండియన్ స్పిన్నర్ రికార్డ్‌ను ఇప్పటివరకు ఏ బౌలర్ బ్రేక్ చేయలేకపోయాడు.
32 ఓవర్లు వేసి ఐదు పరుగులు...
1964లో జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బాపు నందకర్ణి ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 32 ఓవర్లు వేసిన బాపు కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అందులో ఇరవై ఏడు మెయిడిన్లు ఉండటం గమనార్హం. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఈ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్‌లో బాపు నందకర్ణి ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడి ఏకానమీ రేటు 0.15 కావడం గమనార్హం. 21.5 ఓవర్ల తర్వాత (131 బాల్స్ అనంతరం) బాపు బౌలింగ్‌లో తొలి పరుగును ఇంగ్లండ్ బౌలర్లు సాధించారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఆరు ఓవర్లు వేసి ఆరు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈ టెస్ట్‌లో ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 457, సెకండ్ ఇన్నింగ్స్‌లో 152 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 317, సెకండ్ ఇన్నింగ్స్‌లో 214 పరుగులు చేసింది. భారత్ విజయం దిశగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు పట్టుదలతో క్రీజులో పాతుకుపోయి డ్రాగా ముగించారు.
ఏకైక...తొలి బౌలర్...
ఓ టెస్ట్‌లో వరుసగా అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి, ఏకైక ఇండియన్ బౌలర్‌గా బాపు నందకర్ణి నిలిచాడు. ఇండియా తరఫున అతి తక్కువ ఎకానమీ రేటుతో బౌలింగ్ చేసిన స్పిన్నర్‌గా బాపు పేరిట రికార్డ్ ఉంది. కెరీర్‌లో 41 టెస్ట్‌లు ఆడిన బాపు నందకర్ణి రెండు ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు.
బాపు నందకర్ణి అసలు పేరు రమేష్ చంద్ర గంగరాం నందకర్ణి. ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న అతడు ఇంగ్లండ్ సిరీస్‌లో సెంచరీ సాధించాడు. మొత్తం 41 టెస్ట్‌లు ఆడిన నందకర్తి 1414 పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు ఏడు హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 88 వికెట్లు తీశాడు నందకర్ణి. పది వికెట్ల ప్రదర్శన ఒకసారి, ఐదు వికెట్లను నాలుగు సార్లు తీశాడు. టెస్ట్ స్పెషలిస్ట్‌గా ముద్రపడిన అతడికి వన్డేల్లో మాత్రం ఒక్క అవకాశం రాలేదు.
500 వికెట్లు...
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 8880 పరుగులతో పాటు ఐదు వందల వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా పేరుతెచ్చుకున్నాడు. టీమిండియా చాలా రోజుల పాటు అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశాడు. అంతే కాకుండా సునీల్ గవాస్కర్‌కు మెంటర్‌గా పనిచేశాడు. 86 వయసులో 2020లో నందకర్ణి కన్నుమూశాడు.