Ashwin Team India: టీమిండియా 36 పరుగులకే ఆలౌట్.. ఆ వెంటనే పాటల కచేరీ: రవిశాస్త్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన అశ్విన్-ashwin reveals ravi shastri organized karaoke after team india 36 all out against australia ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ashwin Team India: టీమిండియా 36 పరుగులకే ఆలౌట్.. ఆ వెంటనే పాటల కచేరీ: రవిశాస్త్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన అశ్విన్

Ashwin Team India: టీమిండియా 36 పరుగులకే ఆలౌట్.. ఆ వెంటనే పాటల కచేరీ: రవిశాస్త్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన అశ్విన్

Hari Prasad S HT Telugu
Sep 16, 2024 02:03 PM IST

Ashwin Team India: టీమిండియా 36 పరుగులకే ఆలౌటైన తర్వాత ఏం చేసిందో తెలుసా? అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన షాకింగ్ పని గురించి తాజాగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆ మ్యాచ్ తాలూకు అనుభవాలను అతడు పంచుకున్నాడు.

టీమిండియా 36 పరుగులకే ఆలౌట్.. ఆ వెంటనే పాటల కచేరీ: రవిశాస్త్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన అశ్విన్
టీమిండియా 36 పరుగులకే ఆలౌట్.. ఆ వెంటనే పాటల కచేరీ: రవిశాస్త్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన అశ్విన్ (Getty)

Ashwin Team India: ఆస్ట్రేలియా చేతుల్లో టీమిండియా కేవలం 36 పరుగులకే ఆలౌటైన విషయం గుర్తుంది కదా. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇండియన్ టీమ్ కు ఇది అతి తక్కువ స్కోరు. 2020-21 పర్యటనలో భాగంగా తొలి టెస్టులోనే మన టీమ్ దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే పీడకలలాంటి ఆ ఇన్నింగ్స్ తర్వాత అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్లేయర్స్ తో ఓ పాటల కచేరీ నిర్వహించినట్లు తాజాగా అశ్విన్ చెప్పాడు.

ఆ రోజే డిన్నర్, కచేరీ

ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టులోనే టీమిండియా 36 పరుగులకు ఆలౌటైంది. ఆ మ్యాచ్ లో దారుణమైన ఓటమి తప్పలేదు. అయితే మ్యాచ్ ఓడిన తర్వాత ఆ రోజు రాత్రే రవిశాస్త్రి డిన్నర్ ఏర్పాటు చేయడమే కాదు.. కారియోకే (పాటల కచేరీ) స్టార్ట్ చేసి తాను పాడటం మొదలు పెట్టాడని అశ్విన్ చెప్పాడు.

"సిరీస్ విజయం గురించి ఆ సమయంలో మేము అసలు ఆలోచించనే లేదు. ఎందుకంటే మొత్తం టీమ్ వాతావరణం అంతా డల్లయిపోయింది. కానీ సాయంత్రం రవి భాయ్ టీమ్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు అతడు పాట కూడా పాడాడు. కారియోకే స్టార్ట్ చేసి పాడటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మిగతా వాళ్లు కూడా అతన్ని ఫాలో అయ్యారు" అని యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ విమల్ కుమార్ తో అశ్విన్ చెప్పాడు.

"అప్పుడు విరాట్ టీమ్ ను వదలి వెళ్తున్నాడు. అందుకే పాజిటివ్ గా ఉండి మెల్‌బోర్న్ వెళ్లి గెలవాలన్నది టీమ్ ఉద్దేశంగా ఉంది. సిరీస్ గురించి ఆలోచించలేదు. చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ఆ తర్వాత ఒక్కో మ్యాచ్ పై దృష్టిసారిస్తూ వెళ్లాం" అని అశ్విన్ వెల్లడించాడు.

ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్

ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సిరీస్ లు గెలిచిన ఏకైక టీమ్ గా ఇండియాకు పేరుంది. 2018-19, 2020-21 పర్యటనల్లో సిరీస్ లు సొంతం చేసుకుంది. 2020లో అయితే తొలి టెస్టులో అంత ఘోరంగా ఓడినా కూడా తిరిగి పుంజుకొని రహానే కెప్టెన్సీలోని టీమ్ 2-1తో సిరీస్ గెలిచింది. ఇప్పుడు మళ్లీ ఈ ఏడాది చివర్లో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది టీమిండియా.

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సిరీస్ విన్ తప్పనిసరి. ఇండియా ఈ సైకిల్లో మరో 10 టెస్టులు ఆడాల్సి ఉంది. అందులో స్వదేశంలో బంగ్లాదేశ్ తో రెండు, న్యూజిలాండ్ తో మూడు.. ఆస్ట్రేలియాలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ తో తొలి టెస్టు ఈ గురువారం (సెప్టెంబర్ 19) నుంచి ప్రారంభం కానుంది.

Whats_app_banner