Tata Nexon CNG : బెస్ట్ సెల్లింగ్ టాటా నెక్సాన్‌కి ‘సీఎన్జీ’ టచ్.. లాంచ్ ఎప్పుడు?
Tata Nexon CNG : Tata Nexon CNG : బెస్ట్ సెల్లింగ్ టాటా నెక్సాన్‌కి ‘సీఎన్జీ’ టచ్ ఇచ్చేందుకు సంస్థ రెడీ అవుతోంది. ఈ మోడల్‌పై ప్రస్తుతం ఉన్న వివరాలను ఇక్కడ చూద్దాము..
Tata Nexon CNG launch date : టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని గతేడాది లాంచ్ చేసిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్.. ఇప్పుడు ఈ ఎస్‌యూవీకి సీఎన్జీ వర్షెన్‌ని ప్లాన్ చేస్తోంది. ఈ నెక్సాన్ సీఎన్జీ మోడల్.. త్వరలోనే ఇండియాలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ టాటా నెక్సాన్ సీఎన్జీ వేరియంట్ ఒకటి.. పూణేలోని ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఎస్యూవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
టాటా నెక్సాన్ సీఎన్జీ..
ఇండియాలో టాటా మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్న వాహనాల్లో నెక్సాన్ ఒకటి. ఇక దీనికి.. సీఎన్జీ వర్షెన్‌ని తీసుకొస్తున్నట్టు.. గతేడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రకటించింది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన నెక్సాన్ సీఎన్జీ మోడల్ని ప్రదర్శించింది. ఈ సెగ్మెంట్లో ఇలాంటి ఇంజిన్ ఇదే తొలిసారి!
Tata Nexon CNG on road price : ఇక ఈ ఎస్యూవీ లాంచ్‌పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ.. ఈ ఏడాది రెండో భాగం చివర్లో ఈ సీఎన్జీ మోడల్ మార్కెట్లోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్లోని ఇంజిన్.. 118 బీహెచ్పీ పవర్‌ని, 170 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. సీఎన్జీ విషయానికొస్తే.. ఈ నెంబర్లు తగ్గుతాయి. 100 బీహెచ్పీ పవర్, 150 ఎన్ఎం టార్క్ వరకు జనరేట్ అవ్వొచ్చు. ఇది కూడా చాలా ఇంప్రెసివ్ ఫిగర్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా సీఎన్జీ ఇంజిన్స్.. ఇంత పవర్, టార్క్‌ని జనరేట్ చేయడం లేదు.
ఇదీ చూడండి:- Mahindra XUV 3XO vs Maruti Suzuki Brezza : ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
ఇక టాటా నెక్సాన్ సీఎన్జీలో 6 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుందని టాటా మోటార్స్ సంస్థ తెలిపింది. అంతేకాదు.. ఈ ఎస్‌యూవీలో 6 స్పీడ్ ఆటోమెటిక్ మేన్యువల్ ట్రాన్స్మిషన్ ఏఎంటీ కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది.
Tata Nexon CNG on road price Hyderabad : మరి ఈ టాటా నెక్సాన్ సీఎన్జీలో ఎన్ని వేరియంట్లు ఉంటాయి? వాటి ధరలు ఎలా ఉంటాయి? వంటి వివరాలు అందుబాటులోకి రాలేదు. వీటిపై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది.
సీఎన్జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్..
ఇటీవలి కాలంలో.. ఇండియాలో సీఎన్జీ వాహనాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. అందుకే.. ఆటోమొబైల్ సంస్థలు సీఎన్జీ వెహికిల్స్ లాంచ్పైనా ఫోకస్ చేశాయి. ఈ విషయంలో.. టాటా మోటార్స్ దూకుడుగా ఉందనే చెప్పుకోవాలి.
Tata Nexon on road price Hyderabad : టాటా పంచ్‌లో పెట్రోల్, ఈవీ, సీఎన్జీ వర్షెన్లు ఉన్నాయి. ఇలా.. ఇండియాలో మూడు మోడల్స్‌లో అందుబాటులో ఉన్న ఏకైక వెహికిల్.. టాటా పంచ్. ఇక నెక్సాన్ సీఎన్జీ కూడా లాంచ్ అయితే.. పంచ్ సరసన చేరుతుంది. ఇప్పటికే.. టాటా నెక్సాన్, టాటా నెక్సాన్ ఈవీలు రోడ్లపై దూసుకెళుతున్నాయి.
మరి లాంచ్ తర్వాత.. ఈ టాటా నెక్సాన్ సీఎన్జీ, క్టమర్లను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!
సంబంధిత కథనం