Stock market news : స్టాక్​ మార్కెట్​లు అప్​.. మదుపర్లకు రూ. 2లక్షల కోట్ల లాభం!-stock market news sensex nifty rise investors richer by 2 lakh crore ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market News : స్టాక్​ మార్కెట్​లు అప్​.. మదుపర్లకు రూ. 2లక్షల కోట్ల లాభం!

Stock market news : స్టాక్​ మార్కెట్​లు అప్​.. మదుపర్లకు రూ. 2లక్షల కోట్ల లాభం!

Sharath Chitturi HT Telugu
Jul 11, 2023 05:05 PM IST

Stock market news : స్టాక్​ మార్కెట్​లో లాభాల జోరు కొనసాగుతోంది. ఫలితంగా మంగళవారం మదుపర్ల సంపద రూ. 2లక్షల కోట్ల మేర పెరిగింది!

 స్టాక్​ మార్కెట్​లు అప్​.. మదుపర్లకు రూ. 2లక్షల కోట్ల లాభం!
స్టాక్​ మార్కెట్​లు అప్​.. మదుపర్లకు రూ. 2లక్షల కోట్ల లాభం! (Mint)

Stock market news : దేశీయ స్టాక్​ మార్కెట్​లు వరుసగా రెండో సెషన్​ను లాభాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 274 పాయింట్లు పెరిగి 55,618 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 84 పాయింట్లు వృద్ధిచెంది 19,439 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 116 పాయింట్లు కోల్పోయి 44,745 వద్దకు చేరింది.

తాజా ట్రేడింగ్​ సెషన్​లో.. సన్​ఫార్మా, ఐషేర్​ మోటార్స్​, అపోలో హాస్పిటల్స్​, టాటా కన్జ్యూమర్​ ప్రాడక్ట్స్​, మారుతీ సుజుకీ షేర్లు 1.5శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ముగిశాయి. మరోవైపు యూపీఎల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, బజాజ్​ ఫినాన్స్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు 1శాతం కన్నా ఎక్కువగా నష్టపోయాయి.

బీఎస్​ఈ మిడ్​క్యాప్​ ఇండెక్స్​ 0.97శాతం వృద్ధిచెందగా.. స్మాల్ ​క్యాప్​ సూచీ 0.82శాతం లాభపడింది. మంగళవారం సెషన్​లో స్మాల్​ క్యాప్​ సూచీ సరికొత్త ఆల్​టైమ్​ హైని నమోదు చేసింది.

రూ. 2లక్షల కోట్ల లాభం..!

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి బీఎస్​ఈ కంపెనీల మార్కెట్​ క్యాపిటల్​ రూ. 299.4 లక్షల కోట్లుగా ఉంది. కాగా తాజా లాభాలతో అది రూ. 301.3 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఒక్క రోజులో మదుపర్ల సంపద రూ. 1.9లక్షల కోట్లు పెరిగినట్టు!

ఇదీ చూడండి:- స్టాక్​ మార్కెట్​లో నష్టపోతున్నారా? ఇలా 'సక్సెస్​' అవ్వండి..

రిలయన్స్​, ఎయిర్​టెల్​, బజాజ్​ ఆటో, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, టాటా మోటార్స్​, సన్​ఫార్మాతో పాటు మొత్తం మీద 181 సంస్థల షేర్లు ఇంట్రాడేలో 52 వీక్​ హైని నమోదు చేశాయి.

కారణాలేంటి..?

Stock market news today : ఇండియా స్టాక్​ మార్కెట్​లు వరుసగా లాభాలు నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా కొన్ని సానుకూల పరిస్థితులు ఉండటం ఇందుకు ఓ కారణం. అమెరికాలో ద్రవ్యోల్బణం డేటా బుధవారం వెలువడనుంది. దీని ఆధారంగా ఫెడ్​ సభ్యులు వడ్డీ రేట్లపై ఓ నిర్ణయం తీసుకుంటారు. ఈసారి కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి అని మార్కెట్​ ఫిక్స్​ అయ్యింది. వాస్తవానికి ఇది ప్రతికూల విషయమే. అయితే.. ఫెడ్​ సభ్యుల్లో కొందరు చేసిన వ్యాఖ్యలతో పరిస్థితులు సానుకూలంగా మారాయి! ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటోందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా మదుపర్లలో ఆశలు చిగురించాయి.

"ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడ్​ ఈసారి కూడా వడ్డీ రేట్లను పెంచుతుంది. కానీ ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటోందని చాలా మంది ఫెడ్​ సభ్యులు భావిస్తున్నారు," అని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదికను ప్రచురించింది.

Whats_app_banner

సంబంధిత కథనం