Digital Rupee : భవిష్యత్తులో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం డిజిటల్ కరెన్సీ లావాదేవీలు.. ఆర్బీఐకి రిక్వెస్ట్!-india digital currency google pay phonepe paytm and amazon pay look to join rbis digital rupee ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Digital Rupee : భవిష్యత్తులో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం డిజిటల్ కరెన్సీ లావాదేవీలు.. ఆర్బీఐకి రిక్వెస్ట్!

Digital Rupee : భవిష్యత్తులో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం డిజిటల్ కరెన్సీ లావాదేవీలు.. ఆర్బీఐకి రిక్వెస్ట్!

Anand Sai HT Telugu
Aug 08, 2024 12:11 PM IST

RBI Digital currency : డిజిటల్ కరెన్సీ మీద వర్క్ నడుస్తూనే ఉంది. ఇప్పటికే డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ ప్రవేశపెట్టింది. కానీ ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. గతంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ బాండ్ల ట్రేడింగ్‌ను డిజిటల్ కరెన్సీ ద్వారా నిర్వహించింది.

డిజిటల్ కరెన్సీ
డిజిటల్ కరెన్సీ

ఇ-రూపాయి ద్వారా లావాదేవీలను సులభతరం చేసేందుకు డిజిటల్ కరెన్సీ కోసం గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్ పే వంటి సంస్థలు ఆర్బీఐ నుంచి అనుమతి కోరినట్లు నివేదికలు వస్తున్నాయి. భారతీయ ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడ్, మొబిక్విక్ కూడా ఇందులో భాగం కావడానికి ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. ఈ చెల్లింపు సంస్థలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో చర్చలు చేస్తున్నట్టుగా ఉన్నాయి. వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఇ-రూపే యాక్సెస్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తగ్గిన లావాదేవీలు

గత ఏడాది చివరి నాటికి ఇ-రూపాయి లావాదేవీలు రోజుకు 1 మిలియన్ కంటే ఎక్కువ ఉండగా, అవి గణనీయంగా రోజుకు 100,000-200,000కి పడిపోయాయని ఒక నివేదిక చెబుతుంది. ఇ-రూపాయి లావాదేవీలను సులభతరం చేయడానికి ప్రముఖ చెల్లింపు సంస్థలకు అనుమతి ఇవ్వడం ద్వారా వినియోగదారులను పెంచే అవకాశం ఉంటుంది. ఇది డిజిటల్ రూపీ లావాదేవీ వాల్యూమ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు.

పేమెంట్ యాప్స్‌కు ఇస్తే

పైన చెప్పిన సంస్థలు UPI ద్వారా 85 శాతం కంటే ఎక్కువ డిజిటల్ చెల్లింపులను కలిగి ఉన్నాయి. నెలవారీ 13 బిలియన్ల లావాదేవీలను నిర్వహిస్తాయి. సెంట్రల్ బ్యాంక్ ఇ-రూపాయిని ప్రమోట్ చేయడం కొనసాగిస్తున్నప్పటికీ, డిజిటల్ కరెన్సీని పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు తక్షణ ప్రణాళికలు లేనట్టుగా అర్థమవుతోంది. రాబోయే రెండేళ్లపాటు ఇ-రూపాయి ప్రయోగాత్మక దశలోనే ఉంటుంది.

పూర్తిస్థాయిలో రాని డిజిటల్ రూపీ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 2022లో e-రూపాయి పైలట్‌ను ప్రారంభించింది. ఈ డిజిటల్ రూపీ లావాదేవీలలో ప్రారంభంలో పెరుగుదల ఉన్నప్పటికీ, అవి తరువాత ఎక్కువగా ఉపయోగించుకోలేదు. డిజిటల్ కరెన్సీలను ప్రోత్సహించడంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఇవి సూచిస్తున్నాయి.

ప్రారంభంలో కొన్ని బ్యాంకులు తమ మొబైల్ యాప్‌ల ద్వారా మాత్రమే డిజిటల్ రూపాయిని అందించడానికి అనుమతించబడ్డాయి. అయితే ఏప్రిల్‌లో, ఆర్‌బిఐ ఆమోదం తర్వాత చెల్లింపు సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఇ-రూపాయి లావాదేవీలను కూడా అందించవచ్చని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.

డిజిటల్ కరెన్సీ అంటే

డిజిటల్ రూపాయిని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్వారా జారీ చేయబడిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC). ఇది బ్లాక్‌చెయిన్ లేదా పంపిణీ చేసిన లెడ్జర్ టెక్నాలజీపై పనిచేసే భారతీయ రూపాయి డిజిటల్ వెర్షన్‌. దీని ద్వారా సమర్థవంతమైన డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడం, భారతదేశ సాంకేతిక పురోగతికి సరిపోలడం లక్ష్యంగా పెట్టుకుంది. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల మాదిరిగా కాకుండా డిజిటల్ రూపాయి పూర్తిగా RBI ద్రవ్య విధానం, చెల్లింపుల మీదనే ఉంటుంది. ఆర్బీఐ దీనిని మానిటర్ చేస్తుంది.

డిజిటల్ లావాదేవీలు పెంచితే భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. డిజిటల్ రూపాయి వర్చువల్ కరెన్సీ.. దానికి ఎటువంటి రిస్క్ ఉండదు. ఈ విధానం పూర్తిస్థాయిలో వస్తే నోట్ల ప్రింటింగ్ విషయం కూడా ఖర్చు తగ్గుతుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఫాస్ట్ ఎక్స్ఛేంజ్ సాధ్యమవుతుంది. ఈ రూపాయి కూడా నిజమైన కరెన్సీకి సమానమైనది.

Whats_app_banner