Zee Telugu Serial: ఆ టాప్ సీరియల్ ఇక నుంచి ఆదివారం కూడా టెలికాస్ట్.. అనౌన్స్ చేసిన జీ తెలుగు ఛానెల్-zee telugu serial prema entha madhuram to telecast on sunday too ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Telugu Serial: ఆ టాప్ సీరియల్ ఇక నుంచి ఆదివారం కూడా టెలికాస్ట్.. అనౌన్స్ చేసిన జీ తెలుగు ఛానెల్

Zee Telugu Serial: ఆ టాప్ సీరియల్ ఇక నుంచి ఆదివారం కూడా టెలికాస్ట్.. అనౌన్స్ చేసిన జీ తెలుగు ఛానెల్

Hari Prasad S HT Telugu

Zee Telugu Serial: జీ తెలుగు ఛానెల్ ఇప్పుడు మరో టాప్ సీరియల్ ను కూడా ఆదివారం టెలికాస్ట్ చేయబోతోంది. కొన్నాళ్లుగా తమ ఛానెల్లో వస్తున్న చాలా సీరియల్స్ ను సోమవారం నుంచి ఆదివారం వరకు అసలు గ్యాప్ లేకుండా టెలికాస్ట్ చేస్తున్న విషయం తెలుసు కదా.

ఆ టాప్ సీరియల్ ఇక నుంచి ఆదివారం కూడా టెలికాస్ట్.. అనౌన్స్ చేసిన జీ తెలుగు ఛానెల్

Zee Telugu Serial: జీ తెలుగు ఛానెల్లోని టాప్ టీఆర్పీ రేటింగ్ సీరియల్స్ ఒకటైన ప్రేమ ఎంత మధురం ఇక నుంచి ఆదివారం కూడా టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఛానెల్ వెల్లడించింది. గత నాలుగేళ్లుగా జీ తెలుగులో వస్తున్న ఈ సీరియల్ ఇప్పటికే 1400కుపైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడీ సీరియల్ అసలు గ్యాప్ లేకుండా ప్రతి రోజూ రానుంది.

ప్రేమ ఎంత మధురం ఆదివారం కూడా..

ప్రేమ ఎంత మధురం సీరియల్ 2020లో ప్రారంభమైంది. నాలుగేళ్లుగా ఈ సీరియల్ జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఇన్నాళ్లూ సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమైన ప్రేమ ఎంత మధురం.. ఇక నుంచి ఆదివారం కూడా రానుందని ఆ ఛానెల్ వెల్లడించింది. అంటే వచ్చే ఆదివారం (నవంబర్ 24) నుంచే ఈ సీరియల్ రాబోతోంది. ప్రతి రోజూ రాత్రి 10 గంటలకు ప్రేమ ఎంత మధురం టెలికాస్ట్ అవుతుంది.

ఆదివారం జీ తెలుగు సీరియల్స్

కొన్ని నెలలుగా జీ తెలుగు తమ ఛానెల్లో వచ్చే సీరియల్స్ ను ఆదివారం కూడా టెలికాస్ట్ చేస్తున్న విషయం తెలుసు కదా. సాయంత్రం ప్రైమ్ టైమ్ లో వచ్చే సీరియల్స్ విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలా ఇప్పటికే సాయంత్రం 6 గంటలకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, 6.30 గంటలకు మా అన్నయ్య, 7 గంటలకు నిండు నూరేళ్ల సావాసం, 7.30 గంటలకు మేఘ సందేశం, 8 గంటలకు పడమటి సంధ్యారాగం సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. ఇక నుంచి రాత్రి 10 గంటలకు ఈ ప్రేమ ఎంత మధురం రానుంది.

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి తాజాగా 46వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. మేఘ సందేశం 8.13 రేటింగ్ తో టాప్ లో ఉంది. ఓవరాల్ గా తెలుగు టీవీ సీరియల్స్ లో ఏడో స్థానం సొంతం చేసుకుంది.

ఆ తర్వాత 7.59తో నిండు నూరేళ్ల సావాసం, 7.30తో పడమటి సంధ్యారాగం, 6.48తో త్రినయని, 6.2తో జగద్ధాత్రి సీరియల్స్ ఉన్నాయి. ఈసారి కూడా జీ తెలుగు సీరియల్స్ టాప్ 6లో చోటు దక్కించుకోలేకపోయాయి. ప్రేమ ఎంత మధురం సీరియల్ కు తాజాగా 3.57 రేటింగ్ లభించింది.