Bengaluru-Abu Dhabi flight: బెంగళూరు, అబుదాబి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్-air india express launches international flights on bengaluru abu dhabi route ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bengaluru-abu Dhabi Flight: బెంగళూరు, అబుదాబి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్

Bengaluru-Abu Dhabi flight: బెంగళూరు, అబుదాబి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్

HT Telugu Desk HT Telugu
Jul 24, 2024 02:35 PM IST

Bengaluru-Abu Dhabi flight: కర్నాటక సహా దక్షిణాది రాష్ట్రాల ప్రయాణికులు గల్ఫ్ దేశాలకు వెళ్లడం మరింత సులువైంది. బెంగళూరు నుంచి అబుదాబీకి డైెరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ను ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రారంభించింది. ఇది వారానికి నాలుగుసార్లు, మంగళ, గురు, శని, ఆదివారాల్లో బెంగళూరు నుంచి అబుదాబికి వెళ్తుంది.

బెంగళూరు, అబుదాబి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్
బెంగళూరు, అబుదాబి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్

Bengaluru-Abu Dhabi flight: కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి అబుదాబికి ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ తొలి అంతర్జాతీయ విమానాన్ని మంగళవారం ప్రారంభించింది. బెంగళూరు నుంచి అబుదాబికి తొలి డైరెక్ట్ ఇంటర్నేషనల్ సర్వీసును ప్రవేశపెట్టడంతో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తన విమాన నెట్వర్క్ ను మరింత విస్తృతం చేసింది. ఎయిరిండియాకు ఇప్పుడు బెంగళూరు అతిపెద్ద ఆపరేషనల్ హబ్ గా మారింది. ఇక్కడి నుంచి వారానికి 200 కంటే ఎక్కువ విమానాలను ఎయిర్ ఇండియా నిర్వహిస్తుంది.

27 నగరాలకు ఎయిర్ ఇండియా సర్వీసులు

బెంగళూరు నుంచి జాతీయ, అంతర్జాతీయ మార్గాలలో 27 నగరాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను నడుపుతోంది. వాటిలో అబుదాబి, అయోధ్య, బాగ్డోగ్రా, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, గోవా, గౌహతి, గ్వాలియర్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కన్నూర్, కొచ్చి, కోల్ కతా, కోజికోడ్, లక్నో, మంగళూరు, ముంబై, పూణే, రాంచీ, సూరత్, తిరువనంతపురం, వారణాసి, విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాలున్నాయి. కొత్తగా, అబుదాబీకి డైరెక్ట్ సర్వీస్ ప్రారంభం కావడంతో ఆయా నగరాల నుంచి అబుదాబీకి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా ఎయిర్ ఇండియా సేవలు పొందవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అబుదాబి నుండి బెంగళూరు, కన్నూర్, కొచ్చి, కోజికోడ్, మంగళూరు, ముంబై, తిరువనంతపురం మరియు తిరుచిరాపల్లిలను కలుపుతూ ప్రత్యక్ష విమానాలను నడుపుతుంది. 17 భారతీయ నగరాలను సౌకర్యవంతమైన వన్-స్టాప్ ప్రయాణాల ద్వారా అబుదాబితో కలుపుతుంది.

వారానికి నాలుగు రోజులు..

బెంగళూరు-అబుదాబి సర్వీసు వారానికి నాలుగు సార్లు, మంగళ, గురు, శని, ఆదివారాల్లో నడుస్తుంది. ఆయా రోజుల్లో విమానాలు బెంగళూరు నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:00 గంటలకు అబుదాబికి చేరుతాయి. తిరుగు ప్రయాణంలో అబుదాబిలో సాయంత్రం 6:55 గంటలకు బయలుదేరి అదే రోజు తెల్లవారుజామున 12:40 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

Whats_app_banner