తెలుగు న్యూస్ / తెలంగాణ /
IRCTC Hyderabad To Varanasi : హైదరాబాద్ నుంచి వారణాసి, అయోధ్య ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్- 6 రోజుల ప్యాకేజీ వివరాలివే
IRCTC Hyderabad To Varanasi Package : వారణాసి, సారనాథ్, అయోధ్య వంటి పుణ్య క్షేత్రాల సందర్శనకు హైదరాబాద్ నుంచి ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ. ఈ టూర్ వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నుంచి వారణాసి, అయోధ్య ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్- 6 రోజుల ప్యాకేజీ వివరాలు
IRCTC Hyderabad To Varanasi Package : హైదరాబాద్ నుంచి గంగా రామాయణ యాత్ర టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ. 6 రోజులు సాగే ఈ యాత్రలో వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్య పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు. జులై 20, ఆగస్టు 12, ఆగస్టు 16, ఆగస్టు 21 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఎయిర్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్రారంభ ధర రూ. 29,850.
ఎయిర్ టూర్
తేదీ | ఫ్లైట్ నెం | ఎక్కడి నుంచి | సమయం | ఎక్కడికి | సమయం |
జులై 20, ఆగస్టు 12, 16, 21 | 6E915 | హైదరాబాద్ | 9.40 | వారణాసి | 11.25 |
జులై 25, ఆగస్టు 17, 21, 26 | 6E6166 | లక్నో | 18.05 | హైదరాబాద్ | 20.00 |
ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ ధర
క్లాస్ | సింగిల్ ఆక్యుపెన్సీ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్(5-11 సంవత్సరాలు) | చైల్డ్ వితవుట్ బెడ్(5-11 సంవత్సరాలు) | చైల్డ్ వితవుట్ బెడ్(2-4 సంవత్సరాలు) |
కంఫర్ట్ | రూ.39400 | రూ.31000 | రూ.29850 | రూ.27650 | రూ.23050 | రూ.17400 |
పర్యటన ఇలా : వారణాసి - ప్రయాగ్‌రాజ్ - అయోధ్య - లక్నో - నైమిశారణ్య (05 రాత్రులు/06 రోజులు)
- 1వ రోజు : హైదరాబాద్ నుంచి వారణాసి - హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి పర్యాటకులు బయలుదేరి వారణాసి చేరుకుంటారు. వారిని హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో భోజనం చేసిన తర్వాత కాశీ విశ్వనాథుడి దర్శనం, గంగా ఘాట్ ను సందర్శిస్తారు. రాత్రి వారణాసిలో స్టే చేస్తారు.
(వారణాసి ఘాట్‌లు, ఆలయానికి బస్సులు అనుమతించరు. ఆలయాన్ని, ఘాట్‌లను సందర్శించడానికి పర్యాటకులు సొంత ఖర్చులతో ఆటో-రిక్షాలలో ప్రయాణించాలి).
- 2వ రోజు : హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత సారనాథ్ స్థూపం సందర్శించడానికి వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి వారణాసికి చేరుకుంటారు. స్థానికంగా బిర్లా ఆలయం, ఘాట్‌లను సందర్శించడం లేదా షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. వారణాసిలో రాత్రి బస చేస్తారు.
- 3వ రోజు: వారణాసి - ప్రయాగ్‌రాజ్ - అయోధ్య - హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి ప్రయాగ్‌రాజ్‌కి బయలుదేరతారు. అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం సందర్శిస్తారు. సాయంత్రం అయోధ్యకు బయలుదేరతారు.రాత్రికి అయోధ్యలో బస చేస్తారు.
- 4వ రోజు: అయోధ్య - లక్నో : హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి అయోధ్య బాలరాముడిని దర్శించుకుంటారు. మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి లక్నోకు బయలుదేరతారు. రాత్రికి లక్నోలో బస చేస్తారు.
- 5వ రోజు: లక్నో - నైమిశారణ్య - లక్నో : బ్రేక్ ఫాస్ట్ అనంతరం నైమిశారణ్య దర్శనానికి వెళ్తారు. సాయంత్రం తిరిగి లక్నో చేరుకుని రాత్రికి లక్నోలో బస చేస్తారు.
- 6వ రోజు : లక్నో - హైదరాబాద్ : బ్రేక్ ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. బారా ఇమాంబరాను సందర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు లక్నో విమానాశ్రయంలో డ్రాప్ చేస్తారు. దీంతో పర్యటన ముగుస్తుంది
హైదరాబాద్ -వారణాసి గంగా రామాయణ యాత్ర టికెట్లు బుక్కింగ్, పూర్తి వివరాలకు ఈ కింద లింక్ పై క్లిక్ చేయండి.
సంబంధిత కథనం