IRCTC Hyderabad To Baidyanath Dham : హైదరాబాద్ నుంచి బైద్య నాథ్ ధామ్ యాత్ర-ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలిలా!
IRCTC Hyderabad To Baidyanath Dham : బీహార్ బైద్య నాథ్ జ్యోతిర్లింగ దర్శనం, బుద్ధ గయ, నలంద సందర్శించేందుకు ఐఆర్సీటీసీ 5 రోజుల ఎయిర్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ఆగస్టు 27న ఈ టూర్ ప్రారంభం అవుతుంది.
IRCTC Hyderabad To Baidyanath Dham : ఐఆర్సీటీసీ బీహార్ బైద్య నాథ్ ధామ్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి 5 రోజుల ఎయిర్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ లో బుద్ధ గయ, నలంద, రాజ్‌గిర్ , బైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం, ఆధ్యాత్మిక, పర్యటక ప్రదేశాలు కవర్ చేస్తారు. ఈ టూర్ ప్యాకేజీ ఆగస్టు 27, 2024 అందుబాటులో ఉంది. ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.24,750. బీహార్ లోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలు బుద్ధ గయ, పురాతన విశ్వవిద్యాలయ పట్టణం నలంద, చారిత్రాత్మక నగరం రాజ్‌గిర్‌లను ఈ యాత్రలో సందర్శించవచ్చు.

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ ఖర్చు:
సింగిల్ ఆక్యుపెన్సీ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్(5-11 సంవత్సరాలు) | చైల్డ్ వితవుట్ బెడ్(5-11 సంవత్సరాలు) | చైల్డ్ విత్ బెడ్(2-4 సంవత్సరాలు) |
రూ.33450 | రూ.25850 | రూ.24750 | రూ.22550 | రూ.21850 | రూ.16150 |
ప్రయాణం ఇలా :
1వ రోజు : హైదరాబాద్ - గయ - మొదటి రోజు ఉదయం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నానికి గయా చేరుకుంటారు. ఎయిర్ పోర్టు నుంచి పర్యాటకులను పికప్ చేసి హోటల్‌కి తీసుకెళ్తారు. బుద్ధ గయ దేవాలయం, పరిసర బౌద్ధ దేవాలయాలను సందర్శసి్తారు. బుద్ధ గయలో రాత్రి బస చేస్తారు.
2వ రోజు : గయ - నలంద - గయ - రెండో రోజు ఉదయం హోటల్‌లో అల్పాహారం చేసి నలంద, రాజ్‌గిర్ పర్యాటనకు (70 కి.మీ.) ప్రత్యేక వాహనంలో బయలుదేరతారు. నలంద, రాజ్ గిర్ సందర్శించుకుని సాయంత్రానికి బుద్ధ గయ చేరుకుంటారు.రాత్రికి బుద్ధ గయలోనే బస చేస్తారు.
3వ రోజు : గయ - దియోగర్ - మూడో రోజు ఉదయాన్నే గయ విష్ణు పాదం ఆలయం, మంగళ్ గౌరీ ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. దియోగర్‌కు (220 కి.మీ.) బయలుదేరి వెళ్తారు. రాత్రికి దియోగర్ చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. రాత్రికి దియోగర్‌లో బస చేస్తారు.
4వ రోజు : దియోగర్ - 4వ రోజు ఉదయం హోటల్‌లో అల్పాహారం చేసి బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తారు. ఆ తర్వాత త్రికూట్ పర్వతాన్ని సందర్శించవచ్చు. రాత్రికి దియోగర్‌లో బస చేస్తారు.
5వ రోజు : దియోగర్ - హైదరాబాద్ - హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి చెక్ అవుట్ చేస్తారు. అనంతరం పర్యాటకులను దియోగర్ విమానాశ్రయంలో డ్రాప్ చేస్తారు. విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరతారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.
హైదరాబాద్ నుంచి బీహార్ 5 రోజుల టూర్ ప్యాకేజీ బుక్కింగ్, పూర్తి వివరాలను ఈ కింద లింక్ లో తెలుసుకోవచ్చు.
విమాన ప్రయాణ వివరాలు :
తేదీ | ఫ్లైట్ నెం | ఎక్కడి నుంచి | సమయం | ఎక్కడికి | సమయం |
27.08.2024 | 6E6494/5253(వయా కోల్ కతా) | హైదరాబాద్ | 06.00 | గయ | 11.25 |
31.08.2024 | 6E6437/638(వయా బెంగళూరు) | దియోగర్ | 12.55 | హైదరాబాద్ | 19.35 |
సంబంధిత కథనం