AP Free Gas Cylinder : సబ్సిడీపై 3 సిలిండర్లు ఇచ్చి.. 20 సిలిండర్ల డబ్బులు లాగుతున్నారు.. వైసీపీ చెప్పిన 8 విషయాలు-ysrcp 8 questions on free gas cylinder distribution in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Free Gas Cylinder : సబ్సిడీపై 3 సిలిండర్లు ఇచ్చి.. 20 సిలిండర్ల డబ్బులు లాగుతున్నారు.. వైసీపీ చెప్పిన 8 విషయాలు

AP Free Gas Cylinder : సబ్సిడీపై 3 సిలిండర్లు ఇచ్చి.. 20 సిలిండర్ల డబ్బులు లాగుతున్నారు.. వైసీపీ చెప్పిన 8 విషయాలు

Basani Shiva Kumar HT Telugu
Oct 31, 2024 06:06 PM IST

AP Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమైంది. వినియోగదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. వైసీపీ కూటని ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. 3 సిలిండర్లు ఇచ్చి.. 20 సిలిండర్ల డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించింది. వైసీపీ వెర్షన్ ఎంటో ఓసారి చూద్దాం.

ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం వైసీపీ విమర్శలు
ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం వైసీపీ విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో దీపావళీ పండగ సందర్భంగా కూటమి ప్రభుత్వం కీలక హామీని నెరవేర్చింది. మహిళలకు కళ్లల్లో ఆనందం చూడాలని ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. అయితే.. మహిళల కళ్లల్లో ఆనందం కాదు.. కన్నీరు కారబోతోందని వైసీపీ అంటోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌ను తెరపైకి తీసుకొచ్చి.. తెరవెనక ముక్కుపిండి డబ్బులు వసూలు చేసేందుక ప్లాన్ వేశారని ఆరోపిస్తోంది.

వైసీపీ వెర్షన్‌లోని ప్రధానాంశాలు..

1.చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు.. ఇది వీరబాదుడు.

2.దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతోంది.

3.సబ్సిడీ మీద 3 సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ.. 20 సిలిండర్ల డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.

4.కరెంటు బిల్లు పెంచం అని వాగ్దానాలు చేసి, సంపద సృష్టిస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పుడు కరెంటు బిల్లు పెంచి.. పేదవాళ్లకు కరెంటు షాక్ కొట్టిస్తున్నారు.

5. మూడు ఉచిత సిలిండర్లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రూ.2685 కోట్లు. ఎడమ చేత్తో సబ్సిడీ ఇచ్చి.. కుడి చేత్తో విద్యుత్ ఛార్జీలు పెంచి బ్యాలెన్స్ చేసే ప్రతిభ చంద్రబాబుకే సొంతం. యూనిట్ రేటు పెంపు వలన ఇదే నవంబర్ ఒకటో తారీకు నుంచి రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం రూ.17, 072 కోట్లు.

6.సూపర్ సిక్స్‌లోని ఒక పథకం అమలు చేస్తూ ప్రజలపై వేసిన అదనపు భారం రూ.14,378 కోట్లు. (విద్యుత్ ఛార్జీల పెంపు, సర్దుబాటు వలన అదనపు భారం రూ.17072 కోట్లు. దాంట్లో నుంచి రూ.2,685 కోట్లు తీసెస్తే.. రూ.14,378 కోట్ల భారం పడుతుంది.)

7.రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు 1.55కోట్లు ఉన్నాయి. తెల్ల కార్డులు మాత్రం 1.47 కోట్లు ఉన్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నది తెల్ల రేషన్ కార్డులున్న వారికే. ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? దగా చేయడం కాదా? వెన్నుపోటు కాదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.

8.కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లల్లో దరిద్ర దేవత తాండవిస్తుంటే.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరేశ్వర ఇళ్లల్లో మాత్రం లక్ష్మీదేవత తాండవిస్తుంది.. అని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.

Whats_app_banner