YSR Road Accident : వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురు మృతి!-ysr district apsrtc bus auto met accident four died on spot several injured ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Road Accident : వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురు మృతి!

YSR Road Accident : వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురు మృతి!

Bandaru Satyaprasad HT Telugu
Oct 09, 2023 03:21 PM IST

YSR Road Accident : వైఎస్ఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

YSR Road Accident : వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన సమాచారం అందుకున్న జమ్మలమడుగు డీఎస్పీ, ఎర్రగుంట్ల తహసీల్దార్‌ ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రొద్దుటూరు, కడపకు చెందిన 11 మంది ప్రొద్దుటూరు నుంచి మల్లెలకు పాసింజర్ ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో ఆటో లారీని తప్పించబోతుండగా ఎర్రగుంట్ల నుంచి వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా డ్రైవర్‌తో సహా ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారు కడప ఆజాద్ నగర్‌కు చెందిన మహమ్మద్ (25), హసీనా (25), అమీనా(20), షాకీర్(10)లుగా పోలీసులు గుర్తించారు.

yearly horoscope entry point

పాఠశాల బస్సును ఢీకొట్టిన లారీ

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం కొత్తతండా సమీపంలో పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 28 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రైవేటు స్కూల్ కు చెందిన బస్సు విద్యార్థులతో జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తోంది. కొత్త తండాలోని స్కూల్ కు సమీపంలో ఓ మలుపు వద్ద బస్సు యూటర్న్‌ తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 28 మంది విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులను స్థానికులు మహబూబ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి రవీందర్‌, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు.

హర్యానాలో లోయలో పడ్డ బస్సు

హర్యానాలోని నైనిటాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నళిని ప్రాంతంలో పర్యాటకులతో వెళ్తోన్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. స్థానికుల సమాచారంలో రంగంలోకి దిగిన పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందారు. గాయపడిన ప్రయాణికులను బయటకు తీసేందుకు సహాయ బృందాలు శ్రవిస్తున్నాయి. నైనిటాల్ నుంచి హర్యానాకు తిరిగి వస్తుండగా, కలదుంగి నైనిటాల్ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని కలదుంగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హల్ద్వానీకి తరలించారు. ఈ ప్రమాదంలో సమాచారం అందుకున్న ఎస్ఎస్పీ ప్రహ్లాద్ నారాయణ్ మీనాతో సహా మొత్తం బృందం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. లోయలో గల్లైంతన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Whats_app_banner